*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴మానవుడు ఎంత జ్ఞానం సంపాదించినా, తెలుసుకోవలసినది తెలుసుకోలేకపోతే ఆ జ్ఞానం వృధాయే. తెలుసుకోవలసింది తెలుసుకోవాలంటే దానికి శ్రద్ధ, భక్తి ముఖ్యం. పరమాత్మను చేరుకోవాలంటే గురువు మీద, పరమాత్మ మీద శ్రద్ధ, అచంచలమైన భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. జపము, ధ్యానము, కీర్తన, స్మరణ.. వీటితో భగవంతుని ఆరాధించాలి. అప్పుడు భక్తునికి మంచి బుద్ధి పుడుతుంది. మనస్సు చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి మళ్లుతుంది. గురువు దగ్గర నుండి, శాస్త్రములు పురాణముల నుండి జ్ఞానము సంపాదిస్తాడు. తరువాత తెలుసుకోవలసిన పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అదే ముక్తికి మార్గము. దీనికి మూలము భక్తి, శ్రద్ధ, అభ్యాసము. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు..🌴_*
No comments:
Post a Comment