Monday, October 13, 2025

 *సేతు రహస్యం - 23*
🌊

రచన : గంగ శ్రీనివాస్


"గ్రేట్ ఐడియా, చాలా బాగుంది" అన్నాడు రాజేష్. అందరు చప్పట్లు చరిచారు. 

"కమాన్ మైఖేల్, దీనికి కావలసిన లెక్కలన్నీ నువ్వే కట్టాలి" అన్నాడు శ్రీధర్.

అప్పటికప్పడు కూర్చుని వారంతా కావలసిన వివరాలను సేకరించారు. మైఖేల్ తన ప్రొఫెసర్లను కాంటాక్ట్ చేసి వారి నుంచి తగిన సలహాలు పొందాడు.

ఆ శిల బరువు, అది సేతుసముద్రంలో ఎంత లోతున ఉన్నది, దాని కొలతలకు సంబంధించిన వివరాల ఆధారంగా ఒక భారీ సైజులోని బెలూన్ని డిజైన్ చేసాడు మైఖేల్. అంత సైజులో బెలూన్ని తయారు చేయటానికి పట్టే సమయం మూడు నెలల వరకు ఉంటుందన్నారు బెలూన్లు తయారు చేసే కంపెనీ అధికారులు.

ఒక భారీ సైజు బెలూనుకి బదులు మూడు చిన్న సైజు బెలూన్లు తయారు చేస్తే ఫలితం ఉంటుందనిపించింది. ఎందుకంటే అంత పెద్ద బెలూన్ని పని చేయించే సామర్థ్యం కోసం అవసరమైన ఇతర పరికరాలు కూడా భారీగా ఉంటాయి గనుక మూడు చిన్న బెలూన్లు అయితే చిన్న పరికరాలతో సరిపెట్టవచ్చు. అంతేగాకుండా తయారికి పట్టే సమయం కూడా ఆదా అవుతుంది. చివరకు తమకి కావలసిన రీతిలో బెలూన్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేయించారు. వాటిని ఉపయోగించి ఆ శిలను సాగర గర్భం నుంచి వెలికి తీసుకురావడంలో గల సాధక బాధకాలను అంచనా వేయడం కోసం రాజేష్ మైఖేల్ సహకారంతో ఒక కంప్యూటర్ ప్రోగ్రాం తయారు చేసాడు.

ఆ శిల ఉన్న పరిస్థితులను, దాని బరువు, అక్కడ ఉన్న సాగర జలాల ఒత్తిడి, అలాగే బెలూన్లలో నిండే హీలియం గాలి పైకి ఎంత శక్తితో వెళ్తుంది. అనే విషయాల ఆధారంగా ఒక సిమ్యులేషన్ మోడల్ ను తయారు చేసుకొని బాగా అధ్యయనం చేసారు.

మారుతి గ్రూప్ లోని సభ్యులంతా కూడా ఆ శిలను బైటకు తీసుకువచ్చే ఆ ప్రాజెక్టు పైననే తమ శక్తి సామర్ధ్యాలను మొత్తం కేంద్రీకరించారు. బెలూన్ల సాయంతో ఆ శిలను పైకి ఎత్తాలనే ఆలోచన చాలా కొత్తగా ఉండటంతో, వారి ప్రయత్నాలను ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా గమనించసాగారు.
📖

ఆ శిలను సముద్రజలాల నుంచి పూర్తిగా లేపకుండా దానిని నీటిలోపల ఉంచే తీరం వైపు తీసుకుని వెళ్ళాలని నిర్ణయించారు. నీటిలో మునిగి ఉన్నప్పుడు అది తేలికగా ఉంటుందని దాన్ని తమకి అనుకూలంగా వాడుకోవటానికి అలా చేయాలనుకున్నారు.

బెలూన్లు కట్టిన తాళ్ళను కావలసిన దిశలలో లాగి అది ఇతర శిలలకు తగిలి పాడయిపోకుండా ఉండే విధంగా చేయటానికి మోటర్ బోట్లను వాడాలని నిశ్చయించారు.

ఇలా ఆ శిలను వెలుపలికి తేవటానికి కావలసిన సకల సన్నాహాలు పూర్తిచేసారు. ప్రపంచం అంతటా వీరు చేయబోతున్న పనిపై ఆసక్తి నెలకొంది. మీడియా ఈ వార్తకు చాలా ప్రాధాన్యమిచ్చింది. శిలను భూమి పైకి తేచ్చే రోజు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
📖

*రహస్య ఛేదనం*

ఆ రోజు రానే వచ్చింది. మారుతి గ్రూప్ లో ఉత్సాహం, ఒత్తిడి సమపాళ్ళలో ఉన్నాయి. భట్టుమూర్తి, పరంధామయ్య గారు కూడా వచ్చారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం చూడటానికి వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్ ముఖ్య కార్యనిర్వాహకసభ్యులు మోడి, బెనర్జీ, సూర్యనారాయణ తదితరులు అంతా వచ్చారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సేతుసముద్రంలో చేస్తున్న ఈ భారీ ప్రయత్నానికి కావలసిన అనుమతులు ముందే తీసుకున్నారు. భారత నౌకాదళా నికి చెందిన కోస్ట్ గార్డ్ ని ముఖ్యమైన స్థలాలలో మోహరించారు. ప్రమాదాలను నివారించడం కోసమో, అవసరానికి ఆదుకోవడం కోసం మాత్రమే కాక, ఇలాంటి ప్రయోగం, ప్రపంచంలో మొట్టమొదటసారి జరుగుతున్న ఈ వినూత్న ప్రక్రియ ఎలా పనిచేస్తుందో చూడాలనే ఉద్దేశం కూడా వారికి ఉంది.

సేతు సముద్రంలోకి కావలసిన సరంజామా అంతా చేరవేసారు. శ్రీధర్, మైఖేల్, కేట్, ఆండ్రూస్, శరత్ చంద్రలు ఒక సబ్ మెరైన్ లో శిల ఉన్న చోటికి చేరుకున్నారు. సబ్ మెరైన్ నుంచి వెలువడుతున్న హెడ్ లైట్ల వెలుతురులో గుహ అంతర్భాగం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఆ శిల అనేక అపురూపమైన కాంతులతో కళ్ళు చెదిరేలా మెరిసిపోతున్నది.

మెరైనర్స్ బృందం కూడా అవసరమైన సరంజామాతో శిల దగ్గరకు వెళ్ళారు. ప్రత్యేకంగా తయారుచేసిన వల లాంటి దానితో శిలను పై నుంచి కవర్ చేసారు. శిల అడుగు భాగం దగ్గర వాక్యూమ్ ఉపయోగించి దృడంగా బంధించారు. తర్వాత వలకు హుక్స్ ద్వారా తగిలించి ఉన్న ఉక్కు తాళ్ళకు మూడు పెద్ద పెద్ద పాకెట్లలో మడతపెట్టబడి ఉన్న బెలూన్ల ను సబ్ మెరైన్ నుంచి తెచ్చి బంధించారు. ఆ బెలూన్లను హీలియం వాయువుతో నింపడానికి కావలసిన ఏర్పాట్లు చేసారు. మెల్ల మెల్లగా హీలియం బెలూన్లలో నిండుతూ ఉంటే పాకెట్ లా మడిచిపెట్టి ఉన్న బెలూన్ పొరలు పొరలుగా విడిపోతున్నది.

పరంధామయ్య, భట్టుమూర్తి గార్లతోపాటు వరల్డ్ విశ్వశాంతి ఫెడరేషన్ సభ్యులు అంతా రామనాథస్వామి ఆలయానికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఇరవై రెండు బావుల నీటితో ఎంతో భక్తి శ్రద్దలతో స్నాన మాచరించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పేరుగాంచిన రామలింగేశ్వరుణ్ణి దర్శించి అక్కడ ఘనంగా పూజలు జరిపించారు. తమ మనోభీష్టాన్ని నెరవేర్చ వలసిందిగా పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్ధించారు.

సేతు సముద్రంలో ఉన్న శిలను వారు శివ రూపంగానే భావించారు. అందుకే తమను అనుగ్రహించుటం కోసం మానవాళి తరించటం కోసం అందరికి దర్శనం ఇచ్చేలా భూమి పైకి వేంచేయవలసిందని ప్రత్యేకంగా ప్రార్ధించారు.

అందరూ ఆర్తితో చేసిన విన్నపాలను ఆ మహాదేవుడు మన్నిస్తాడనే నమ్మకంతో వారంతా తిరిగి ఆర్ వి సదరన్ సర్వేయర్ పైకి చేరుకున్నారు.
📖

సేతు సముద్రగర్భంలో ఉన్న మెరైనర్స్ ఊపిరిబిగబట్టి బెలూన్లు మెల్లమెల్లగా హీలియంను నింపుకుని విస్తరించడం చూస్తున్నారు. అవి అంతకంతకు పెద్దవిగా అవుతున్నాయి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
సిమ్యులేటర్ లో అనేకసార్లు ఆవిన్యాసాన్ని చేసి ఉన్న మెరైనర్స్ శిల కదిలే సమయం దగ్గర పడిందని గ్రహించారు. అందరి కళ్ళు శిలపైనే నిలిచిఉన్నాయి. అందరూ ఎదురు చూస్తున్న ట్లు శిల మెల్లగా కదలటం ప్రారంభించింది. శిల కాస్త కాస్త ముందుకి జరుగుతూ ఉంది. అది అలా ముందుకు జరుగుతుంటే అందరిలోను మాటలకందని అనుభూతికలిగింది. కళ్ళప్పగించి అద్భుత దృశ్యాన్ని చూడసాగారు. శిల కదులుతూ ఉంటే సముద్రజలాలలో ఏదో విపరీతమైన శక్తి పుట్టి సబ్ మెరైన్ని గజగజలాడించింది. దానిలో సురక్షితంగా ఉన్న మెరైనర్స్ ఉలిక్కిపడ్డారు.

సదరన్ సర్వేయర్లో సేతుసముద్రగర్భంలో జరుగుతున్న సన్నివేశం విడియో పానెల్స్ పైన గోచరిస్తోంది. అక్కడ గుమిగూడి ఉన్న పెద్దలంతా పిల్లల్లా ఆనందంతో కేరింతలు కొట్టారు. కొందరు మనసులోనే శివాష్టకం చదువుకోసాగారు.
🌊
*సశేషం*
 ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment