Sunday, August 30, 2026

ధ్యానం కుదరకపోవడానికి అసలు కారణం ఇదే! | పతంజలి చెప్పిన 9 అడ్డంకులు | SANATHANA LIFE

ధ్యానం కుదరకపోవడానికి అసలు కారణం ఇదే! | పతంజలి చెప్పిన 9 అడ్డంకులు | SANATHANA LIFE

Author Name:Sanathana Life

Youtube Channel Url:https://www.youtube.com/@Sanathana-Life

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1i2syQopJ74



Transcript:
(00:00) అందరికీ నమస్కారం సనాతన లైఫ్ ఛానల్ కి స్వాగతం. మనం లైఫ్ లో చాలా విషయాలను ట్రై చేస్తుంటాం. కెరీర్ సెట్ చేసుకోవాలనుకుంటాం హెల్త్ బాగుండాలనుకుంటాం. వీటన్నిటితో పాటు మైండ్ ప్రశాంతంగా ఉండాలని ధ్యానం చేయడం కూడా స్టార్ట్ చేస్తాం. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం చాలా ఇంట్రెస్ట్ తో ఒక మంచి మ్యూజిక్ పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటాం.
(00:25) సరిగ్గా ఐదు నిమిషాలు కూడా గడవకముందే మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. రేపు ఏం జరుగుతుంది నిన్న ఫ్రెండ్స్ తో జరిగిన గొడవ ఏంటి రాత్రి ఏం తినాలి ఇలాంటి ఎన్నో ఆలోచనలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. కొన్నిసార్లు విపరీతమైన అలసట వచ్చేస్తుంది. మరి కొన్నిసార్లు అసలు ఈ ధ్యానం వల్ల నాకు ఏమైనా యూస్ ఉందా అనే డౌట్ వస్తుంది.
(00:49) ఇంకొన్ని రోజులయితే అసలు ఏ రీజన్ లేకుండానే మనం సాధన చేయడం ఆపేస్తాం. ఇలా మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా జరిగిందా అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది మీ ఒక్కరి ప్రాబ్లం మాత్రమే కాదు ఇది మీ బలహీనత అస్సలే కాదు ఎందుకంటే దాదాపు కొన్ని వేల ఏళ్ల క్రితమే మహర్షి పతంజలి ఈ హ్యూమన్ సైకాలజీని మన మనసు పడే ఇబ్బందులను చాలా క్లియర్ గా స్టడీ చేశారు.
(01:14) ఆయన రాసిన ప్రసిద్ధ పతంజలి యోగసూత్రాలు అనే గ్రంథంలో ఒక మనిషి ధ్యాన మార్గంలో వెళ్తున్నప్పుడు తన మైండ్ ప్రశాంతంగా మారకుండా అడ్డుకునే తొమ్మిది ప్రధాన అడ్డంకులను చాలా స్పష్టంగా వివరించారు. అవేమిటంటే వ్యాధి, స్థాన్య, సంశయః, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ద భూమికత్వ, అనవస్తితత్వం ఇవి వినడానికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు.
(01:40) కానీ వీటి వెనుక ఉన్న అర్థం ఈనాటి ప్రతి ఒక్కరికి చాలా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మనసును చంచలపరిచి మనం అనుకున్న గోల్స్ ని లేదా ధ్యాన మార్గాన్ని అడ్డుకునే తొమ్మిది అంతరాయాలు ఇందులో ఉన్నాయి. ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇందులో మొదటి అడ్డంకి వ్యాధి అంటే శారీరక అనారోగ్యం. మన పెద్దలు ఊరికే అనలేదు.
(02:05) ఆరోగ్యమే మహాభాగ్యం అని. శరీరం సరిగ్గా సహకరించకపోతే మనం ఏ పని పైన ఫోకస్ పెట్టలేం. ఆయుర్వేదం ప్రకారం చూసుకున్న మన శరీరంలో వాత పిత్త, కఫా దోషాలు అసమతుల్యంగా మారినప్పుడు బాడీలో ఎనర్జీ ఫ్లో దెబ్బతింటుంది. పూర్వకాలంలో యోగులు డైరెక్ట్ గా ధ్యానంలో కూర్చునేవారు కాదు. ముందుగా ఆసనాలు ప్రాణాయామం ద్వారా శరీరాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాతే మెడిటేషన్ లోకి వెళ్లేవారు.
(02:33) మరి ఈ రోజుల్లో ఈ వ్యాధి అనే ప్రాబ్లం మనకి ఎలా కనిపిస్తుంది అంటే రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే జీర్ణ సమస్యలు ఆఫీస్ వర్క్ వల్ల వచ్చే విపరీతమైన మెడ నొప్పి లేదా బ్యాక్ పెయిన్ వీటన్నింటికీ తోడు మెంటల్ స్ట్రెస్ ఇప్పుడు చెప్పండి బాడీలో ఎక్కడో ఒక చోట పెయిన్ ఉంటే లేదా కడుపులో అశాంతిగా ఉంటే మనం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఎలా కూర్చోగలం అందుకే హెల్త్ బాలేనప్పుడు ధ్యానం కుదరట్లేదని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం మానేయండి.
(03:04) ముందు మీ బాడీని గౌరవించడం దాన్ని ఫిట్ గా ఉంచుకోవడం నేర్చుకోవాలి. ఇక రెండవది చాలా సైలెంట్ గా మనల్ని దెబ్బతీసే అడ్డంకి స్థ్యాన అంటే మానసిక జడత్వం. ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఇందులో మనకి ధ్యానం చేయాలనే కోరిక ఉంటుంది. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా తెలుసు కానీ లోపల నుండి అసలు ఎనర్జీ ఉండదు. రేపటి నుండి పక్కాగా మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం అని అలారం పెట్టుకుంటాం.
(03:31) కానీ [సంగీతం] పొద్దున్నే లేవగానే ఈరోజు వద్దులే రేపటి నుండి చేద్దామని పోస్ట్పోన్ చేస్తాం. దీనిని సోమరితనం అనుకుంటే పొరపాటే. ఇది సోమరితనం కాదు మనసులో ఉండే పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా తగ్గిపోయిన స్థితి. మోడరన్ సైకాలజీలో దీనినే మోటివేషన్ డెఫిషియేట్ లేదా మానసిక నీరసం అంటారు. ఏదైనా కొత్త అలవాటును మొదలు పెట్టకుండా మన మైండ్ మనల్ని వెనక్కి లాగుతున్నప్పుడు మనం ఈ స్థ్యానా అనే అడ్డంకిలో చిక్కుకున్నామని అర్థం చేసుకోవాలి.
(04:02) దీని తర్వాత వచ్చే మూడవ అడ్డంకి సంశయ అంటే సింపుల్ గా చెప్పాలంటే డౌట్ లేదా సందేహం. మనం కొద్ది రోజులు ధ్యానం చేయగానే మైండ్ లో రకరకాల నెగిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. అసలు ఈ ధ్యానం వల్ల నాకు నిజంగానే మైండ్ పీస్ వస్తుందా నేను చేస్తున్న పద్ధతి కరెక్టేనా YouTube లో చూసి చేస్తున్నాను కదా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా నాలాంటి వాళ్ళకి ఇవన్నీ వర్కవుట్ అవుతాయా ఇలాంటి వందలాది ప్రశ్నలు మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు.
(04:29) భగవద్గీతలో కూడా కృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. సంశయాత్మ వినశ్యతి అని అంటే ఎప్పుడూ అనుమానాలతో సందేహాలతో బతికే మనసు ఏ రంగంలోనూ ఏ కాలంలోనూ పురోగతి సాధించలేదు. నమ్మకం లేని చోట ఏ సాధన కూడా ముందుకు సాగదు. ఇక నాలుగవ అడ్డంకి ప్రమాద. అంటే నిర్లక్ష్యం లేదా కేర్లెస్నెస్. మనకి ధ్యానం చేయడం వల్ల మైండ్ ఎంత రిలాక్స్ అవుతుందో తెలుసు.
(04:56) దాన్ని ఎలా చేయాలో టెక్నిక్ కూడా తెలుసు. అయినా సరే లైట్ తీసుకుంటాం. ఈరోజు కాకపోతే రేపు చేద్దాంలే ఇప్పుడే అర్జెంట్ వచ్చింది అని నిర్లక్ష్యం చూపిస్తాం. చాలా మంది లైఫ్ లో ఇదే జరుగుతుంది. ఒక మోటివేషనల్ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక వారం రోజులు చాలా సిన్సియర్ గా మెడిటేషన్ చేస్తారు. ఆ తర్వాత ఏదో ఒక చిన్న పని అడ్డం వచ్చిందని చెప్పి పూర్తిగా మానేస్తారు.
(05:19) మన దగ్గర నాలెడ్జ్ ఉండి కూడా దాన్ని డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయకపోవడమే ఈ ప్రమాద అనే లక్షణం. చూశారుగా పతంజలి మహర్షి చెప్పిన ఈ మొదటి నాలుగు అడ్డంకులు మన రోజువారి జీవితంలో ఎంతగా ముడిపడి [సంగీతం] ఉన్నాయో ఇవి కేవలం ఆధ్యాత్మిక విషయాలు కావు మన నిత్య జీవితంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అయితే మిగిలిన ఐదు అడ్డంకులు ఇంకాస్త లోతుగా మరింత ఆసక్తికరంగా ఉంటాయి.
(05:44) అవి తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఐదవ అడ్డంకి ఆలస్య అంటే సోమరితనం. మనం ముందు చెప్పుకున్నట్లు స్థ్యాన అనే మానసిక నీరసానికి ఈ ఆలస్యానికి చాలా డిఫరెన్స్ ఉంది. స్థ్యానంలో మనసుకు ఎనర్జీ ఉండదు. కానీ ఆలస్యంలో అటు శరీరం ఇటు మనసు రెండు మొద్దుబారిపోతాయి.
(06:09) దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మన లైఫ్ స్టైల్. విపరీతంగా ఆయిల్ ఫుడ్స్ లేదా ఇవి భోజనం చేయడం నైట్ లేట్ గా నిద్రపోవడం బాడీకి అస్సలు వ్యాయామం లేకపోవడం వల్ల మనలో తమోగుణం పెరిగిపోతుంది. ఈ తమోగుణం ఎప్పుడైతే బాడీని డామినేట్ చేస్తుందో అప్పుడు బెడ్ మీద నుండి లేవడమే ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తుంది. ఇంకొక ఐదు నిమిషాలు పడుకుందాం.
(06:32) మెడిటేషన్ ఈవినింగ్ చేద్దాంలే అనుకుంటూ బద్ధకాన్ని పెంచేదే ఈ ఆలస్యం. దీని తర్వాత వచ్చే ఆరవ అడ్డంకి ఈ డిజిటల్ జనరేషన్ ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద శత్రువు అవిరతి [సంగీతం] అంటే ఇంద్రియాసక్తి సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడు ఇంద్రియ సుఖాల వెనుక పరిగెత్తడం ధ్యానం చేయడానికి కూర్చునే ముందు మన ఫోన్ నోటిఫికేషన్స్ చెక్ చేస్తాం. కళ్ళు మూసుకోగానేఇ రీల్స్ YouTube షాట్స్నెస్ సిరీస్ లు ఆఖరికి WhatsAppట్ చాటింగ్లు మైండ్లో సినిమా లాగా తిరుగుతుంటాయి.
(07:03) మన మనసు ఎప్పుడూ బయట ప్రపంచంలో ఉండే రంగులు రుచులు శబ్దాల వైపే లాగుతూ ఉంటుంది. ధ్యానం అంటేనే మనసును లోపలికి తిప్పడం కానీ ఈ అవిరతి ఏం చేస్తుందంటే మన ఎనర్జీ మొత్తాన్ని బయట ప్రపంచం వైపు లాగేసి మైండ్ ని ఎప్పుడూ డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇక ఏడవది భ్రాంతి దర్శనం అంటే అసత్యాన్ని సత్యంగా నమ్మడం లేదా లేని దాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవడం.
(07:29) కొంతమంది ధ్యానం స్టార్ట్ చేయగానే మొదటి నాలుగైదు రోజుల్లోనే కళ్ళు [సంగీతం] మూసుకుంటే ఏదో ఒక చిన్న కాంతి కనిపించిందనో లేదా బాడీలో చిన్న వైబ్రేషన్స్ వచ్చిందనో అబ్బా నాకు కుండలేని శక్తి లభించేసింది. నేను గొప్ప యోగిని అయిపోయానని భ్రమలో బతికేస్తుంటారు. చిన్న చిన్న మానసిక అనుభవాలనే పెద్ద ఆధ్యాత్మిక సిద్ధులుగా ఊహించుకొని అసలైన సాధనను పక్కన పెట్టేస్తారు.
(07:53) యోగశాస్త్రం దీనిని ఒక పెద్ద మాయా ఉచ్చు అని హెచ్చరిస్తుంది. ఇలాంటి భ్రమల్లో చిక్కుకుంటే అహంకారం పెరిగిపోతుందే తప్ప నిజమైన ప్రశాంతత దొరకదు. ఎనిమిదవ అడ్డంకి అలబ్ద భూమికత్వం అంటే ఎంత ప్రయత్నించినా తదుపరి స్థాయికి చేరుకోలేకపోవడం. ఇది ప్రతి సాధకుడి లైఫ్ లోనూ వచ్చే ఒకానొక విచిత్రమైన స్టేజ్ మనం కొన్ని నెలల పాటు డైలీ మెడిటేషన్ చేస్తాం.
(08:18) కానీ ఒక స్టేజ్ వచ్చాక ఎంత ప్రాక్టీస్ చేసినా లైఫ్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనిపించదు. మైండ్ ఇంకాస్త లోతుగా ప్రశాంతంగా మారట్లేదేంటి అనే ఒక ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల చాలా మంది నిరాశ చెంది ఇక నా వల్ల కాదు అని సాధనను మధ్యలోనే వదిలేస్తారు. కానీ పురాతన యోగులు ఏమంటారంటే ఇది మీ ప్రయాణంలో వచ్చే ఒక టెస్టింగ్ పీరియడ్.
(08:44) ఇక్కడ ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్లే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఇక చివరిదైన తొమ్మిదవ అడ్డంకి అనవస్తి తత్వం అంటే ఒక లెవెల్ కి రీచ్ అయ్యాక దాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఇది అన్నిటికంటే చాలా సూక్ష్మమైన అడ్డంకి కొన్ని రోజులు మనకి ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది. రోజంతా మైండ్ ఎంతో పీస్ ఫుల్ గా ఫోకస్డ్ గా ఉంటుంది. కానీ అంతలోనే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా లేదా కాస్త బిజీ అయినా మళ్ళీ పాత నెగిటివ్ అలవాట్లలోకి పాత లైఫ్ స్టైల్ లోకి వెళ్ళిపోతాం.
(09:16) సాధించిన ప్రశాంతతను ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేకపోవడమే ఈ అనవస్తి తత్వం. అందుకే పెద్దలు అంటారు. శిఖరాన్ని ఎక్కడం కంటే ఎక్కిన తర్వాత అక్కడ స్థిరంగా నిలబడడమే చాలా కష్టమని. మరి పతంజలి మహర్షి చెప్పిన ఈ తొమ్మిది అడ్డంకులను ప్రాక్టికల్ గా ఎలా దాటాలి? దీనికి ఆయనే ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు. అదే ఏకతత్వాభ్యాసః అంటే ఏదైనా ఒకే ఒక పద్ధతిని నమ్మి రోజు కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడం.
(09:44) ఈ తొమ్మిది ప్రాబ్లమ్స్ ని సింపుల్ స్టెప్స్ లో ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వ్యాధి మరియు ఆలస్యం. వీటికి ఒకటే సొల్యూషన్ లైట్ ఫుడ్ అండ్ బాడీ మూమెంట్. అలాగే ధ్యానానికి కూర్చునే ముందు ఐదు నిమిషాలు లైట్ గా స్ట్రెచెస్ లేదా ప్రాణాయామం చేయండి. బాడీ ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. రెండవది స్త్యానా మరియు ప్రమాద.
(10:08) రేపు చేద్దాంలే అనే మైండ్ వాయిస్ ని బ్రేక్ చేయాలి. దీనికోసం టూ మినిట్స్ రూల్ ఫాలో అవ్వండి. రోజుకి 15 నిమిషాలు కుదరకపోయినా పర్లేదు. జస్ట్ రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటా అని మైండ్ ని ట్రిక్ చేయండి. ఆటోమేటిక్ గా కన్సిస్టెన్సీ వస్తుంది. మూడవది సంశయ. అంటే నాకు రిజల్ట్స్ వస్తాయా లేదా అనే ఆలోచనను పక్కన పెట్టండి.
(10:30) వర్కవుట్ చేసిన వెంటనే సిక్స్ ప్యాక్ రానట్లే ధ్యానం చేసిన వెంటనే మైండ్ పీస్ రాదు. ఫలితం మీద కాకుండా కేవలం ఆ 10 నిమిషాల ప్రాసెస్ మీద మాత్రమే నమ్మకం ఉంచండి. ఇక నాలుగవది అవిరతి ఇది ఈ జనరేషన్ కి చాలా ఇంపార్టెంట్. మీరు ధ్యానానికి కూర్చునే కనీసం 20 నిమిషాల ముందే మీ మొబైల్ ఫోన్ ను డు నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టి వేరే రూమ్లో పడేయండి. కంటికి కనిపిస్తేనే కదా మైండ్ లాగేది.
(10:56) ఆ ఆప్షనే ఇవ్వకండి. దీని తర్వాత భ్రాంతి దర్శనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏవైనా శబ్దాలు వినబడినా వెలుగులు కనిపించినా వాటిని జస్ట్ ఒక థాట్ లాగా చూసి వదిలేయండి. వాటిని పట్టుకొని నేను గ్రేట్ అని ఫీల్ అవ్వద్దు. మీ గోల్ ప్రశాంతత భ్రమలు కాదు. ఇక చివరిగా అలబ్ద భూమికత్వం మరియు అనవస్థితత్వం అంటే కొన్ని రోజులు ధ్యానం కుదరకపోయినా పాత అలవాట్లలోకి మైండ్ వెళ్ళిపోతున్నా గిల్ట్ గా ఫీల్ అవ్వకండి.
(11:25) ఇదొక జర్నీ ఈరోజు కుదరలేదా ఇట్స్ ఓకే రేపు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి అడ్డంకులు రావడం కామన్ కానీ వాటిని దాటుకుంటూ వెళ్తేనే రియల్ పీస్ దొరుకుతుంది. ఒకవేళ మీ లైఫ్ లో కూడా ధ్యానం కుదరట్లేదని మీరు బాధపడుతుంటే మీరు ఫెయిల్ అవుతున్నట్టు కాదు పతంజలి చెప్పిన ఈ తొమ్మిది స్పీడ్ బ్రేకర్లలో ఏదో ఒక దాని దగ్గర మీ బండి ఆగింది.
(11:51) ఆ అడ్డంకి ఏంటో గుర్తించడమే మీ మొదటి విజయం. దాన్ని ఓపికతో దాటడం మీ రెండవ [సంగీతం] విజయం. అప్పుడు ధ్యానం అనేది మీరు బలవంతంగా చేసే ఒక పనిలా కాకుండా మీ శ్వాసల మీ స్వభావంగా మారిపోతుంది. మరి మీ ధ్యాన సాధనలో ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన అతి పెద్ద అడ్డంకి ఏది? వ్యాధ ఆలస్యమా లేక సోషల్ మీడియా వల్ల వచ్చే అవిరత ఏంటనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి.
(12:18) ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా యూస్ అవుతుంది అనుకుంటే వారితో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ప్రాచీన రహస్యాలను మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే మన సనాతన లైఫ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు నమస్తే.

No comments:

Post a Comment