🦚జ్ఞాన ప్రసూనాలు🚩
06/10/25
1) నాకు దూరమైన ప్రతీది శివార్పితం, నాకు దగ్గరైన ప్రతీది శివ ప్రసాదం.
2) ఈ పారాయణాలు కంటే ఈ భగవన్నామస్మరణ కంటే నీ “నామాన్నే” నీవు స్మరించుకో...
అన్ని మంత్రాలకు మించిన ఫలితం ఉంటుంది. అన్నారు గురువుగారు.
భగవన్నామ స్మరణ చేస్తే ఎప్పుడో ప్రత్యక్షం.
నీ “నామాన్ని” నీవు స్మరిస్తే ఇప్పుడే ప్రత్యక్షం.
నిన్ను నీవు తెలుసుకో అనే బోధ కంటే నిన్ను నీవు స్మరించుకో అనే బోధయే శ్రేష్టం.
ఓంకారంతో సహా సకల దేవతానామాలన్నీ ద్వితీయమే.
నీ “నామం” ఒక్కటే ప్రధానమైనది.
3) భక్తి వలన సుఖదుఃఖాలు రాకుండా పోవు. భక్తి వలన సుఖదుఃఖాలు మనకు టచ్ కానంతగా ఒక కవచం ఏర్పడుతుంది.
4) లోపల నుండి వెలుపలకి వస్తే అది అవతారం.
వెలుపల నుండి లోపలకు వెళితే అది సాక్షాత్కారం.
ఈ రెంటికీ తన దేహమే ద్వారం.
No comments:
Post a Comment