*కందుకూరి కోరికది ...*
కందుకూరి వీరేశలింగం పంతులు
గొప్పోడు సరే
మనం ఎందుకు మూఢనమ్మకాలను తీసే కందుకూరీలం కాలేకపోతున్నాం...
కందుకూరి వీరేశలింగం పంతులు
మహానుభావుడు సరే
మనం ఎందుకు బాల్య వివాహాలను అరికట్టే
వీరేశలింగంలు కాలేకపోతున్నాం...
కందుకూరి వీరేశలింగం పంతులు
ఆదర్శపురుడు సరే
మనం ఎందుకు దురాగతాలను తొలగించే
పంతుళ్ళం అవలేకపోతున్నాం...
కందుకూరి వీరేశలింగం పంతులు
నవయుగ వైతాళికుడు సరే
మనం ఎందుకు ప్రశ్నించే గొంతుకై
నిలువలేకపోతున్నాం...
వర్ధంతని జయంతని
దండమేసి దండమెట్టడం
కవితలు పాటలు రాస్తూ
ఆహా ఓహో అని భజన చేయడం
కాదు
కందుకూరి వీరేశలింగం పంతులు
కోరుకునేది
తన ఆశలను ఆశయాలను నెరవేర్చడం...
ఓ మనుషులారా
స్వార్థపు *సతీసహగమనంలో నిత్యం చావకుండా*
*కొంచం మంచితనంతో మసులుకోండి*
*ఇదే*
*పంతులు మీనుంచి కోరే సన్మానం...*
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment