Sunday, August 21, 2022

కామాక్షి అమ్మవారి రహస్యం..

 కామాక్షి అమ్మవారి రహస్యం..

మనకి కాంచీపురం అనగానే కామాక్షి అమ్మవారు గుర్తుకు వస్తారు.. కామాక్షి అమ్మవారు శివ కంచి లో ఉంటారు.. వరదరాజ స్వామి వారు విష్ణు కంచి లో ఉంటారు.. ఒకానొకప్పుడు సాయంత్రం 6 దాటితే చాలు శివ కంచి మొత్తం ఖాళీ అయ్యేది.. ఒక్క పురుగు కూడా ఉండేది కాదు.. అక్కడ ఉండే ప్రజలు మొత్తం విష్ణు కంచి వచ్చేసేవాల్లు ఖాళీ చేసి.. ఎందుకు ??

ఎందుకు అంటే కామాక్షి అమ్మవారు ఒకప్పుడు ఉగ్ర రూపంలో ఉండేవాళ్ళు.. బలి కోరుకునేది ఆకలి ఎక్కువ... మీరు అడగవచ్చు అమ్మవారు అంటే అలా బలి కోరదు కద.. అమ్మ అంటే అందరినీ కాపాడుతుంది కద అని.. ఇక్కడే అసలు రహస్యం ఉంది..

ఈ భూ మండలానికి నాభీ స్థానం ఏది అంటే అది కాంచీపురం ఒక్కటే.. సతి దేవి యొక్క ఉదర(పొట్ట) భాగం పడిన ప్రదేశం.. జఠరాగ్ని ఉండే స్థానం కద.. మన కంటికి కనపడని అగ్ని అది.. కడుపులో ఉంటుంది.. ఆకలి ఎక్కువ.. సాయంత్రం 6 దాటితే అమ్మవారు రాజ శ్యామల అవతారంలో ఊరు మీదకి వచ్చి తినేస్తూ ఉండేది.. అలా అక్కడ ఉండే ప్రజలు జంతు బలులు చేసి గుడిలోనే నైవేద్యంలా పెట్టేసి శివ కంచి మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయేవారు.. 

చోళ రాజుల వారు ఇది చూసి ఆది శంకరాచార్యుల వారిని ఆహ్వానించారు ఇలా అమ్మవారు బలులు కోరుతుంది ఆవిడని శాంత మూర్తి లా మార్చండి అని చెప్పారు.. సరే అని ఆది శంకరాచార్యుల వారు గుడిలోకి వెళ్లి అతని శిష్య బృందంతో ఒక గోడ నిర్మింపచేశారు.. ఆయన వారి శిష్యులతో ఇలా అన్నారు "నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను.. మీరు ఎవ్వరూ కూడా లోనికి రావద్దు.. నేను రేపు ఉదయం వరకు బయటకి రాకపోతే మీరు వచ్చి నన్ను చూడండి.. ఒకవేల నేను వచ్చే సంకేతాలు అంటే ఆకాశంలో ఒక పెద్ద జ్యోతి వెలుగు మీకు కనిపిస్తుంది" అని చెప్పి లోనికి వెళ్ళారు...

ఆయన అమ్మవారి ముందు కూర్చుని ఉన్నారు.. సాయంత్రం 6 అయింది.. రాజ శ్యామల అవతారంలో వచ్చింది అమ్మవారు.. "ఎవడివి రా నువు.. నీకు ఎంత ధైర్యం?? నా ముందే వచ్చి కుర్చుంటావ.. నిన్ను నేను తినేస్త" అని ఉగ్ర రూపంలో ఉండి అమ్మవారు ఆయనతో అనింది.. ఆయనకి ఆ ఉగ్ర రూపం ఏమి కనపడం లేదు.. అక్కడ ఉంది కేవలం అమ్మవారే అన్న దృష్టితో చూస్తున్నారు.. ఆయన ఇలా అన్నారు "సరే అమ్మా నువు నన్ను అలాగే తినేసేయి కాకపోతే మనం ఇద్దరం పాచికలు ఆడుకుందాం.. అందులో నువు ఓడిపోతే నేను చెప్పినట్లు వినాలు.. నేను ఓడిపోతే నువు నన్ను తినేసేయి" అని చెప్పారు.. ఈ క్రీడ చూడాలి అంటే ఒక మూడవ మనిషి కావాలి కద.. సాక్షి గణపతి వచ్చారు వీరి దగ్గరకు.. ఇప్పటికీ మీరు గర్భ గుడిలో సాక్షి గణపతి నీ చూడవచ్చు...

