రష్యన్ సైంటిస్ట్ అనుభవం। కోటకదిర చంద్రమౌళీశ్వరస్వామి #satyanandiraju #sanatandharma #hindu #ytviral
Author Name:Satya Sanatana Dharma Telugu Channel
Youtube Channel Url:https://www.youtube.com/@satyasanatanadharmateluguc6778
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UrIK4aBwngU
Transcript:
(00:00) అవతల వడ్డుకు చేర్చిన బెస్తవాడు ఎవరో కాదు సాక్షాత్తు వ్యాస భగవానుడు అని చెప్పారు అర్చకు ఇప్పటికీ కోట కదిరిలో ఆ కుటుంబీకుల ఇంట్లో కుంకుమ భరిణ నన్ను కామెంట్స్ చేస్తున్నారే కాకన్పుల్ స్టోరీస్ నీకు ఛాలెంజ్ అర్ధరాత్రి ఆలయానికి వెళ్లి చూస్తే మునులు కనిపించారు శివార్చన ఒక మార్గశీర మాసంలో సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క దర్శనం అయిపోయింది.
(00:21) చందని అడిగాడు ఎవరు తల్లి నువ్వు ఇన్ని సార్లు దర్శనం ఇస్తున్నావ్ వారి మరణ సమయాన్ని ముందుగానే డైరీలో అట్లా ఆ వ్రత దీక్ష చేసి చాలామంది సంతానాన్ని పొందారు. ఇప్పటి దాకా కూడా అసలు వారి యొక్క ఫోటోని చూడలేదు రష్యన్ సైంటిస్ట్ శ్రీ మాత్రే నమః మీ సత్యానంది రాజు. ఈ మధ్యన మీలో కొంతమంది అడుగుతున్నారు ఏంటండీ ఎప్పుడు ఆంధ్ర ప్రాంతం గురించే చెప్తున్నారు ఆ యోగుల గురించి మరి తెలంగాణలో అటువంటి మహాత్ములు లేరా అని నిజానికి ఈ మధ్యన ఎక్కువగా మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహాత్ముల గురించే చెప్పుకున్నాం అది మరుకు భావానంద భారతీ స్వామి వారు కావచ్చు హర్రిముస్్యాల
(00:56) సాంద్రానంద స్వామి వారి గురించి కావచ్చు అష్టకాల నరసింహ రామ శర్మ గారి గురించి కావచ్చు తాడ్వాయి శబరమాతి గురించి కావచ్చు ఐలావజుల వెంకట రమణయ్య గారి గురించి కావచ్చు బర్దీపూర్ దత్తగిరి మహారాజు గారి గురించి కావచ్చు మీరందరూ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే మహాత్ములకి ప్రాంతీయ భేదాలు ఏముంటాయో చెప్పండి అయినా కూడా ఇవాళ ఎందుకో అనుకోకుండా అని ప్లాన్ చేసుకుంది కాదు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్లో జన్మించినటువంటి ఒక మహాత్ముడు గురించి చెప్పుకుందాం నేను ముందుగా వారి గురించి అంతగా అనుకోలేదు అంటే అంత ఉన్నత స్థాయిలో
(01:36) ఉన్నటువంటి యోగిని చెప్పి నేను అనుకోలేదు కానీ వారి కుటుంబీకుల దగ్గర నుంచి ఇవాళ కొన్ని వివరాలు విన్న తర్వాత నాకు ఇవాళ అర్థమయింది. వారు మామూలువారు కాదు వారు 1911 లో తమ దివ్య శరీరాన్ని వదిలిపెట్టిన గత సంవత్సరం అంటే 2025 లో ఒక రష్యన్ సైంటిస్ట్ కి దర్శనం ఇచ్చారు వారి సమాధి దగ్గర దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కొంతమంది అంటున్నారు కదా కామెంట్స్ లో ఏంటి పిట్ట కథలు చెప్తున్నారు ఏంటి మీరు యంగ్ గా కనబడుతున్నారు ప్రాక్టికల్ అప్రోచ్ లేదు ఇవన్నీ ఏంటి కాకబుల్ స్టోరీస్ అంటున్నారు నేను ఎప్పుడూ అలాంటివి చెప్పను నమ్మకం ఉంటే అవి పెట్టకథలు కావు అవి సాధనకు
(02:21) ఎంతగానో ఉపయోగపడతాయి అటువంటి అద్భుతమైన విశేషాలు ఇవాళ మనం సత్సంగం చేసుకుందాం వీరెవరో కాదు కోట కదిర చంద్రమౌళీశ్వర స్వామి వారు మహాయోగి కేవలం వారి జీవిత చరిత్రే కాదు ఇప్పటికీ వారు ఎలా పలుకుతున్నారు భక్తుల బాధలు ఎలా తీరుస్తున్నారు పిల్లలు పుట్టరు అని సర్టిఫై చేసినా కూడా అక్కడ వ్రతదీక్ష తీసుకుని సంతానాన్ని పొందిన వారు ఇంకా ఉన్నారు.
(02:51) అటువంటి విశేషాలు ప్రాక్టికల్ విశేషాలు విత్ ప్రూఫ్స్ మనం చెప్పుకుందాం. ఈ సత్సంగంలో పాల్గొనే మీ అందరికీ నాకు కూడా ఆ కోటకదిర చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి.
(03:13) అలాగే ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా క్యాజువల్ వ్యూవర్స్ లాగా చూసి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి నా మనవి ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఎంతగానో నన్ను మోటివేట్ చేస్తుంది. ఇటువంటి యోగుల గురించి మరిన్ని అద్భుతమైన సత్సంగాలు చేసుకునేందుకు నాకు అవకాశం కల్పిస్తుంది సరేనా ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ఆ కోట కదిర చంద్రమౌళేశ్వర స్వామి వారి గురించి సత్సంగం చేసుకుని తరించిపోదాం పదండి ఈ సత్సంగానికి సంబంధించి ఎన్నో విశేషాలు నాతో పంచుకున్నటువంటి తోటపల్లి శ్రీధర శర్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వీరి తల్లిదండ్రుల పేర్లు శేషగిరి గిరిజాంబ నవంబర్ 14 1815వ సంవత్సరం కార్తీక మాసంలో
(03:56) జన్మించారు. సరే వీరు పుట్టినప్పటి నుంచి కూడా మంచి భక్తి ప్రపత్తులు ఉండేవి అలాగే వీరి మేనమామ గారు రాజేశ్వర శాస్త్రి గారికి సభాపతి అని చెప్పి బిరుదు ఉండేది. ఆయన వేదంలో మహా పండితులు సరే మేనమామ గారి ఇంట అంటే కొడంగల్లో కొన్నాళ్ళు వేదవిద్య అలాగే యోగాభ్యాసం కూడా నేర్చుకున్నాడు ఐదేళ్ళు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడి పేరు చంద్రమౌళీశ్వరుడు అని పెట్టారు ముద్దుగా అందరూ చంద్రన్న అని పిలుచుకునేవారు సరే ఆ సమయంలో ఏమైందంటే వీరి సోదరి సన్నమ్మ అనే ఆవిడకి వివాహం కుదిరింది.
(04:34) తండ్రి శేషగిరి గారు ఆ రాజేశ్వర శాస్త్రి గారే చెప్పారు పిల్లవాడిని తీసుకురా వివాహం జరుగుతోంది ఇంట్లో అని సరే మేనమామతో కలిసి మైలవరం బయలుదేరాడు చంద్రన్న దారిలో బంధువులు ఇంటి ఆగారు అదేమిటి అంటే ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి ఏకాంబరేశ్వర క్షేత్రం ప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రం ఇప్పటికీ కూడా గుప్తంగా అక్కడ మునులు వచ్చి శివార్చన చేస్తారని చెప్పి భక్తులు చెప్ చెప్పుకుంటూ ఉంటారు అంతటి పవిత్రమైనటువంటి క్షేత్రం అది మీలో ఎవరైనా దర్శించి ఉంటే కామెంట్స్ లో పెట్టండి.
(05:10) అలాగే దాని చరిత్ర తెలిసి ఉన్నా కూడా సరే బంధువులు ఇంటి ఆగారు వీళ్ళద్దరు అప్పుడు రాజేశ్వర శాస్త్రి గారు ఏం చేశారు అంటే వీరు ఒక రకంగా గురు స్వరూపం కదా చంద్రన్నకి ఆ శైవ క్షేత్రం యొక్క మహత్యం చెప్పడం మొదలపెట్టారు ఆ ఏకంబరేశ్వర క్షేత్రం గురించి ఈ పిల్లవాడికి కుతూహలం ఆగల ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తి ప్రవక్తులే కదా పెద్దగా బడి చదువులు కూడా చదవలే ఇప్పుడు కూడా ఈ రామాయణం భారతం భాగవతం ఇవే వారి చదువు సరే అర్ధరాత్రి ఆలయానికి వెళ్లి చూస్తే మునులు కనిపించారు శివార్చన చేస్తూ ఆ పిల్లవాడికి ఆనందం ఆశ్చర్యం రెండు ఒకేసారి కలిగినయి
(05:52) కాసేపటి తర్వాత ఆ మునులు బయటికి వచ్చారు ఎవరి పిల్లవాడివి ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నావు నీ తల్లిదండ్రుల పేరు ఏమిటి అని చెప్పి అడిగారు. ఆ ఆశ్చర్యంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడికి నోటెంబడ మాట పెగలేదు. సరే కళ్ళు మూసుకో అన్నారు అమ్మునులు ఆ పిల్లవాడు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేటప్పటికీ తన మేనమామ పక్కలో తను పొడుకుని కనిపించాడు.
(06:21) సరే ఆ మేనమామకి మొత్తం వివరించి చెప్పాడు పిల్లవాడు ఆలయంలో ఏం జరిగింది అని రాజేశ్వర శాస్త్రి గారు చాలా సంతోషించి నాయనా అక్కడ మునుల దర్శనమే కాదు అక్కడ జప సాధన కూడా చేస్తే సాధనలో ఇంకా ముందుకు వెళ్తామ అని చెప్పి ఆ పిల్లవాడికి చెప్పాడు. ఆ మర్నాడు అర్ధరాత్రి మళ్ళీ ఆలయానికి వెళ్ళాడు పిల్లవాడు అక్కడ తాగిపోలా మళ్ళీ మునుల దర్శనం అలాగే జరిగింది.
(06:50) ఈసారి మునులు అడిగారు నీకు ఏం కావాలి కోరుకో ఇంత శ్రద్ధగా వచ్చి దర్శనం చేసుకుంటున్నావు కదా చంద్రన్న అడిగాడు నాకు ఏది వద్దు నాకు కేవలం ఆ పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉంటే చాలు ఇంక నాకు ఏం వద్దు అని చెప్పి అడిగాడు తధాస్తు అన్నారు అని చెప్పి పంచాక్షరీ మంత్రాన్ని ఆ పిల్లవాడికి మంత్రోపదేశం చేశారు. అప్పటినుంచి జపసాధన చేయడం మొదలు పెట్టాడు ఆ పిల్లవాడు పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు ఆ సమయానికి ఇదంతా కూడా రాజేశ్వర శాస్త్రి గారు విని మురిసిపోయి ఆ పిల్లవాడిని కౌగలించుకొని ధన్యాత్ముడివి నాయనా నువ్వు ఆ మునుల దర్శనమే నీకు గొప్ప అనుకుంటుంటే వారి
(07:30) నుంచి నువ్వు జపదీక్షను కూడా పొందావ అని చెప్పి తెగ సంబర పడిపోయారు రాజేశ్వ శాస్త్రి గారు వీరి ముద్దు పేరు చంద్రన్న అన్నాను కాదు చందన్న చందన్న అదే సమయంలో ఈయనకు కూడా వివాహం అయిపోయింది కృష్ణమ్మ అనే ఒక బాలికతో అప్పటికి ఈయన వయసు 12 సంవత్సరాలు ఆ కృష్ణమ్మ వయసు ఎనిమిది సంవత్సరాలు అంటే అప్పట్లో బాల్య వివాహాలు సర్వసాధారణం కాబట్టి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు దీని తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వారి అనుమతి తీసుకుని ఏకాంబరేశ్వర క్షేత్రంలో ఆ శివ పంచాక్షరి మంత్రోపాసన చేయడం మొదలుపెట్టాడు చందన్ ఒకానొక శుభముహూర్తంలో ఒక మార్గశీర మాసంలో సాక్షాత్తు
(08:11) పరమేశ్వరుడి యొక్క దర్శనం అయిపోయింది. పరమేశ్వరుడు నాయనా నీ తపస్సుకు మెచ్చాను కానీ నా అనుగ్రహంతో పాటు ఆ దేవి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం కూడా నువ్వు పొందాలని చెప్పి ఆ తల్లి గురించి కూడా తపస్సు చేయని చెప్పి ఆదేశించి అంతర్ధానం అయ్యాడు ఆ పరమేశ్వ దాని తర్వాత అనంతగిరి దగ్గర ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం దగ్గరలోని ఒక గుహలో కూర్చుని అమ్మవారి దర్శనం కోసం కటినమైనటువంటి తపస్సు చేసాడు చందన్న ఒకానొక సందర్భంలో ఒక స్త్రీ కనిపించి పరికి పండ్లు గుప్పెడిచ్చి ఇవి తిను నువ్వు తపస్సు ఇంకా బాగా చేస్తావ అని చెప్పి ఆశీర్వదించింది.
(08:52) సరే ఆ పండ్లు తిని ఇంకా శక్తిని ఇంకా పుంచుకొని తపస్సుని ఉదృతం చేశడు చందన్న ఇంకో సందర్భంలో అదే స్త్రీ మళ్ళీ కనిపించింది. సరే చందన్న అడిగాడు ఎవరు తల్లి నువ్వు ఇన్నిసార్లు దర్శనం ఇస్తున్నావు నీ పేరు ఏమిటి అని నా పేరు సరే నా భర్త పేరు రామయ్య లక్ష్మణ భరత శత్రుజ్ఞులు కూడా నాతో పాటు ఉన్నారు నా బంటు హనుమా అని చెప్పింది ఇంకా ఏముంది ఆ తల్లి పేరు నేను చెప్పేది ఏముంది సాక్షాత్తు సీతమ్మ తల్లి దర్శనం ఇచ్చింది సరే నాతో పాటు రా నాయన అని చెప్పి చందన్నని ఒక ఇంటికి తీసుకువెళ్ళింది ఆ ఇంటి గడపలో కాలు పెట్టగానే ఆ తల్లి మాయమైపోయింది. ఈ విషయంంతా విన్న ఆ
(09:31) అర్చకుడు నువ్వు ఏదో జన్మలో ఎంతో పుణ్యఫలం చేసుకున్నావు లేకపోతే సీతమ్మ తల్లి సాక్షాత్తు నీకు దర్శనం ఇచ్చి నా ఇంటికి తీసుకొచ్చింది అంటే చిన్న విషయం కాదని చెప్పి ఆయన నాలుగు రోజుల పాటు తనతో ఉంచుకొని ఆతిథ్యం ఇచ్చాడు అక్కడి నుంచి ఐదవ రోజు బయలుదేరి గోదావరి తీరాన్ని చేరుకున్నారు కానీ ఆ రేవు దాటేటువంటి దారి కనిపించల అక్కడ కల్లో ఆ రోజు రాత్రి దివ్య పురుషుడు కనిపించి ఆ రేవు ఎలా దాటాలో ఒక దారి చూపించాడు అట్లా గట్టు దాటి అవతల ఒడ్డు చేరుకునే లోపల ఒక బెస్తవాడు కనిపించి వివరాలన్నీ తెలుసుకుని తనే స్వయంగా పడవలో ఈ గట్టు నుంచి అవతల గట్టుకు చేర్చాడు అవతల గట్టుకు
(10:12) చేరగానే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం కనిపించింది. అదే వాసర క్షేత్రం మనం పిలుచుకునే బాసర సరస్వతీ మాత ఆలయంలోకి వెళ్ళాడు. ఇప్పటికి ఇంకా చిన్న వయసు కదా అర్చకులు అడిగారు నీతో పాటు ఎవరూ లేరు నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అని సరే జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఇట్లా నాకు ఆ రేవు దాటాలంటే దారి కనిపించలేదు కళ్ళలో ఒక దివ్య పురుషుడు కనిపించి దారి చూపించాడు దాని తర్వాత ఒక బెస్తవాడు స్వయంగా పడవలో తానే ఆ గట్టు నుంచి ఈ గట్టుకి అవతల చేర్చాడు అప్పుడే ఈ క్షేత్రానికి వచ్చాను మొత్తం విషయం చెప్పాడు హర్చకులు ఆశ్చర్యపోయి ఇలా ఎలా వచ్చావు ఆ దారిన రావడం అంత సులభం
(10:51) కాదు ఆ దారిలో పడవలు కూడా దొరకవు సాక్షాత్తు నీకు దారి చూపించి అవతల ఒడ్డుకు చేర్చిన బెస్సవాడు ఎవరో కాదు సాక్షాత్తు వ్యాస భగవానుడు అని చెప్పారు అర్చకుడు ఆశ్చర్యపోయాడు చింతన్న అంటే నేను సాధనలో సరైన దారిలోనే ఉన్నాను కాకపోతే వ్యాస భగవానుడు కనిపించడం ఏంటి అక్కడితో ఆగిపోలా ఆ వాసర క్షేత్రంలో కఠినమైనటువంటి తపస్సు చేశాడు ఇన్ని దివ్య దర్శనాల తర్వాత సరస్వతీ మాత అనుగ్రహించకుండా ఉంటుందా ఆ తల్లి కూడా దర్శనం ఇచ్చింది దర్శనం ఇచ్చి శ్రీమేరు చక్రాన్ని ఇచ్చింది అంటే శ్రీ చక్రాన్ని ఇచ్చి అలాగే ఒక కుంకుమ భరణి కూడా ఇచ్చింది. నన్ను కామెంట్స్
(11:32) చేస్తున్నారే కాకన్పుల్ స్టోరీస్ మీకు ఛాలెంజ్ ఇప్పటికీ కోట కదిరిలో ఆ కుటుంబీకుల ఇంట్లో కుంకుమ భరిన ఆ శ్రీమేరు చక్ర యంత్రం ఉంది వెళ్లి చూసుకోండి అక్కడి నుంచి ఇంటికి వెళుతూ మైలవరానికి వెళుతూ దారిలో హుమ్బాదులో మాణిక్య ప్రభువుల యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. వీరు ఇంటికి రాకముందే ఒక రోజు ముందు వారి తల్లి గిరిజాంబకి ఒక దివ్య పురుషుడు కల్లో కనిపించి నీ కొడుకు రేపు ఇంటికి రాబోతున్నాడు అని చెప్పారు.
(12:03) ఆ తల్లి మురిసిపోయింది కొడుకుని చూసుకొని అప్పటికి చందన్న వయసు 20 సంవత్సరాలు మాత్రమే దురదృష్టవశాత్తు వీరి 22వ ఏట భార్య కృష్ణమ్మ కూడా హటాత్తుగా మరణించింది. అంతటితో ఆయనకి ఆ భార్య అనుబంధం కూడా దిగిపోయింది. దాని తర్వాత ఆయనకి తీవ్రమైనటువంటి తపస్సు చేయాలని కోరిక పుట్టి వారి మేనమామ రాజేశ్వర శాస్త్రి గారితో చెప్పారు ఆ కోరికని అప్పుడు వారి మేనమామ అన్నారు మన మూల పీఠం అయినటువంటి నారదగిరి అంటే వట్టింకొండ అని కూడా పిలుస్తారు.
(12:35) అక్కడికి వెళ్ళి తపస్సు చేయి అని చెప్పారు. ఆ వట్టెంకొండ కి నారదగిరి అని చెప్పి పేరు ఎలా వచ్చింది అంటే రాజేశ్వర శాస్త్రి గారి గురువైన ఎదురి శివరామయ్య గారు మహా ఉపాసకులు తపోదును. వారు ఒకసారి భాగవత పారాయణ పూర్తయిన తర్వాత అక్కడ నారద మహర్షి దర్శనమయ్య వారికి మంత్రోపదేశం పొందారు అట్లా వట్టెం కొండకి నారదగిరి అని పేరు వచ్చింది. చందన్న అక్కడికి వెళ్లారు నారదగిరికి తపస్సు చేసుకుందాం.
(13:03) కానీ వారికి పరిస్థితులు అనుకూలంగా కనిపించలేదు అక్కడ భక్తుల మధ్య ఉన్నటువంటి కొన్ని ఆధిపత్యాల వల్ల అనుకూలంగా కనిపించక అక్కడ పడమడ దిక్కు ఉన్నటువంటి ఆనందగిరి అనేటువంటి గుట్ట మీదకి వెళ్లి తపస్సు చేయడం మొదలు పెట్టారు ఆ గుట్టకి ఆనందగిరి అని చెప్పి నామకరణం చేసింది కూడా చందన్నే అట్లా వారు అక్కడ ఆనందగిరి ఆశ్రమాన్ని స్థాపించి ఆ పీఠానికి అధిపతిగా మారి చందన్న చంద్రమౌళీశ్వర స్వామిగా మారిపోయారు ఇక నుంచి మనం చంద్రమౌళ శ్వర స్వామి అని చెప్పి పిలుచుకుందాం మీరు చంద్రమౌళేశ్వర స్వామి వారు తమను ఆశ్రయించిన భక్తులకి వారి వారి అర్హతలను బట్టి వారి శక్తి స్థాయి బట్టి
(13:41) మంత్రోపదేశాలు చేసేవారు అష్టాక్షరి కానీ లేదా పంచాక్షరీ కానీ వాసుదేవ ద్వాదశాక్షర కానీ శ్యామలాదేవి మంత్రం కానీ బాలా త్రిపుర సుందరి దేవి మంత్రం కానీ ఇట్లా వారి స్థాయి బట్టి మంత్రోపదేశం చేసి వారిని భక్తి మార్గంలోకి నడిపించారు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మందికి యోగాభ్యాసం నేర్పించారు. ఎంతో మందికి వేదాంతం బోధించారు.
(14:05) అట్లా వారు ఈ సమాజానికి ఎంతగానో పాటుపడ్డారు. వీరికి అప్పటి మహా యోగి అయినటువంటి సోలీపురం నరసింహ యోగి గారితో అద్భుతమైనటువంటి అనుబంధం ఉండేదని చెప్తారు భక్తులు. వారిద్దరి మధ్య కూడా చాలా ఆసక్తికరమైనటువంటి సంభాషణలు సంఘటనలు జరిగావని చెప్తారు. ఇంకో సందర్భంలో అవన్నీ కూడా మనం చర్చించుకుందాం. 1911 లో అపరదత్తావతారం పరమహంస పరివ్రజికాచార్య శ్రీ శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు కోట కదిరి మీద నుంచి కాశీకి వెళుతున్నారు.
(14:36) అప్పుడు చంద్రమౌళీశ్వర స్వామి వారు వారిని కోరారు సన్యాస దీక్ష ఇవ్వవలసిందిగా ఇప్పుడు కాదు మూడు నెలల తర్వాత నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు ఇస్తాను అని చెప్పి అన్నట్టుగానే మూడు నెలల తర్వాత అంటే 11 జులై 1911వ సంవత్సరంలో వారికి సన్యాస దీక్ష ఇచ్చారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు సన్యాస దీక్షా నామం పురుషోత్తమానంద సరస్వతీ స్వామి అట్లా వారు సన్యాస దీక్షని వాసుదేవానంద సరస్వతి స్వామి వారి దగ్గర నుంచి తీసుకుని చంద్రమౌళీశ్వర స్వామి వారు పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారిగా మారిపోయారు.
(15:14) దాని తర్వాత వారు తపస్సు ఇంకా కఠినంగా చేసి ఇంకా వారి శరీరాన్ని వదిలి పెట్టాలని చెప్పి సంకల్పం బలంగా చేసుకుని వారి సమాధి నిర్మాణాన్ని వారే దగ్గరుండి పనులు పురమాయించుకుని అదే సంవత్సరం 19 జూలై 1911 లో సజీవ సమాధిలోకి ప్రవేశించారు. అందుకే ఇప్పటికీ కూడా అది ఒక అద్భుతమైనటువంటి తత్వోస్తలం.
(15:42) ఇప్పటికీ అక్కడ వారి దర్శనాలు చాలామందికి జరుగుతున్నాయి. అది ఎట్లాగో ఇప్పుడు మీకు ఒక రుజువు చెప్తాను వినండి. అట్లా ఆనాటి ఆనందగిరి పీఠం ఇప్పుడు సద్గురు పీఠంగా మారింది వారి కుటుంబీకులు తోటపల్లి శ్రీధర శర్మ గారు చాలా సమర్ధవంతంగా పీఠాన్ని నిర్వహిస్తున్నారు వారే ఎన్నో విలువైన విశేషాలు చెప్పారు ఇవాళ జరిగినటువంటి సత్సంగంలో నాతో అట్లా వారు నాకు విషయం పంచుకున్నారు నాతో వారి కుమారుడు ఐసిఎంఆర్ లో గొప్ప సైంటిస్ట్ వారి బృందం లో ఒక రష్యన్ సైంటిస్ట్ కూడా ఉంది.
(16:14) గత సంవత్సరం ఏప్రిల్ 16 2025 ఈ కోటకదిర ఆలయానికి వచ్చారు ఆలయానికి వచ్చినప్పుడు కాసేపు ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ రష్యన్ సైంటిస్ట్ కి ఒక స్వామి ఎవరో ఒక సాధువు దర్శనం ఇచ్చి భుజం తట్టి నువ్వు ఒక కోరిక మీద వచ్చావు ఇక్కడికి ఆ కోరిక త్వరలో తీరుతుంది ఏం కంగారు పడక అని చెప్పి అంతర్ధానం అయిపోయాయి సరే అతను భ్రాంతి అనుకుందో ఏమనుకుందో ముందు జరిగిన విశేషం అంతా కూడా తన తోటి వారితో చెప్పుకుంది.
(16:47) సరే ఆ సాధు ఎలా ఉంటారో గీసి చూపించమంటే ఇదిగో ఇలా గీసింది ఇటు చూస్తున్నదేమో మీరు స్వామి వారి యొక్క ఒరిజినల్ ఫోటో ఇటేమో ఆ రష్యన్ సైంటిస్ట్ గీసినటువంటి ఛాయాత చూడండి ఎంత దగ్గరగా ఉన్నాయో అప్పటిదాకా కూడా అసలు వారి యొక్క ఫోటోని చూడలేదు ఆ రష్యన్ సైంటిస్ట్ దీన్ని బట్టి మీకు అర్థమైందా సమాధి చెంది 115 116 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ కోట కదిర చంద్రమౌళేశ్వర స్వామి వారు పలుకుతున్నా ఉన్నారు పురుషోత్తమానంద సరస్వతి స్వామి వారు పలుకుతూనే ఉన్నారు అనడానికి ఇంతకుమించి సాక్ష్యం ఏం కావాలి ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అంటే వారి జయంతి సందర్భంగా ఆ రష్యన్
(17:27) సైంటిస్టులు వర్చువల్ గా ఇప్పటికీ వారి యొక్క దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్షేత్రం చాలా శక్తివంతమైంది. ఇక్కడ వారి సజీవ సమాధి పక్కనే లలితాదేవిని కూడా ప్రతిష్టించారు. ఇది కూడా ముందే చెప్పారు చంద్రమౌళేశ్వర స్వామి వారు తాను సమాధి పొందిన 75 సంవత్సరాల తర్వాత ఒక నియమాన్ని పెట్టి ఆ నియమాన్ని అనుసరిస్తూ ఆ పక్కన లలితాదేవి యొక్క ప్రతిష్ట జరగాలని చెప్పి ఆజ్ఞాపించారు అనుకోకుండా ఇవాళ ఎవరితో అయితే నేను మాట్లాడానో తోటపల్లి శ్రీధర శర్మ గారు వారికి ఆ నియమం వర్తించి వారే స్వయంగా ఆ లలితాదేవిని ప్రతిష్టించారు. అంత దివ్య దృష్టి
(18:11) కలిగినటువంటి వారు చంద్రమౌళేశ్వర స్వామి వారు ఇప్పటికీ ఎంతో మంది పిల్లలు లేని వారు అక్కడికి వచ్చి సంతానాన్ని పొందుతున్నారు. కానీ దానికి కొన్ని వ్రత దీక్షలు అంటూ ఉన్నాయి అవేంటి అనేది మీరు శ్రీధర శర్మ గారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది వారి నెంబర్ వారి అనుమతితో నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వారితో మాట్లాడండి ఎంతో మంది వివాహం కాని వారు కూడా అక్కడికి వచ్చిన తర్వాత వారికి వివాహం జరుగుతోంది.
(18:35) సంతానం లేని వారు సంతానాన్ని పొందుతున్నారు. కానీ వీటన్నిటికీ కూడా కొన్ని నియమాలు వ్రతదీక్షలు ఉన్నాయని చెప్పి నాతో శ్రీధర శర్మ గారు చెప్పారు. ఈ క్షేత్రం ఎంత గొప్పది అంటే వేరే మతస్తులు కూడా వచ్చి ఇక్కడ ఆ పీఠం యొక్క నియమాలు ధర్మాలని పాటిస్తూ ఆ వ్రతదీక్షలు పాటిస్తూ వారి ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకుంటున్నారు.
(18:57) వీరి వంశంలో చాలా మంది గొప్ప ఉపాసకులు ఉన్నారు. ఉదాహరణకి శ్రీధర శర్మ గారి తాతగారి పేరు కూడా చంద్రమౌళి. వారు కూడా గొప్ప దేవీ ఉపాసకులు. ఎంతటి ఉపాసకులు అంటే వారి మరణ సమయాన్ని ముందుగానే డైరీలో లిఖించి మరి ఆ సమయంలోనే అమ్మవారి ఐక్యమైపోయారు. హైదరాబాద్ కి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోట కదిర చంద్రమౌళీశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించండి.
(19:21) అక్కడ అమ్మవారు లలితాదేవి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి చాలా శక్తిమంతురాలు అక్కడ శ్రీ చక్ర యంత్రానికి నవనీత సేవ చేయిస్తారు ఒక సంవత్సరం పాటు వ్రతదీక్ష సందర్భంగా అట్లా ఆ వ్రతదీక్ష చేసి చాలామంది సంతానాన్ని పొందారు కాబట్టి తప్పకుండా ఆ క్షేత్రాన్ని దర్శించండి కొంతమందికి సంతానం కలగదని చెప్పి ఫెర్టిలిటీ సెంటర్లో సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ నవనీయత సేవ చేసుకుని సంతానాన్ని పొందారు అని చెప్పారు తోటపల్లి శ్రీధర శర్మ గారు డిస్క్రిప్షన్లో ఆ లొకేషన్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను తప్పకుండా వెళ్లి దర్శించుకోండి.
(19:56) ఈ సత్సంగంలో పాల్గొన్న మీ అందరికీ నాకు కూడా కోటకదిరి చంద్రమౌళేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు హైప్ కూడా చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరేనా అలాగే మీరు ఎవరికైనా ఈ సత్సంగం షేర్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని సలహా చెప్పండి సరేనా మరొక అద్భుతమైన సత్సంగంలో మనందరం మళ్ళీ కలుద్దాం శ్రీ మాత్రే నమః మీ సత్యానందిరాజు
No comments:
Post a Comment