🌷 *పంచకోశ సమ్మేళనం -మనశరీరం*🌷
_మెడికల్ ఫిజియాలజీ ఉన్నట్లే ఒక సంపూర్ణమైన యోగిక్ ఫిజియాలజీ కూడా ఉంది. యోగాలో మనం శరీరాన్ని అయిదు కోశాలు లేక పొరలుగా చూస్తాము. శరీరం యొక్క మొదటి పొరను #అన్నమయకోశం అని అంటాము, ఇది అన్నశరీరం. మీరు ‘శరీరం’ అని పిలేచేది ఈ పోగుచేసుకున్న ఆహారపు కుప్పనే._
_రెండొవ పొరను #మనోమయకోశం అని అంటారు, ఇది మానసిక శరీరం. నేడు డాక్టర్లు మీరు ‘సైకో – సోమా’ అని చెప్తున్నారు – అంటే మీ మనస్సులో ఏమి జరుగుతుందో అది మీ శరీరంలో కూడా జరుగుతుంది అని. ఇది ఇలా ఎందుకు జరుగుతుందంటే మీరు ‘మనస్సు’ అని పిలేచేది మరెక్కడో ఉన్న ఒక ప్రదేశం కాదు. ప్రతీ అణువుకు దాని సొంత మేధస్సు ఉంటుంది. అలా ఒక సంపూర్ణమైన మానసిక శరీరం కూడా ఉంటుంది_.
_మీ మానసిక శరీరంలో ఏమి జరిగినా అది మీ భౌతిక శరీరంలో జరుగుతుంది, మీ భౌతిక శరీరంలో ఏమి జరిగినా అది మానసిక శరీరంలో కూడా జరుగుతుంది. మీ మనస్సు స్థాయిలో ఎటువంటి హెచ్చుతగ్గులు ఉన్నా దానికి ఒక రసాయనిక ప్రతిచర్య ఉంటుంది, అలాగే ప్రతీ రసాయనిక ప్రతిచర్య కూడా మీ మనస్సులో హెచ్చుతగ్గులను సృష్టిస్తుంది. దీని వల్లనే ఎన్నో సైకోసోమాటిక్ వ్యాధులు అభివ్యక్తం అవుతున్నాయి._
_మీ భౌతిక, మానసిక శరీరాలు హార్డువేర్, సాఫ్ట్వేర్ లాంటివి. మీరు మీ హార్డువేర్, సాఫ్ట్వేర్లను పవర్‌కు అనుసంధానం చేయనంత వరకూ అవి ఏమీ చేయలేవు కదా? అలాగే మీ భౌతిక, మానసిక శరీరాలకు పవర్ లాంటిది మూడొవ శరీరం. దీనినే #ప్రాణమయకోశం లేదా శక్తి శరీరం అని అంటారు. మీరు శక్తి శరీరాన్ని సరైన సమతుల్యతతో, పూర్తిగా క్రియాశీలంగా ఉంచుకుంటే మీ భౌతిక శరీరంలో కానీ లేక మానసిక శరీరంలో కానీ వ్యాధి అనేదే ఉండదు_.
_నేను ‘వ్యాధి’ అన్నప్పుడు నేను అంటువ్యాధుల గురించి కాకుండా కేవలం దీర్ఘకాల వ్యాధుల గురించి చెప్తున్నాను._
_అంటువ్యాధులు బయటి జీవుల వల్ల కలుగుతాయి, కానీ మనుషులు ప్రతీరోజు వారు సొంతంగా రోగాలను సృష్టించుకుంటున్నారు. మీ శక్తి శరీరం పూర్తి స్థాయిలో, సరైన సమతుల్యతతో పనిచేస్తూ ఉంటే, మీ భౌతిక శరీరంలో వ్యాధి నిలువలేదు. ఎటువంటి వ్యాధి ఉన్నా, దానికి కారణం శక్తి అది పని చేయాల్సిన తీరులో పని చేయకం పోవటమే._
_కేవలం కొన్ని సులువైన యోగా సాధనలు చేయటం వల్ల భౌతిక, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందిన వాళ్ళను నేను కొన్ని వేల మందిని చూపించగలను. అయితే ఈ సాధనలు వ్యాధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి కావు. కానీ ఈ సాధనల ద్వారా మీ శక్తి శరీరాన్ని పూర్తి స్థాయిలో, సమతుల్యతతో పనిచేసేలా చేయవచ్చు._
_శరీరం యొక్క ఈ మూడు పార్శ్వాలు – అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం – ఇవ్వన్ని భౌతిక అస్థిత్వం కలిగినవి. ఉదాహరణకు ఒక లైట్ బల్బ్ తీసుకుందాము; అది భౌతికమైనదే. దాని వెనకనున్న ఎలక్ట్రిసిటీ కూడా భౌతికమైనదే, కానీ కొంచం సూక్ష్మమైనది. మీరు దాన్ని చూడలేరు; కానీ మీ వేళ్ళు లైట్ సాకెట్లో పెడితే అది ఉందని తెలుసుకోవచ్చనుకోండి! ఆ లైట్ నుంచి వెలువడే వెలుగు కూడా భౌతికమైనదే, కానీ అది మరింత సూక్ష్మమైనది. ఆ బల్బ్, ఎలక్ట్రిసిటీ, వెలుగు – ఈ మూడు కూడా భౌతికమైనవే. ఒకటి మీరు చేతిలో పట్టుకోగలరు; మరొకటి మీరు అనుభూతి చెందగలరు; మరొకటి మీ కళ్ళ వంటి మరింత సున్నితమైన గ్రాహకంతో మీరు చూడవచ్చు. మీరు ఇవ్వనీ అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీకు వీటిని అనుభూతి చెందటానికి అవసరమైన ఇంద్రియ జ్ఞానం ఉంది. భౌతికాతీతం అయిన వాటిని అనుభూతి చెందటానికి మీకు కావలిసిన ఇంద్రియ జ్ఞానం లేదు._
_నాలుగొవ పొరను #విజ్ఞానమయకోశం అని అంటారు. విజ్ఞానమయ కోశం ఒక అనుసంధాన స్థితి. ఇది భౌతికమైనదీ కాదు, భౌతికాతీతమైనది కూడా కాదు; ఇది ఈ రెంటి మధ్య ఉండే ఒక లంకె లాంటిది. ఇది ఇప్పుడు మీరున్న స్థాయిలోని అనుభవం కాదు ఎందుకంటే మీ అనుభవాలు పంచేంద్రియాలకు పరిమితమైనది._
_అయిదొవ పొరను #ఆనందమయకోశం అంటారు, ఇది భౌతికాతీతమైనది. దీనికి భౌతిక పార్శ్వాలతో ఏ పని లేదు. భౌతికాతీతమైన పార్శ్వాన్ని మనం వర్ణించలేము, కనుక దాన్ని మనం అనుభూతిపరంగా మాట్లాడతాము. భౌతికాతీతమైన దానీతో ఎప్పుడు మనం సంబంధం కలిగి ఉంటామో, మనకు ఆధారభూతమైన దానితో మనం ఎప్పుడు అందుబాటులో ఉంటామో, అప్పుడు మనం పరమానందంగా మారుతాము. మన అనుభవానికి సంకేతంగా మనం దాన్ని ఆనందమయ దేహం అని అంటాము. దానర్ధం మీరొక ఆనందపు బుడగను మీలో ఉంచుకుని తిరుగుతారని కాదు. వర్ణించలేని, నిర్వచించలేని భౌతికాతీతమైన ఈ పార్శ్వాన్ని మీరు తాకినప్పుడు మీలో పరమానందం ఉప్పొంగుతుంది. అందువల్లనే దాన్ని ఆనందమయ దేహంగా పిలుస్తారు_.
_ఇలా మీ శరీరంలో అయిదు కోశాలు ఉన్నాయి. మీ భౌతిక, మానసిక, శక్తి దేహాలైన అన్నమయ, మనోమయ, ప్రాణమయ కోశాలు కచ్చితమైన అనుసంధానమై ఉన్నప్పుడు, మీకు ఆనందమయ కోశం అందుబాటులోకి వస్తుంది_.
_బాహ్య పరిస్థితుల విషయానికి వస్తే, మనలో ప్రతి ఒక్కరి సామర్ధ్యం వేర్వేరుగా ఉంటుంది. ఒకరు ఏమి చేయగలరో మరొకరు అది చేయలేకపోవచ్చు, కానీ మీ అంతర్గత వాస్తవాలకు వచ్చేటప్పటికి అందరూ సమానమైన సామర్ధ్యం కలిగినవాళ్ళే. ప్రతీ మనిషి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోగలడు. మీరు పాడగలరా, డాన్స్ చేయగలరా, పర్వతాలను అధిరోహించగలరా లేక డబ్బు సంపాదించగలరా అనేది మనం కచ్చితంగా చెప్పలేము. కానీ మీ జీవితానుభవాన్ని ఒక ఆనందమయ అనుభూతిగా, అత్యంత ఆహ్లాదకరంగా చేసుకోవాలని మీరు కోరుకుంటే ఎవ్వరూ కాదనలేరు. అప్పుడు మీ జీవిత ప్రయాణం ఏ మాత్రం శ్రమలేకుండా, పూర్తి సామర్ధ్యంతో, ఎటువంటి ప్రయాస లేక ఒత్తిడి లేకుండా సాగిపోతుంది. అప్పుడు మీరు మీ జీవితంతో ఏ ఆట కావాలంటే ఆ ఆట ఆడవచ్చు, కానీ జీవితం మీ మీద ఒక్క చిన్న గీతను కూడా మిగిల్చలేదు._. 🌹🌹సహజ🌹🌹
No comments:
Post a Comment