ప్రతి రోజు వినాల్సిన 6 వేద పాఠాలు | 6 Life Lessons From Veda's | Telugu Geeks
Author Name:Telugu Geeks
Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UdW0ZjW_DR0
Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మనం ఎప్పుడైనా గమనించామా మన పూర్వీకులు మన ముత్తాతలు ఈరోజు మనకున్న సౌకర్యాలు వాళ్ళకి లేకపోయినా చాలా ధైర్యంగా ప్రశాంతంగా బ్రతికారు కానీ ఈరోజు మన దగ్గర అన్ని ఉన్నాయి ఒక మనశశాంతి తప్ప ఎందుకంటే మన వేదాల్లోని అసలైన జ్ఞానాన్ని మనం పక్కన పెట్టేసి బయట ఎక్కడో సమాధానాల కోసం మనం వెతుకుతున్నాం.
(00:24) వేదాలు అంటే కేవలం మంత్రాలు పూజలు మాత్రమే కావు అవి మనిషి తన మనసుని ఎలా గెలవాలో కష్టాల్లో కూడా ధైర్యంగా ఎలా నిలబడాలో చెప్పే ఒక గొప్ప లైఫ్ గేట్ కొన్ని వేల ఏళ్ల క్రితమే మన ఋషులు మనిషికి ఉన్న అన్ని మెంటల్ ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్స్ ఈ వేదాల్లో చెప్పేశారు. అయితే ఆ వేదాల్లోని కష్టమైన విషయాల్ని ఈ కాలానికి అర్థమయ్యేలాగా మన రోజువారి జీవితానికి పనికొచ్చే విధంగా ఆచార్య శూన్య గారు ఆవిడ రాసిన సోవరన్ సెల్ఫ్ అనే పుస్తకంలో అద్భుతంగా వివరించారు.
(00:55) ఈ పుస్తకం మనకు ఒకటే చెప్తుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నిన్ను శాసించడం కాదు నీ జీవితానికి నువ్వే బాస్ అదే ఈ పుస్తకంలో క్లియర్ గా చెప్పారు. ఒకవేళ మీరు కూడా అనవసరమైన భయాలతో వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటే ఈ పుస్తకంలో మన లైఫ్ ని మార్చేసే సొల్యూషన్స్ చెప్పారు. సో ఈరోజు ఈ వీడియోలో మనం వేదాల నుంచి తీసుకున్న ఆరు చాలా పవర్ఫుల్ విషయాల గురించి మాట్లాడుకుందాం.
(01:20) అండ్ ఇది విన్నాక మీ మీద మీకే ఉన్న నమ్మకం 100 రెట్లు పెరుగుతుంది నాది గ్యారెంటీ. చాలా ఏళ్ల క్రితం ఒక రాజ్యంలో ఒక పెద్ద మట్టి విగ్రహం ఉండేది. ఆ విగ్రహం చూడటానికి అంత అందంగా ఉండేది కాదు అందరూ దాన్ని చూసి ఈ మట్టి విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టారురా బాబు అని అనుకునేవారు. కానీ ఒకసారి ఒక పెద్ద వర్షం పడింది. నాలుగైదు రోజులు ఆ వర్షం కురుస్తూనే ఉంది.
(01:54) ఆ వర్షం దెబ్బకి ఆ విగ్రహం పైనన్న మట్టి పొరలు అన్ని కారిపోయాయి. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ మట్టి పొరల కింద సామాన్యమైన విగ్రహం కాదు నిలువెత్తు బంగారు విగ్రహం ఉంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఒక యుద్ధం వచ్చినప్పుడు ఆ బంగారాన్ని కాపాడటం కోసం మన పూర్వీకులు దాని మీద మట్టి పూసారు. ఆ తర్వాత అది కాలక్రమేనా అందరూ ఆ మట్టినే నిజమైన విగ్రహం అని అనుకున్నారు.
(02:17) ఒక్కసారి మనం ఆలోచిస్తే మన జీవితం కూడా ఇలాగే ఉంది. మన పైనఉన్న మట్టి ఏంటో తెలుసా మన కులం, మన హోదా, మన బాడీ షేప్ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఆలోచనలు ఇవన్నీ కూడా మన పైనన్న మట్టి మనం ఈ మట్టి పొరలనే మనం అని అనుకుంటున్నాం. కానీ వేదాలు చెప్తున్న సత్యం ఏంటంటే నువ్వు ఈ మట్టి పొర కాదు నువ్వు లోపలన్న అమూల్యమైన బంగారానివి ఆచార్య శూన్య గారు తన పుస్తకంలో ఇదే చెప్తారు మన అహంకారం అనే మట్టిని మనం పట్టుకొని వేలాడుతున్నాం.
(02:46) మనం ఉద్యోగం పోతే లైఫ్ లో ఏదైనా ఫెయిల్యూర్ వస్తే కేవలం ఒక మట్టి పొరపోయినట్టు మాత్రమే నీ లోపల ఉన్న ఆ సోవరన్ సెల్ఫ్ అంటే నీ ఒరిజినల్ ఆత్మ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది. ఆ బంగారాన్ని మనం గుర్తించిన రోజు బయట ప్రపంచం మనల్ని ఏమన్నా మనకి సంబంధం ఉండదు. యు ఆర్ నాట్ ద మెస్ యు ఆర్ ద మాస్టర్ పీస్ బిహైండ్ అండర్ నీడ్ ద మెస్ సో ఆ మట్టిని తీసేయ్ నీ అసలైన రాజసం బయటపడుతుంది.
(03:16) ఒక ఊరిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది దానికి అపారమైన శక్తి ఉంది. కానీ దానికి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆకలి వేస్తే పంట పొలాలను నాశనం చేసేస్తుంది. కోపం వస్తే ఇల్లను కూల్చేస్తుంది. ఆ ఏనుగు వల్ల ఆ ఊరి జనం అందరూ కూడా భయపడిపోయేవారు కానీ ఆ ఊరిలోకి ఒక మంచి మావటివాడు వచ్చాడు. ఆ ఏనుగుని మచ్చిగా చేసుకున్నాడు. ఆ మామిడివాడు సన్నగా పీనుగులా ఉన్నాడు.
(03:38) కానీ అతని చేతిలో ఒక చిన్న అంకుశం ఉంది. ఆ అంకుశంతో అతను ఆ భార్య ఏనుగుని తన మాట వినేలా చేసుకున్నాడు. ఆలోచిస్తే మన జీవితంలో ఆ ఏనుగు ఏంటో తెలుసా మన మనసు మన సెన్సెస్ మన ఇంద్రియాలు దానికి ఎంతో శక్తి ఉంది కానీ అది అదుపులో లేకపోతే మన జీవితాన్నే మనం నాశనం చేసుకుంటాం. మరి ఆ మావటి వాడు ఎవరు అతనే మన వివేకం మన దగ్గర ఆ వివేకం అనే అంకుశం లేకపోతే మన సెన్సెస్ మనల్ని ఎక్కడికో లాక్కెళ్ళిపోతాయి.
(04:08) సో మన సెన్సెస్ మన కంట్రోల్ లో లేకపోతే మనం దేనికైనా బానిస అయిపోతున్నాం అన్నమాట. అండ్ మనం దేనికైనా బానిస అవుతున్నాం అంటే మన లోపల ఆ మామిటివాడు నిద్రపోతున్నాడు అని అర్థం. ఆచార్య శూన్య గారు తన పుస్తకంలో ఒక గొప్ప విషయం చెప్తారు అది ఏంటంటే మన ఇంద్రియాలు మన సెన్సెస్ ని మనం ఎప్పుడూ తిట్టాల్సిన అవసరం లేదు. వాటిని చంపేయాల్సిన అవసరం అంతకంటే లేదు మనం చేయాల్సిందల్లా వాటికి కొంచెం డిసిప్లిన్ నేర్పించడమే మీరు మీ ఫోన్ ని వాడుకోండి కానీ ఫోన్ మిమ్మల్ని వాడుకొనివ్వకుండా చూడండి అలాగే మీరు ఆహారాన్ని ఆస్వాదించండి కానీ ఆ ఆహారమే మనల్ని అనారోగ్యం పాలు
(04:41) చేయకుండా చూసుకోవాలి. అలాగే మీ ఇంద్రియాలకి మీరు రాజుఅవ్వాలి కానీ ఆ ఇంద్రియాలు చెప్పినట్లు మీరు తలాడించే బంటు కాకూడదు. సో యువర్ సెన్సెస్ ఆర్ గ్రేట్ సర్వెంట్స్ బట్ టెర్రిబుల్ మాస్టర్స్. ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక అద్భుతమైన భూమి ఉంది. ఆ భూమి ప్రత్యేకత ఏంటంటే మీరు అందులో ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది.
(05:08) సో మన రైతు ఏం చేసాడు మంచి ఆనందంలో ఉన్నాడు ఒక మంచి మామిడి విత్తనం వేసాడు. సో కొన్నేళ్ళ తర్వాత ఒక చెట్టు వచ్చింది ఆ చెట్టు నుంచి కొన్ని పనులు వచ్చాయి తీయటి మామిడికాయలు తింటూ హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పుడో ఎవడో ఏదో అన్నాడని కోపం మీద ఒక పాయిజనస్ విత్తనం వేసాడు. దానివల్ల విషం వచ్చే మొక్క వచ్చింది అండ్ మనోడు అది తిని చనిపోయాడు.
(05:29) ఇక్కడ ఆ భూమి లోపం ఏమి లేదు ఆ భూమికి మీరు వేసింది మంచిదా లేదా చెడ్డదా అని సంబంధం లేదు దానికి తెలిసిందల్లా మీరు వేసిన విత్తనాన్ని పెంచడం మాత్రమే మన మనసు కూడా సరిగ్గా ఆ భూమి లాంటిదే మన ఆలోచనలే ఆ విత్తనాలు మన మెదడులో రోజు ఎలాంటి ఆలోచనలు వేస్తున్నాం నేను చేయలేను వాడు నాకంటే గొప్పవాడు నా బతికింతే ఇలాంటి నెగిటివ్ విత్తనాలు వేస్తే మన జీవితం కూడా ముల్ల కంపలా తయారవుతుంది.
(05:54) మనకి మన వేదాలు చెప్పే సత్యం ఏంటంటే మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని సృష్టిస్తాయి. యద్భావం తద్భవతి అండ్ ఈ పుస్తకంలో ఆచార్య శూన్య గారు ఒక మాట అంటారు మన ఆలోచనలు మనకు తెలియకుండానే మన భవిష్యత్తుని డిజైన్ చేస్తున్నాయి. మీరు ఒక పనిని భయంతో మొదలు పెడితే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. అదే మీరు నేను ఈ యూనివర్స్ లో ఒక భాగాన్ని నాలో చాలా శక్తి ఉంది అనే ఆలోచనతో మొదలు పెడితే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి.
(06:24) తోటలో పిచ్చి మొక్కలను ఎలా పీకేస్తామో మన మనసులోని పనికిరాని ఆలోచనలను కూడా అలాగే పీకేయాలి. యువర్ మైండ్ ఇస్ ఏ ఫెర్టైల్ ల్యాండ్ బి కేర్ఫుల్ వాట్ సీడ్స్ యు ప్లాంట్ ఇన్ నువ్వు నాటిన ఆలోచనలే రేపు నీ తలరాతగా మారుతుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మీలో చాలా మంది నా వీడియోలు చూసి నాకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. సందీప్ అన్న నీ కంటెంట్ నీ ఆలోచనలు మా జీవితాలని మారుస్తున్నాయి అంతా బాగుంది.
(06:50) కానీ వీటిని నిజ జీవితంలో ఎలా అప్లై చేయాలో కొంచెం చెప్పవా ఇలా అడుగుతూ ఉంటారు. అండ్ ఈ ప్రతి కామెంట్ ఈ ప్రతి మెసేజ్ నాకు వస్తున్న ఈమెయిల్స్ అన్ని నేను చదువుతాను. మీరు అడిగిన ఆ ప్రశ్నే నన్ను ఒక కొత్త విషయాన్ని క్రియేట్ చేసేలా చేసింది. అదే తెలుగు గీక్స్ అకాడమీ అండ్ ఇందులో నేను మీకోసమే ఒక హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేశాను. అదే ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్.
(07:11) ఇందులో మనందరం కలిసి పని చేస్తాం. కొంచెం డీప్ డైవ్ గా ప్రీ రికార్డెడ్ వీడియోలు ఉంటాయి. మీరు ఈ కోర్స్ కొన్న మొదటి రోజు నుంచే మీరు వాడుకోగలిగే డౌన్లోడబుల్ వర్క్ షీట్స్ ఉంటాయి. అలాగే నేను స్వయంగా తయారు చేసిన ఎక్స్క్లూసివ్ అఫర్మేషన్స్ అలాగే గైడెడ్ మెడిటేషన్స్ కొన్ని ఎక్సర్సైజులు కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సు లో నేను పెట్టాను.
(07:32) అండ్ ఈ కోర్సులో నేను మాట్లాడబోయే టెక్నిక్స్ అన్నీ కూడా నేను కొన్నేళ్లుగా స్వయంగా నేర్చుకున్నవి నేను వాడుతున్నవి. మీరు ఎవరైనా సరే ఏం చేస్తున్నా సరే స్టూడెంట్ అయినా క్రియేటర్ అయినా కార్పొరేట్ ఎంప్లాయి అయినా లేదా ఒక ఆంట్ర్ప్రన్యూర్ అయినా కమ్యూనికేషన్ అనేది మస్ట్ అండ్ ఇదిఒక ఆర్ట్ ఇది ఎవరైనా సరే నేర్చుకోవచ్చు ఇది ఎవరికైనా సరే సాధ్యమే ఈ కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు లాభపడతారు.
(07:53) అండ్ ఇది ప్రస్తుతం 2499 కోర్స్ ని 1499 కే తెలుగు గీక్స్ అకాడమీలో అందిస్తున్నాం. దానికి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అలాగే పిండు కామెంట్ లో నేను పెడతాను. అలాగే ఇప్పటికే మా కోర్సులో జాయిన్ అయ్యి మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. కొంతమందికి ఇంకా ఎలా లాగిన్ అవ్వాలో తెలియడం లేదు అంటున్నారు.
(08:15) వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ లో ఎస్ఓపి ఫర్ లెర్నర్స్ అని పెడుతున్నాను ఒక్కసారి చెక్ చేయండి. అండ్ ఈ తెలుగు గీక్స్ అకాడమీలో మీకోసం మరిన్ని విలువైన కోర్సులను తీసుకురావడానికి మేము కష్టపడుతున్నాం. మీకు ఈ ప్లాట్ఫామ్ బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బ్యాక్ టు ద టాపిక్. ఒక ఊర్లో ఒక గొప్ప స్టంట్ మన్ ఉండేవాడు అతను గాలిలో కట్టిన సన్నని తాడు మీద చాలా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు.
(08:40) అందరూ అతన్ని అడిగారు నీకు అసలు ఇది ఎలా కుదురుతుంది భయం వేయదా కింద పడిపోతాను అని అనిపించదా ఆ మూలకు అసలు ఎలా వెళ్తావ అనుకుంటున్నావ్ అని అడిగారు. దానికి అతను ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. నేను ఆ తాడు మీద నడుస్తున్నంతసేపు అవతల వైపు ఉన్న ఆ గమ్యం గురించి ఆలోచించను అలాగే కింద ఉన్న లోయ గురించి కూడా నేను ఆలోచించను నా దృష్టి అంతా కూడా కేవలం నా తర్వాత అడుగు మీద మాత్రమే ఉంటుంది అని అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అని చూస్తున్నారు అండ్ మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం మనం ఒక పనిని చేస్తున్నప్పుడు మన మెదడు రెండు చోట్ల ఉంటుంది ఒకటి గెలిస్తే వచ్చే సంతోషం
(09:16) రెండోది ఏంటి ఓడిపోతే వచ్చే అవమానం ఈ రెండిటి మధ్య ఉండి మనం ప్రస్తుత ప్రస్తుత క్షణంలో వేయాల్సిన అడుగుని మనం మర్చిపోతున్నాం. ఫలితం మీద మీకు ఎంత తక్కువ ఆశ ఉంటే మీ అడుగు అంత బలంగా పడుతుంది. భయం అనేది ఫలితం నుండి పుడుతుంది. ధైర్యం అనేది మీ నుండి పుడుతుంది. వేదాల్లోని ఈ పాయింట్ ని ఆచార్య శూన్య గారు చాలా బాగా చెప్పారు.
(09:37) మన కర్మ మీద మాత్రమే మనకి అధికారం ఉంది అంటే మనం చేసే పని మీద మాత్రమే మనకు అధికారం ఉంది కానీ మనం ఫలం గురించి ఆలోచిస్తున్నాం రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాం మన శక్తిని వృధా చేసుకుంటున్నాం. మీరు ఫలితాన్ని వదిలేసిన రోజున మీ లోపల ఉన్న అసలైన రాజు ఆ సోవరిన్ సెల్ఫ్ మీ లోపల మీరు దాచేసిన మీ అధిపతి అతను బయటక వస్తాడు. అప్పుడు మీరు చేసే పనిలో ఒక క్లారిటీ వస్తుంది వేగం పుంజుకుంటుంది.
(10:04) డోంట్ స్టెప్ ఫర్ ద గోల్ స్టెప్ ఫర్ ద సేక్ ఆఫ్ ద స్టెప్ ఫలితాన్ని వదిలే విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. [సంగీతం] మన పురాణాల్లో ఒక కథ ఉంది ఒక అడవిలో ఒక కస్తూరి మృగం ఉండేది. కస్తూరి మృగం అంటే ఒక జింకలో ఒక రకం దాని శరీరం నుంచి ఒక అద్భుతమైన సువాసన ఒక సెంట్ స్మెల్ వస్తుండేది. కానీ ఆ జింకకు ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు ఆ వాసనను వెతుక్కుంటూ అడవి మొత్తం తిరుగుతుంది.
(10:34) కొండలెక్కుతుంది అడవిలో ప్రతి మూల వెతుకుతుంది. చివరికి దాన్ని కనిపెట్టలేక నిరాశతో కుంగిపోతుంది. కానీ అసలు నిజం ఏంటంటే ఆ సువాసన బయట ఎక్కడి నుంచో రావడం లేదు అది దాని నాభి నుంచి వస్తుంది. సేమ్ మనం కూడా ఈరోజు సరిగ్గా ఈ జింక లాగే ఉన్నాం. సంతోషం కోసం ఒక కొత్త మొబైల్ కొంటాం. ప్రశాంతత కోసం టూర్లకు వెళ్తాం. గౌరవం ఇతరుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం.
(10:57) మనక ఏదో తక్కువ ఉందని స్కేర్సిటీ ఉందని బయట ఏదో దొరికితేనే మనం పరిపూర్ణవంతులం అవుతామని ఒక భ్రమలో ఉంటున్నాం. కానీ వేదాలు చెప్పే పరమ సత్యం ఏంటో తెలుసా పూర్ణమదః పూర్ణమిదం అంటే నువ్వు ఇప్పటికే పరిపూర్ణుడివి నువ్వు ఒక పరిపూర్ణుడి నుంచి పుట్టావు అండ్ నువ్వు కూడా ఒక పరిపూర్ణుడివే నీ దగ్గర నీకు కావాల్సిందంతా ఉంది నువ్వు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు అదే ఈ లైన్ చెప్తుంది.
(11:23) ఆచార్య శూన్య గారు తన పుస్తకంలో కూడా ఇదే పాయింట్ ని గట్టిగా చెప్తారు. సోవరిన్ సెల్ఫ్ అంటే నీకు ఏది తక్కువ లేదని తెలుసుకోవడం బయట పరిస్థితులు మారితేనే నేను బాగుంటాను అని అనుకోవడం ఒక టైప్ ఆఫ్ స్లేవరీ బానిసత్వం నేను ఎలా ఉన్నా నా లోపల ఆనందం ఉంది అని అనుకోవడమే మనపై మనం సాధించే సోవరినిటీ మనపై మనం సాధించే ఆధిపత్యం నీ లోపల ఉన్న ఆ అనంతమైన శక్తిని గుర్తించిన రోజు నువ్వు దేనికోసం ఎవరి ముందు చేయి చాపవు ఎందుకంటే నువ్వు ఒక అడుక్కునేవాడివి కాదు నువ్వు ఒక మహారాజువు సో స్టాప్ యాక్టింగ్ [సంగీతం] ల ఏ బెగర్ వెన్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ [సంగీతం]
(12:03) ఒక అడవిలో రాజైన సింహం ఉంది. ఒకసారి ఒక బావిలోకి చూసింది. ఆ సింహానికి నీళ్లలో తన రిఫ్లెక్షన్ కనిపించింది. కానీ ఆ సింహం ఏమనుకుంటుంది ఆ బావిలో ఇంకొక సింహం ఉందని అది తనను చూసి విక్కరిస్తుందని భ్రమపడుతుంది. తన రిఫ్లెక్షన్ చేసే ప్రతి కదలికని చూసి అది తన మీద దాడి చేయడానికి వచ్చిన శత్రువు అని అనుకని గర్జించి ఆ బావిలోకి దూకేసింది.
(12:27) మనం చిన్నప్పటి నుంచి విన్న కథే కానీ ఎందుకు చెప్తున్నాను అంటే దీంట్లోని పాయింట్ మనకి ఇంకా బలంగా తగులుతుంది. మన జీవితంలో మనం భయపడే ఆ ఎదుటి మనిషి ఎవరో కాదు మనలోని మన రిఫ్లెక్షనే వేదాల ప్రకారం ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో ప్రపంచం కూడా నీకు అదే చూపిస్తుంది. నిన్ను నువ్వు బలహీనుడు అనుకుంటే నువ్వు వీక్ గానే కనబడతావ్ అందరూ నిన్ను అలాగే చూస్తారు అనగదొక్కాలనే చూస్తారు.
(12:54) నువ్వు నిన్ను రాజులా చూసుకుంటే లోకం కూడా నీకు తల వంచుతుంది. అసలైన భయం బయట వ్యక్తుల్లో లేదు నీ మనసులో ఉన్న మీ తప్పుడు రిఫ్లెక్షన్ లో ఉంది. ఈ పుస్తకంలో కూడా ఆచార్య శూన్య గారు ఒక పవర్ఫుల్ పాయింట్ చెప్తారు. సోవరేనిటీ అంటే వేరే వాళ్ళ అభిప్రాయాల నుంచి మనం ఫ్రీడమ్ పొందడం. మేటర్ సింపుల్ అండి మీరు ఎవరో మీకు తెలియదు అనుకోండి వేరేవాడు వచ్చి మీకు పేరు పెడతాడు.
(13:14) అదే మీరు ఎవరో మీకు తెలిస్తే ఎవడో ఏమి చేయలేడు. మీలో ఒక మంచి పవర్ ఉంది నేను చాలా పవర్ఫుల్ పర్సన్ అని మీరు అనుకున్నప్పుడు ఎవరి విమర్శలు మిమ్మల్ని తాకలేవు. ఆ బావిలో ఉన్నది శత్రువు కాదు మీ నీడ మాత్రమే అని తెలుసుకోవడం జ్ఞానం. సో స్టాప్ ఫైటింగ్ ద రిఫ్లెక్షన్స్ స్టార్ట్ మాస్టరింగ్ ద సోర్స్ నువ్వు మారితే మీ ప్రపంచం కూడా మారుతుంది.
(13:35) అండ్ వీడియో చివరికి వచ్చేసింది మనకి బాగా గుర్తుండడానికి ఈ పాయింట్స్ ని ఒకసారి రివైజ్ చేసేస్తాను. ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది. ముందుగా ద గోల్డెన్ స్టాట్యూ నువ్వు నీ పైన ఉన్న మట్టివి కాదు మీ లోపల ఎప్పుడూ మెరిసే బంగారానివి. మీ అసలైన రూపం ఆ ఆత్మే ద ఎలిఫెంట్ అండ్ ద స్టిక్ మీ సెన్సెస్ ఒక బలమైన ఏనుగు లాంటివి వాటిని మీ వివేకం అనే అంకుశంతో కంట్రోల్ చేయాలి.
(14:00) అప్పుడే మీరు మీ జీవితానికి రాజవుతారు. ద గార్డెన్ ఆఫ్ మైండ్ మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని సృష్టించే విత్తనాలు మంచి ఆలోచనలు నాటితేనే మీ జీవితం అందమైన తోటలా మారుతుంది. ద టై రోప్ వాకర్ ఫలితం గురించి భయం వదిలేసి ప్రస్తుత క్షణంలో వేసే అడుగు మీద దృష్టి పెట్టండి. గమ్యం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటేనే మీ అడుగు ఇంకా బలంగా పడుతుంది.
(14:21) ద మస్క్ డియర్ సంతోషం బయట ఎక్కడో లేదు అది మనలోనే ఉంది. మీలో అన్ని విషయాలు ఉన్నాయి మీలో అన్ని పవర్లు ఉన్నాయని మీరు గుర్తించడమే వేదం చెప్పే గొప్ప సత్యం ద లయన్ ఇన్ ద రిఫ్లెక్షన్ లోకం నిన్ను చూసి నవ్వుతుందేమో అని భయపడటం అంటే మీ నేడని మీరు చూసి భయపడటమే మీరు ఎవరో మీకు తెలిస్తే ఎవరి విమర్శలు మిమ్మల్ని టచ్ చేయలేవు.
(14:42) అండ్ చివరిగా ఒక మాట వేదాలు అంటే ఏదో పాతకాలపు మంత్రాలు కావు అవి మీ లోపల నిద్రపోతున్న రాజుని నిద్రలేపే శబ్దాలు మనం ఇన్నాలు ఒక గొర్రెల ఒక బానిసల పరిస్థితులకి లొంగిపోతున్నాం. కానీ ఈరోజు మన పైన పట్టిన ఆ మట్టి పొరలను విదిలించి బయటకి పంపాలి. మీరు ఈ యూనివర్స్ లో ఒక భాగం మీకు సాధ్యం కానిది ఏది లేదు మీ జీవితానికి వేరే ఎవరో బాస్ కాదు మీరే మీ సామ్రాజ్యానికి కింగ్ సో ఈ వేదాల్లోని ఆరు సత్యాలని మీ గుండెలో దాచుకోండి.
(15:08) ఇక ఏ భయం మిమ్మల్ని ఆపలేదు. మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పాయింట్ ఏంటనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్ [సంగీతం]
No comments:
Post a Comment