ఇప్పుడు ఆట మొదలు పెట్టారు.. ఆది శంకరాచార్యుల వారికి ఉన్న గొప్ప విద్య ఏమిటి అంటే పరకాయ ప్రవేశం చేయడం.. ఒక పక్క అమ్మవారితో పాచికలు ఆడుతూనే మరో వైపు వేరొక రూపంలోకి పరకాయ ప్రవేశము చేసి అక్కడ ఉండే శ్రీ చక్రం లో కొన్ని బీజాక్షరాలు మార్చి వేశారు.. లం, రం, శ్రీం.. ఈ మూడు తప్పుగా ఉన్నాయి..

రం అంటే అగ్ని తత్వం.. ఆకలి ఎక్కువ.. అందుకే బలులు కోరుతుంది.. ఇప్పుడు ఆయన ఏమి చేశారు అంటే రం అనే బీజాక్షర పదాన్ని తీసి వేసి ఆ స్థానంలో శ్రీమ్ అనే పదాన్ని పెట్టారు.. అమ్మవారు ఇప్పుడు శాంత మూర్తి లా తెల్లని వస్త్రం ధరించి ప్రసన్న చూపులతో చూస్తూ ఉన్నది.. ఈ పాచికలు ఆటలో ఆయన ఓడిపోతారు.. ఇంక అమ్మవారు శాంత మూర్తి అయిపోయింది కదా.. ఇంక అప్పటి నుండి బలులు ఏమి లేవు...

కాకపోతే ఈవిడకి ఆకలి అనేది ఉంది.. అందుకోసం అనే ప్రతి రోజూ కనీసం మూడు కాలాలలో అభిషేకం చేయాలి అని నియమం పెట్టారు.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం..

ఈ మూడు కాలాలలో అభిషేకం అనేది తప్పకుండా చేయాలి.. పొరపాటున ఒక్కసారైనా అభిషేకం చేయడం మాని వేస్తే సముద్రుడు వచ్చి ఈవిడ ఆకలిని తీరుస్తారు అని నియమం చేసి ఆది శంకరాచార్యుల వారు ఆ కాంచీపురంలోనే కామకోటి పీఠాన్ని స్థాపించారు...

2005 డిసెంబర్ లో జయేంద్ర సరస్వతి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు కద.. ఆయన మనసు చింతించింది.. అక్కడ ఉండే వాళ్ళు అభిషేకం చేస్తున్నారు కానీ మనసు పెట్టీ చేయడం లేదు.. దీంతో అమ్మకి కోపం వచ్చి తమిళనాడు మొత్తాన్ని ముంచి వేసిన ఘటన మనం చూశాం(సునామీ).. అందుకే అంటారు ఒక మాట నువు ఎవరితో అయినా పెట్టుకో దేవుడి జోలికి కానీ ధర్మం జోలికి కానీ వెళ్లకు అని అంటారు.. Don't Touch the God Power... It will Destroy You...

ఇది కామాక్షి అమ్మవారి గుడిలోని రహస్యం..

మీరు ఇప్పటికీ కామాక్షి అమ్మవారి గుడిలో పాచికలు ఆడిన ప్రదేశం, సాక్షి గణపతి, వారాహి అమ్మవారు, అరూపా లక్ష్మి అమ్మవారు, రాజ శ్యామల అమ్మవారు, ఆడు శంకరాచార్యుల వారిని, పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి వారిని అందరినీ చూడ వచ్చు...

పైన చెప్పిన రహస్యం అక్షర సత్యం అండి..

మీరు కావాలి అంటే కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి ఒకప్పుడు బలులు కో అమ్మవారు అని అడగండి..

వాళ్ళు చెప్తారు... నేను చెప్పిన మాటే..

 ---సేకరణ 

No comments:

Post a Comment