🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(240వ రోజు):--
ఉన్నది ఒక్కగానొక్క సత్యమని స్వామీజీ పాశ్చాత్యదేశవాసులకు పదేపదే చెప్పేవారు. హిందూవేదాం తం చదవటంచేత క్రైస్తవులు హిందు వులుగా మారరు ; ఇంకా మంచి క్రైస్త వులౌతారు. వారికి తమ మతం గురించిన అవగాహన పెరుగుతుంది తమ దేవుడైన ఏసుక్రీస్తుతో వారి అనుబంధం బలోపేతమౌతుంది. ఆయన ప్రబోధం వారిలో లోతుగా నాటుకుంటుంది.
1972లో హవాయ్ బర్కిలిలోని కాలిఫోర్నియా, ఎం.ఐ.టి., కోర్నెల్ మొదలైన అమెరికన్ విశ్వవిద్యా లయాల్లో స్వామీజీ వేదాంతోపన్యా సాలిచ్చారు. ఇవన్నీ ఆయా విశ్వ విద్యాలయాల వేదాంతవిభాగాలకు చెందిన ఆచార్యుల, ఉద్యోగుల తోడ్పాటుతో జరిగాయి. తన ఐదవ ప్రపంచపర్యటన గురించి భారతీయ పాఠకులనుద్దేశించి ఆయన తపో వన్ ప్రసాద్లో ఇలా వ్రాశారు:
నా గురుదేవులు తరుచూ నాతో చెప్తూండేవారు, "వెళ్లి గంగఒడ్డున కూర్చో. వేదాల లోతైన జ్ఞానాన్ని బోధించగల శక్తి ఆమెకే ఉంది. మన సు నిశ్చలం చేసి, ఆమె చెప్పేది విన టం అలవరుచుకో. ఆలోచనలను అటూఇటూ పోనీయకుండా, ఉద్వే గాలూ, ఆకాంక్షలూలేకుండా, మంచి - చెడు, న్యాయం - అన్యాయం వంటి అభిప్రాయాలేవీ ఏర్పరుచుకో టానికి ప్రయత్నించకుండా సహనం తోనూ, శ్రద్దతోనూ విను." ఇది చాలా గంటలసేపు అభ్యాసం చేశాను;ఎలా వినాలో నేర్చుకున్నాననుకుంటున్నా ను. తరుచూ కొద్దిక్షణాలు గంగా మాతతో ఆనందమయంగా తాదా త్మ్యం చెందుతున్నట్లనిపించేది నాకు క్షణక్షణమూ మార్పుచెందుతూ, అనుక్షణమూ కొత్తదనాన్ని సంతరిం చుకుంటూ ప్రవహిస్తున్నప్పటికీ, ఆమె - ఎప్పటికీ - ఆమెనే !
రాగద్వేషాలు లేనట్టి అటువంటి వైఖరితో ప్రపంచమంతా పర్యటిస్తూ నేను మానవుని దివ్యతత్వం, సత్య పు మహత్తు, లక్ష్యపెట్టక పోవటం చేత జీవుల హృదయాల్లోనూ, నిర్జీవ వస్తువుల్లోనూ ప్రకాశించకుండా ఉండి పోయిన భగవంతుని దేదీప్య మానమైన మూలతత్వం - వీటి గురించి మాట్లాడాను. వస్తువులకూ, భ్రమతో జీవిస్తున్నజీవాలకూ నిలయ మైన ప్రపంచం తడుముతూ దాటు తూ, గెంతుతూ మోదుతూ, పలు విధాలవ్యక్తులతో, వారి విభిన్నమైన స్వభావాలతో, ఆదర్శాలతో ఈ ఆరు నెలలూ నాప్రక్కనే ప్రవహించింది. అందరూ నేను చెప్పినది విన్నారు; కొందరువిశ్వసించారు కూడా.వినిన వారిఅభిప్రాయాలు వినటంలో నేను చాలా సంతృప్తిని పొందాను.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment