Friday, October 10, 2025

 365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథ తో

♥️ *కథ*-*249* ♥️


మన ఆలోచనల శక్తితో మన విధిని మార్చుకోవచ్చని మనకు తెలుసా?

*జ్యోతిష్యం*

ఒక మిట్ట మధ్యాహ్నం, బుద్ధ భగవానుడు తన శిష్యులతో కలిసి సమీపంలోని ఒక గ్రామానికి వెళ్తున్నాడు. దారిలో ఎక్కడా చెట్లు లేవు, చుట్టూ ఇసుక మాత్రమే ఉంది. వేడి ఇసుక మీద నడవడం చాలా కష్టంగా ఉంది, దానివలన వారి పాదాలు బొబ్బలెక్కిపోయాయి. కాసేపటికి బుద్ధుడు, ఆయన శిష్యులు ఒక పెద్దచెట్టును చూశారు. వారు ఆ చెట్టు నీడ క్రింద ఆగి, విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు.
అప్పుడే ఒక జ్యోతిష్యుడు అటుగా వెళ్తున్నాడు. అతనికి ఇసుక మీద బుద్ధుని పాదముద్రలు కనిపించాయి. జీవితంలో ఎన్నడూ ఇంతటి ప్రత్యేకమైన పాదముద్రలు చూడని అతను ఆ గుర్తులు చూసి ఆశ్చర్యపోయాడు. అటువంటి పాదముద్రలు గొప్ప చక్రవర్తికి మాత్రమే చెందుతాయని జ్యోతిష్కుడు భావించాడు. కానీ అక్కడ బుద్ధుడిని చూసినప్పుడు, ఈ పాదముద్రలు ఒక సన్యాసికి చెందినవని తెలుసుకుని నమ్మలేకపోయాడు.
బుద్ధుని ముఖంలో ఒక మనోహరమైన కాంతి ప్రకాశిస్తూ ఉంది. జ్యోతిష్కుడు దగ్గరకు వెళ్లి బుద్ధునితో గౌరవంగా ఇలా అన్నాడు, "నాకు తెలిసినంతవరకు, ఈ మీ పాదముద్రలు (పద్మములు) వేల సంవత్సరాలలో ఒకసారి కనిపించే అరుదైన గుర్తులలో ఒకటి. అటువంటి లక్షణం గొప్ప చక్రవర్తిలో మాత్రమే కనిపిస్తుంది. మీరు సన్యాసి అని చూసి నేను ఆశ్చర్యపోతున్నాను! జ్యోతిష్యంపై నాకున్న జ్ఞానం తప్పు అవదు" అన్నాడు.
కుతూహలంతో జ్యోతిష్యుడు, "ఓ గురువర్యా, ఎవరు మీరు?" అనడిగాడు.
బుద్ధుడు చిరునవ్వు నవ్వి, "గతంలో మీ జ్యోతిష్యం పనిచేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు నేను ప్రాపంచిక బంధం నుండి పూర్తిగా విముక్తి పొందాను. మనం ఈ ప్రాపంచిక విషయాలను మించి ఉన్నతంగా ఎదిగినప్పుడు, ఏ శాస్త్రం లేదా జ్యోతిష్యం పనిచేయదు, ఎందుకంటే అవి పరిమితమైనవి. మిగిలి ఉన్నది కేవలం భగవంతుని యొక్క సాక్షాత్కారం, సంపూర్ణ సత్యం మాత్రమే", అని చెప్పాడు.

♾️
జ్ఞానం అనేది ఒక అపరిపూర్ణమైన స్థితి. జ్ఞానం ఉన్న చోట - జ్ఞానం, జ్ఞాని, అజ్ఞాని అనే త్రిగుణ స్థితి ఉంటుంది, దీని ఫలితంగా అది పరిమితమైపోతుంది. 
కానీ బ్రహ్మం లో పరిమితి లేనప్పుడు, మీరు త్రయాన్ని ఎలా స్థాపిస్తారు? బ్రహ్మం అనేది పరిపూర్ణం, అందులో ఏదైనా ఊహ కానీ, భ్రాంతి కానీ ఎలా ఉంటుంది? 
ఊహ, భ్రాంతి అపరిపూర్ణమైన ఆత్మ (జీవం)లో మాత్రమే కనిపిస్తాయి. 🌼
*లాలాజీ*



హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
x

No comments:

Post a Comment