💖💖💖
💖💖 *"525"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మనిషిలో కలిగే మాయ, వ్యామోహాలకు కారణం ఏమిటి ?"*
*"ప్రపంచం మనకు వేరుగా కనిపించటమే మాయకు కారణం. కోరికే వ్యామోహానికి దారితీస్తుంది. బ్రహ్మం శుద్ధమైతే దాని నుండి మాయ పుట్టటం ఏమిటని 'శ్రీరామచంద్రుడు' వశిష్టమహర్షిని ప్రశ్నించారు. గాఢ వైరాగ్యం ఉన్న శుద్ధ మనసులో మాయ అనే ఈ ప్రశ్న ఉదయించదని ఆ మహర్షి సమాధానం చెప్పారు. శుద్ధవైరాగ్యం అంటే కోర్కెలేని స్థితి. అలాంటి స్థితిలో ఉన్న వారికి మాయ ఏముంటుంది. ఎవరికైనా తనదికాని వస్తువుపై కోరిక కలుగుతుంది. తనదైన వస్తువుపై ఆ దృష్టిరాదు. అందుకే వేళ్ళకు పెట్టుకొనే ఉంగరాలపై కోరిక ఉంటుందిగానీ ఎంత అందంగా ఉన్నా తన వెళ్ళపై తనకే (ఎవరికీ) ఆ భావన కలుగదు. మనలో కలిగే మాయకు కారణం, ప్రపంచం మనకు వేరుగా కనిపించటమే !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment