Tuesday, August 23, 2022

కనుక "అవిద్య" మాయ యొక్క అంశమని గ్రహించాలి.

వయసి గతే కః కామవికార: ,శుష్క నీరేకః కాసారః!!
క్షీణే విత్తేకః పరివారో, జ్ఞాతే తత్వేక: సంసార । "భజ"!!

నాయనలారా! లౌకిక విద్యలయందు నిష్ణాతులైన వారు కూడ ఏదో ఒక కారణము వుంటే గాని ఏ కార్యము జరగదు అనే విషయాన్ని ఆకళింపు చేసుకొనలేకపోతున్నారు. నీలో కామమనే తృష్ణ పెరగడానికి అది హద్దులు మీరి ప్రవర్తించేలా చేయడానికి దాని వెనుక యున్న కారణము నీవయస్సు వల్ల వచ్చిన యవ్వనపు తాలుకు పొంగేయని గ్రహించలేకున్నారు.

నీవయసు  గతించి యవ్వనము క్షీణిస్తే నీలోని కామ వికారాలు తుపాకి శబ్ధానికి చెట్టు మీద కాకులన్నీ ఎగిరి పోయినట్లు. మాయమవుతాయి. ఎండలకి నీరు ఎండి పోయిన తటాకములో దానిని ఆశ్రయించుకున్న జలచరాలు, నీటి ఆధారిత వృక్షాలు ఎలా నశిస్తాయో నీవయసుడిగిపోగానే నీ కామవికారాలు కరిగి పోతాయి.

ఈ తత్త్వాజ్ఞనాన్ని గ్రహించిన నాడు సాధకునిలో వ్యామోహం నశించి సంసార వ్యామోహం క్షీణిస్తుంది. సాధకుడు "అవిద్య"లో మునిగి తేలుతున్నంత కాలము అతనికి “”ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టు””గాను భ్రమిస్తాడు.

బామ్మగారు దొడ్లో దండెం మీద ఆరవేసిన మడిబట్ట చీకటిలో గాలికి ఎగురుతు కొంతమందికి దయ్యం లా  భ్రమింప చేస్తుంది. దయ్యమనే భయములో కాలికి తగులుకున్న తాడుని పామని భయ పడతారు. కానీ ఎవరో తెచ్చిన దీపపు కాంతి ( జ్ఞానము) రాగానే దండెం మీద మడి బట్ట, కాలికి తగిలిన తాడు రెండు స్పష్టముగా తెలుస్తాయి.

కనుక "అవిద్య" మాయ యొక్క అంశమని  గ్రహించాలి. వ్యామోహం నశించిన సాధకుడు " అవిద్య" ను జయించి తత్త్వజ్ఞానాన్ని పొందా అంటే నిత్యమ పరమాత్మని " భజగోవిందం -భజగోవిందం” యని స్తుతించాలని భగవత్పాదుల వారు  మనకి ఉద్భోదిస్చున్నారు.


🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment