Friday, October 10, 2025

 సృష్టిలో అన్ని జీవులకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది.
సింహము గర్జిస్తే పది మైళ్ళ దూరము అవలీలగా. వినపడు తుంది , ఏనుగు 5 టన్నుల బరువు ఉంటే , తిమింగలం 100-150 టన్నుల బరువు ఉంటుంది మిణుగురు పురుగు కటిక చీకట్లో స్వయము ప్రకాశముతో చూడగలదు , కుక్కలు వాసన చూసి దొంగలను పట్టగలవు – చీమలు తమకంటే 52 రెట్లు బరువును అధికంగా మోసుక పోగలవు ,చిరుత గంటకు 100 మైళ్ల కు మించిన వేగముతో పరిగెత గలవు , గ్రద్దలు ఆకాశములో ఎంతో ఎత్తున ఎగురుతూ నేల మీద ఉన్న. నలుసంత కోడి పిల్లను చూడగ లదు, భూమిపై ఉన్న పశు , పక్షి, క్రిమి , కీటకాలలో ఎన్నో ప్రత్యే కతలు గలవి ఎన్నో జీవులు కలవు.*
*మరీ మనషి పత్యేకత ఏమిటి..? ఈ చరాచర సృష్టిలో అతని స్థానము ఏమిటి ? జీవ జాతులలో అతని గొప్పతనం ఏమిటి ? నేడు భూమిమీద నివసిస్తున్న జంతువులలో 20 లక్షల రకాల కన్నా కీటకాలలోని 15 లక్షల జాతుల కన్నా , పక్షులలోని 8,650 జాతుల కన్నా నిశ్చయంగా ఉన్న మానవుడే మహనీయుడు.*
*ఇన్ని కోట్ల జీవాలలో ఇన్ని లక్షల జాతులలో ఒక మానవ జాతే సమస్త భూమండలాన్ని , భూమండలంలోని కోటాను కోట్ల జాతుల్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకో గలిగిందంటే దానికి కారణం ? మానవుని మేధాసులో ఉన్న జ్ఞానం – ఆలోచన – అన్వేషణ కలిగిన మానవుడు ప్రపంచం ఫై ఆధీపత్యము వహిస్తున్నాడు.*
*సమస్త జీవ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు ? అసలు సృష్టికర్త ఎవరు ? అతను అపారాశక్తి సంపన్నుడు ఆది అంతము లేనివాడు, సృష్టి , స్థితి, లయాలకు మూల కారకూడైన ఆ శక్తి సంపన్నున్ని – ఎలా దర్శించాలి ? ఎలా ప్రసన్నం చేసుకోవాలి ? అతనిలో ఎలా లీనం కావాలి ? ఎలా ధ్యానించాలి ? ఎలా పూజించాలి ? అసలు అతడు ఒక్కడా! అనేకులా ?*
*మరి మానవుడు ఎక్కడ నుండి వచ్చినాడు. అన్ని రంగాలలో ఆలోచన చేయగలిగిన మానవుడు తను ఎందుకు వచ్చాడో, తన ప్రత్యేకత ఏమిటి ? అని తనకు తానూ తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదు. ఈ నాడు అనంతమైన విజ్ఞానాన్ని పొందుతూ ఖగోళంలో ఏముందో చూడగలిగిన మానవుడు, భూగర్భములో ఏముందో చెప్పగలిగిన మానవుడు, గర్భస్థ శిశువు ఆడ, మగ అని చెప్పగలిగిన మానవుడు, దేహ రచన శాస్త్రములో కానీ అన్ని రంగాలలో ఎంతో ముందుకు పోతున్నాడు. కానీ ఆధ్యాత్మిక రంగంలో మాత్రం తనని తాను తెలుసుకునే దానిలో ముందుకు పోలేకపోతున్నాడు కారణం ? జ్ఞానం లేకనా ? ఆలోచన లేకనా ? అశ్రద్ధ వలననా ? తనలో ఉన్న జ్ఞానం, ఆలోచన, అన్వేషణ అనునవి సూక్ష్మ స్థితిలో తనలోనే ఉన్నా-వీటికి మూలము ఏమిటి అని అన్వేషించలేక పోతున్నాడు కారణం ? మార్గం తెలవకనా, ఈ విశాల సృష్టికి మూలం ఎవరో ఒకరు ఉంటారు కదా? అతనిని వెతకటం ఎందుకు ప్రయత్నము చేయడం లేదు.*
*తనను సృష్టించింది ఎవరు? తన చుట్టూ ఉన్న జీవ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? ఈ ప్రకృతిని , ఈ అనంత ఆకాశాన్ని , సువిశాల భూమండలాన్ని, మహాపర్వత శ్రేణులను, సరస్సులు, సాగరములు ఇలా ఆనంతసృష్టిని సృష్టించిందెవరు. ఆ సృష్టికర్త ఎవరు ? అతడు అపారాశక్తి సంపన్నుడై ఉండాలి-సృష్టి స్థితి లయకు కారణమై ఉండాలి. అన్ని తెలుసుకునే మానవుడు నిన్న నీవు ప్రథమంగా తెలుసుకో. తరువాత అన్ని నీకే తెలుస్తాయి అని ఋషులు,యోగులు తెలుసుకునే మార్గాన్ని చూపించినప్పటికీ దానిని దర్శించ లేకపోవడం మన ఆశ్రద్ధ తార్కాణమే గదా? ఈ మానవుడికి పరిపూర్ణమైన మేధస్సు ఇచ్చి జ్ఞనము ఆలోచన, అన్వేషణ అన్నింటిని కలిపింది సృష్టిలోని సమస్త జీవుల యెడ దయార్ధ హృదయంతో చూడాలని, వచ్చిన మార్గాన్ని వెతకడమే నీ బాధ్యత. ప్రయత్నం చేయండి.*
*1) నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.*
*2) నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది అని వెతకకు, అది నీ అంతరంగంలోనే అంతర్యామి అయిన అంతరాత్మలోనే ఉంటుంది.*
*3) సంతోషానిచ్చేది , సంపదలు , అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.*
*4) నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.*
*5) మన సమస్యలకు , మన దుఃఖాలకు , మన బాధలకు పరిస్కారాలు మన దగ్గరే ఉంటాయి , కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.*
*6) సంతోషం అనేది ఎంతో మధురమినది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.*
*7) విజయం సాధించడములో ఎవరు నిన్ను మోసము చేయలేరు-నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్పా.*
*8) నీలో ఉన్న శక్తిని నీవు తెలుసు కున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.*
*9) నిన్ను నీవు విమర్శించించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.*
*10) నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.*
*11) నిన్ను నీవు మోసాగించు కున్నంతగా , ఇంకొక రెవరూ నిన్ను మోసాగించరు.*
*12) దేని నైనా ఆశించబోయే ముందు అందుకు కావలిసిన అర్హతను సంపాదించుకో – తనను తానూ జయించు కోగల వ్యక్తీ అన్నింటిని జయించగలడు.*

No comments:

Post a Comment