Monday, October 13, 2025

 


భ - సన్యాసికి ఏకాంతం అవసరమా?

మ - ఏకాంతము మనిషి మనస్సులో ఉంటుంది. ఒకడు జన మధ్యంలో ఉండి కూడా కొఱత లేని మనశ్శాంతిని నిలబెట్టుకోవచ్చు. అట్టివానికి ఎప్పుడూ ఏకాంతమే. ఇంకొకడు అడవిలో ఉన్నా మనస్సును నిగ్రహించుకోలేకపోవచ్చు. అట్టివాడు ఏకాంత వాసి అని చెప్పలేము. ఏకాంతమనేది ఒక మనోవృత్తి. లౌకిక విషయాసక్తునికి ఎక్కడ ఉన్నా ఏకాంతం లభించదు. నిరాసక్తుడు ఎప్పుడూ ఏకాంతవాసియే.

*సద్బోధన*

దేవుడు అంటూ ఉంటే ఆయన గమనించేది ఏమిటి...?

ఆయన మీ సోషల్ మీడియా పోస్ట్ లు చూడడు. ఎందుకంటే ఆయనకి టచ్ ఫోన్ లేదు 

ఆయన మీ స్టేటస్ లు చూడడు 
ఎందుకంటే తనకి పేస్ బుక్ అకౌంట్ లేదు 

ఆయనపై మీరు భక్తితో కాదన్న వారిపై మీరు వేసే పిచ్చి పోస్ట్ లు చూడడు. ఎందుకంటే ఉంటే బోలెడు పని ఉంటుంది ఆయనకి 

ఉంటే గింటే....

కేవలం ఆయన చూసేది ఒక్కటే 

మీ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఇన్ రియల్ లైఫ్ ఓన్లీ

No comments:

Post a Comment