Monday, August 31, 2026

అన్నీ ఉన్నా శాంతి లేదా? శివుడు చెప్పిన వైరాగ్య రహస్యం | Lord Shiva

అన్నీ ఉన్నా శాంతి లేదా? శివుడు చెప్పిన వైరాగ్య రహస్యం | Lord Shiva

Author Name:Sanmaarg Thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ol2lXcvDasw



Transcript:
(00:00) ఈ వీడియో నీ దాకా వచ్చిందంటే బహుశా ఈశ్వరుడు నీకు ఒక విషయం గుర్తు చేయాలని అనుకుంటున్నారేమో మనలో చాలామందికి వైరాగ్యం అంటే ఏమనిపిస్తుంది ఇల్లు వదిలేయడం కుటుంబాన్ని వదిలేయడం డబ్బుని వదిలేయడం అన్నింటిని వదిలేసి అడవులకు వెళ్ళిపోవడం అని అనుకుంటారు. కానీ వైరాగ్యానికే ప్రతిరూపమైన పరమేశ్వరుడు పార్వతీ దేవిని ఎందుకు వివాహం చేసుకున్నారు కైలాసంలో యోగిగా ఉండే శివుడు స్మసానంలో విహరించే శివుడు భస్మాన్ని ధరించే శివుడు నాగులనే ఆభరణాలుగా ధరించే శివుడు అలాంటి మహాదేవుడు పార్వతీ దేవిని ఎందుకు వివాహం చేసుకున్నారు మరి ఇక్కడ శివుడి వైరాగ్యం ఎక్కడికి పోయింది లేక
(00:33) మనమే వైరాగ్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నామా ఈ ప్రశ్నకి గనుక మీరు సమాధానం తెలుసుకుంటే మీరు సంసారంలో ఉంటూనే వైరాగ్యంతో ఎలా జీవించాలో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఈరోజు ఈ విషయాన్ని మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యేలా వివరిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాని వెల్కమ్ టు సన్మార్గ థాట్స్ శివపార్వతుల వివాహం కేవలం ఒక దేవతా వివాహ కథ కాదు.
(01:04) శివపురాణంలోని రుద్ర సంహిత పార్వతీ ఖండంలో పార్వతీ తపస్సు నుంచి శివపార్వతుల వివాహం వరకు ఈ కథ చాలా విస్తృతంగా వర్ణించబడింది. అంటే ఈ కథ మన ముందుకు ఒక అద్భుతమైన ప్రశ్నను తీసుకొస్తుంది. వైరాగ్యంలో ఉన్నవాడు సంబంధాలలోకి రావచ్చా అని. ఈ ప్రశ్నకు శివుడు తన మాటల్లో సమాధానం చెప్పలేదు కానీ తన జీవితంతో చూపించారు. పార్వతిని వివాహం చేసుకోవడం ద్వారా ఆయన మనకు చూపించింది ఏమిటంటే వైరాగ్యం అంటే సంబంధం లేకపోవడం కాదు వైరాగ్యం అంటే సంబంధం నిన్ను బంధించకుండా ఉండడం అని ఈ రెండింటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది.
(01:36) ఒకసారి ఆలోచించండి ఒక మనిషి ఇంట్లో ఉన్నాడు. ఆ మనిషి ఒక భార్య కావచ్చు ఒక భర్త కావచ్చు వారికి పిల్లలు ఉన్నారు ఉద్యోగం ఉంది డబ్బు ఉంది బాధ్యతలు ఉన్నాయి. కానీ అతని మనసు ప్రతిరోజు ఒకే భయంతో ఉంటుంది. ఇదంతా పోతుందేమో ఈ డబ్బు పోతుందేమో ఈ పేరు పోతుందేమో ఈ ఉద్యోగం పోతుందేమో ఎవరైనా తనని వదిలేస్తారేమో అని ఇలా తన ఆనందం మొత్తం బయట ఉన్న వాటి పైనే ఆధారపడి ఉంటుంది.
(02:02) ఇదే బంధం అంటే ఇంకొక మనిషి ఉంటాడు అదే కుటుంబంలో ఉంటాడు అదే బాధ్యతలు నిర్వహిస్తాడు అదే సంపాదిస్తాడు అదే ప్రేమిస్తాడు. కానీ అతనికి ఒక అంతర్గత స్పష్టత ఉంటుంది. ఆ అంతర్గత స్పష్టత ఏంటో తెలుసా ఇవన్నీ నాకు అప్పగించబడినవి. ఇవి నా జీవితంలో ముఖ్యమైనవి. కానీ ఇవేవి నా శాశ్వత స్వరూపం కాదు అని. ఇదే వైరాగ్యానికి దగ్గరైన స్థితి. ఇక్కడే మనం శివసూత్రాల దగ్గరికి వెళ్ళాలి.
(02:24) శివ సూత్రాల్లో మొదటి సూత్రం చైతన్యమాత్మ అని ఉంది. దీనికి సాధారణ అర్థం చైతన్యమే ఆత్మ అని. ఇదేమి సాధారణమైన మాట కాదు. ఇది చాలా లోతైన మాట. ఎలానో చెప్తాను వినండి. మన దగ్గర ఇల్లు ఉంది కారు ఉంది డబ్బు ఉంది సంబంధాలు ఉన్నాయి ఉద్యోగం కూడా ఉంది కానీ ఇవేమి మన అసలు స్వరూపం కావు ఇవన్నీ మన జీవితంలో మనం నిర్వహిస్తున్న పాత్రలు మాత్రమే మరి వీటన్నిటిని అనుభవిస్తున్నది ఎవరని ఆలోచించండి ఈ అనుభవాలన్నింటిని గమనిస్తున్నది అనుభవిస్తున్నది మనలోని చైతన్యం ఆ చైతన్యం ఇల్లు కాదు డబ్బు కాదు ఉద్యోగం కాదు ఒక సంబంధం కూడా కాదు అవన్నీ మీ జీవితంలో ఉన్న అనుభవాలు వాటిని
(03:01) గమనించేది మాత్రం అంతర్గత చైతన్యం అందుకే శివుడి తత్వంలో లో మనం ఒక విషయాన్ని గమనించాలి శివుడు ఈ ప్రపంచాన్ని తిరస్కరించినవాడు కాదు శివుడు ఈ ప్రపంచానికి బానిస కానివాడు. ఇప్పుడు అసలు ప్రశ్న మరి పార్వతి ఎవరు శివ పార్వతులను కేవలం భార్యా భర్తలుగా మాత్రమే చూస్తే మనం ఈ కథలో ఒక చిన్న అర్థానికే ఆగిపోతాం. శైవతత్వంలో దీన్ని ఒక ప్రతీకాత్మక అర్థంలో కూడా చూడవచ్చు.
(03:26) శివుడు చైతన్యానికి ప్రతీక. పార్వతి ఆ చైతన్యం వ్యక్తమయ్యే శక్తికి ప్రతీక. ఇవి రెండు పూర్తిగా వేరు వేరుని కాదు ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదని కూడా కాదు ఒకే పరతత్వం యొక్క రెండు కోణాలుగా వీటిని అర్థం చేసుకోవచ్చు అందుకే శివశక్తి భావనలో అర్ధనారీశ్వర రూపం కనిపిస్తుంది. అర్ధనారీశ్వరుడు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చైతన్యం దిశనిస్తుంది.
(03:49) శక్తి ఆ దిశను కార్యరూపంలో తీసుకువస్తుంది అని. శివ సూత్రాల్లోని ఇచ్చ శక్తి రూమ కుమారి అనే సూత్రాన్ని కూడా శైవతత్వంలో సంకల్ప శక్తి ఉమాశక్తి అనే భావంతో వ్యాఖ్యానిస్తారు. అంటే మనలో ఉన్న చైతన్యం ఒక సంకల్పంగా ఒక కోరికగా ఒక చర్యగా వ్యక్తమయ్యే శక్తికి పార్వతి ఒక ప్రతీకగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి శివపార్వతుల కథ అంటే ఏమిటి? ఇది ఒక యోగి పెళ్లి చేసుకున్న కథ మాత్రమే కాదు.
(04:13) చైతన్యం మరియు శక్తి కలిసి జీవితం సంపూర్ణంగా మారే తత్వాన్ని సూచించే కథగా కూడా దీన్ని చూడవచ్చు. ఇక్కడ ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కూడా కాదు రెండు తమ తమ స్థాయిలో అవసరమైనవే మరి దీని నుంచి మన జీవితానికి అర్థం ఏమిటి ఇక్కడే ఈ కథ మన జీవితంలోకి వస్తుంది. ప్రతి మనిషి చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నాకు వైరాగ్యం కావాలంటే నేను అన్నింటిని వదిలేయాలి అని అనుకోవడం.
(04:38) నీకు కుటుంబం ఉంటే కుటుంబాన్ని వదిలేయమని శివతత్వం చెప్పడం లేదు. నీకు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగాన్ని వదిలేయమని కూడా చెప్పడం లేదు. నీకు డబ్బు ఉంటే ఆ డబ్బుని పారేయమని కూడా చెప్పడం లేదు. ఇక్కడ ప్రశ్న ఒక్కటే నీ దగ్గర వస్తువులు ఉన్నాయా అనేది ముఖ్యం కాదు ఆ వస్తువులు నీ మనసులో ఎంత స్థానం సంపాదించుకున్నాయి అనేది ముఖ్యం. నీ దగ్గర డబ్బు ఉండడం సమస్య కాదు ఆ డబ్బే నీ విలువని నువ్వు అనుకోవడమే సమస్య.
(05:02) నీ భార్యను నీ భర్తను లేదా నీ కుటుంబాన్ని ప్రేమించడం సమస్య కాదు వాళ్ళ ఉనికినే నీ సంపూర్ణతకు ఏకైక ఆధారంగా చూడడమే బంధం. శివుడి జీవితం ఇచ్చే గొప్ప పాఠం ఇదే. ఒకవైపు కైలాసవాసి మరోవైపు పార్వతిపతి ఒకవైపు మహాయోగి మరోవైపు కుటుంబంతో ఉన్న గృహస్తుడు ఒకవైపు భస్మధారి మరోవైపు వివాహంలో వరుడుగా నిలిచిన శివుడు అందుకే శివుడి వైరాగ్యం సంబంధాలను తిరస్కరించిన వైరాగ్యం కాదు అది సంబంధాల మధ్యలో కూడా తన స్వరూపాన్ని కోల్పోని వైరాగ్యం.
(05:33) ఇక్కడ ఒక సహజమైన ప్రశ్న వస్తుంది. మనం ఎందుకులా బ్రతకలేకపోతున్నాం? మనల్ని బంధిస్తున్నది ఏంటి? అని శివ సూత్రాల్లో జ్ఞాన బంధం అనే సూత్రం కనిపిస్తుంది. ఇక్కడ జ్ఞానం అనే పదాన్ని సాధారణంగా చదువు లేదా తెలివి అని మాత్రమే తీసుకోకూడదు. శైవ వ్యాఖ్యాన సంప్రదాయంలో దీనిని పరిమితమైన అవగాహన మన నిజమైన స్వరూపాన్ని మరిచి ఒక చిన్న గుర్తింపుకే మనల్ని మనం పరిమితం చేసుకోవడం అనే కోణంలో అర్థం చేసుకోవచ్చు.
(05:57) ఎగ్జాంపుల్ కి నేను ఇంజనీర్ ని నేను తండ్రిని నేను తల్లిని నేను ఒక భర్తను నేను ఒక భార్యను నేను గెలిచిన వాడిని నేను ధనవంతుడిని ఇలా ఇవన్నీ మన జీవితంలో పాత్రలు లేదా అనుభవాలు కానీ ఆ పాత్ర ఒక్కటే నా పూర్తి ఉనికి అని అనుకోవడం ప్రారంభించినప్పుడు మనల్ని మనమే ఒక చిన్న గదిలో బంధించుకున్నట్టు అవుతుంది. నీ ఉద్యోగం నీలో ఒక భాగం నీ కుటుంబం నీ జీవితంలో ఒక గొప్ప భాగం నీ పేరు నీ సామాజిక గుర్తింపు కానీ ఇవన్నీ కలిపిన నీ మొత్తం ఉనికింత అవ్వవు అందుకే బంధం బయట మాత్రమే ఉండదు బంధం మొదట మనసులో తయారవుతుంది.
(06:32) ఇప్పుడు సామాన్య మనిషి వైరాగ్యాన్ని ఎలా జీవించాలి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి. దీనికోసం నాలుగు విషయాలు గుర్తుపెట్టుకో మొదటిది బాధ్యతను అస్సలు వదలద్దు. నీ కుటుంబాన్ని చూసుకో నీ పని నిజాయతిగా చెయ్ నీ కర్తవ్యాన్ని తప్పించుకోవడం వైరాగ్యం కాదు. బాధ్యతలను వదిలి పారిపోవడం ఆధ్యాత్మికత కాదు బాధ్యతల మధ్యలో కూడా మనసు సత్యంగా ఉండేలా చూసుకోవడమే ఆధ్యాత్మికతకు దగ్గరైన మార్గం.
(06:55) రెండవది ఫలితం పై నీ సంపూర్ణ ఆనందాన్ని ఆధారపెట్టొద్దు. నువ్వు కష్టపడాలి ప్రయత్నం చేయాలి. నీ వంతు పూర్తి చేయాలి. కానీ ఫలితం ప్రతిసారి నీ చేతిలో ఉండదు అనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఫలితం వచ్చినప్పుడు పొంగిపోవడం రాకపోయినప్పుడు పూర్తిగా కూలిపోవడం ఈ రెండు కూడా మనసుని బయట పరిస్థితులకు బానిసగా చేస్తాయి.
(07:15) ప్రయత్నం నీది ఫలితం మీద నీ నియంత్రణ అనేది పరిమితం. ఈ తేడాను నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ మనసులో కొంచెం శాంతి వస్తుంది. మూడవది ప్రేమించు కానీ సొంతం చేసుకోవద్దు. ఇది చాలా పెద్ద తేడా ప్రేమలో గౌరవం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది. ఇతరుడి ఎదుగుదలకు స్థలం ఉంటుంది. కానీ అతి మమకారంలో మాత్రం కోల్పోతానేమో అనే భయం పెరగవచ్చు. నువ్వు ఎవరినైనా ప్రేమించు వాళ్ళకు తోడుగా ఉండు కానీ వాళ్ళ ఆలోచన వాళ్ళ జీవితం వాళ్ళ ప్రతి నిర్ణయాన్ని నీ నియంత్రణలో పెట్టాలని మాత్రం ప్రయత్నించొద్దు.
(07:44) నువ్వు ఒకరిని ప్రేమించవచ్చు కానీ వారిని నీ సొత్తుగా చూడకపోవడం వైరాగ్యానికి దగ్గరయ్యే భావం. నాలుగవది ప్రతిరోజు నీకు నువ్వే ఒక ప్రశ్న అడుగు ఇది నా దగ్గర ఉందా లేక నేను దీనికి బానిసనా అని అది డబ్బు కావచ్చు బంధం కావచ్చు పేరు కావచ్చు, ఫోన్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అభిమానం కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వస్తువు నీ దగ్గర ఉండడం సమస్య కాదు అది లేకుండా నేను ఉండలేను అనుకునే స్థితి నీకు వచ్చినప్పుడు మాత్రం అది నీ మనసుపై అధికారం సాధించింది అని అర్థం.
(08:12) ఈ నాలుగు విషయాలు గనుక పాటిస్తే నువ్వు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇల్లు వదిలి పెట్టాల్సిన అవసరం కూడా లేదు సంసారంలో ఉంటూనే వైరాగ్య తత్వాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు ఈ నాలుగు పాయింట్లను ఒక్క మాటలో బంధించే శివుడి జీవితంలో ఒక అద్భుతమైన విరుద్ధాన్ని చూద్దాం. శివుడికి కైలాసం ఉంది పార్వతీ అమ్మవారు ఉన్నారు గణేశుడు కుమారస్వామి వంటి కుటుంబం ఉంది గణాలు ఉన్నారు భక్తులు ఉన్నారు అన్ని ఉన్నాయి కానీ శివుడి స్వరూపం వాటిలో ఎక్కడా చిక్కుకోలేదు.
(08:40) ఇక్కడే మనం మన జీవితాన్ని కూడా ఒకసారి చూసుకోవాలి. నువ్వు బాధపడుతున్నదంతా నిజంగా బయట ఉన్న సమస్యల వల్లేనా లేక ఇది నా ఇష్టం ప్రకారమే జరగాలి అనే పట్టుదల వల్లనా మనసు ఒక విషయాన్ని పట్టుకోవడం అంటే ఆ విషయం లేకపోతే మనం అసంపూర్ణులమని అనుకోవడం కాబట్టి ఈరోజు నుంచి ఏదైనా వదిలేయడానికి ప్రయత్నించే ముందు నీ మనసులో నాది అనే భావాన్ని కొంచెం కొంచెంగా గమనించు.
(09:05) అందుకే శివుడు కేవలం వైరాగి కాదు సంసారంలో ఉంటూనే వైరాగ్యంగా ఎలా జీవించాలో చూపించిన మహాదేవుడు. ఈ రోజు నుంచి ఈ మూడు ప్రశ్నలు అడుగు నేను ప్రేమిస్తున్నానా లేక సొంతం చేసుకోవాలని అనుకుంటున్నానా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నానా లేక ప్రశంస కోసం చేస్తున్నానా నా దగ్గర ఉన్నదంతా నాకే ఉపయోగపడుతుందా లేక నేను దానికి బానిసనా అని ఈ మూడు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పడం మొదలు పెడితే నీ ఇంట్లోనే నీకు వైరాగ్యపు మొట్టమొదటి మెట్టు కనిపిస్తుంది.
(09:33) ఇప్పుడు మనం ఈ వీడియో ప్రారంభంలో చెప్పుకున్న ప్రశ్నకు సమాధానాన్ని ఒకసారి చూద్దాం. వైరాగ్యానికి ప్రతీక అయిన పరమేశ్వరుడు పార్వతిని ఎందుకు వివాహం చేసుకున్నాడు సంసారం తప్పు కాదని చూపించడానికి ప్రేమ బంధనం కావలసిన అవసరం లేదని చెప్పడానికి బాధ్యతలు ఆధ్యాత్మికతకు అడ్డు కావని నేర్పడానికి మనసులో స్వేచ్ఛ ఉంటే కుటుంబంలో కూడా కైలాసాన్ని నిర్మించవచ్చని చూపించడానికి నీ కుటుంబాన్ని వదలద్దు నీ కోపాన్ని వదిలేయ్ నీ పని వదలద్దు చప్పట్ల కోసం చేయడం వదిలేయ్ డబ్బును సంపాదించడం ఆపవద్దు డబ్బే నీ విలువ అనుకోవడం వదిలేయ్ ప్రేమించడం వదలద్దు ప్రేమ పేరుతో ఆత్మగౌరవాన్ని
(10:07) పోగొట్టుకోవడం వదిలేయ్ ఇదే శివుడి ఇచ్చిన అసలైన వైరాగ్య పాఠం. నువ్వు ఆ సంసారాన్ని ధర్మంతో ప్రేమతో నిశబ్దంతో నడిపించిన రోజే నీ ఇల్లు కూడా ఒక చిన్న కైలాసంగా మారుతుంది. ఈ వీడియో నీ జీవితానికి ఉపయోగపడిందని నీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడే హర హర మహాదేవ అని కామెంట్ చెయ్. మీలో ఎవరైనా ఇప్పటికీ ఎలా జీవిస్తున్నారా లేక ఇప్పటి నుంచి ఎలా జీవించాలని అనుకుంటున్నారా తప్పకుండా ఇప్పుడే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి.
(10:33) దేవుళ్ళను చూస్తూ మనం ఎప్పుడూ అడగని ప్రశ్నలకు మన జీవితానికి ఉపయోగపడే సమాధానాల కోసం మన సన్మార్గ థాట్స్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక గొప్ప తత్వంతో మళ్ళీ కలుద్దాం హర హర మహాదేవ

No comments:

Post a Comment