Monday, October 13, 2025

 248 వ భాగం 
🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 37

మూఢో నాప్నోతి తద్బబ్రహ్మ యతో భవితుమిచ్ఛతి|
అనిచ్చన్నపి జీరో హి పరబ్రహ్మ స్వరూపంబాక్||

మూఢుడు బ్రహ్మత్వాన్ని సాధించలేరు. సాధించాలనే అతని కోరిక అందుకు అవరోధంగా
నిలుస్తుంది. జ్ఞాని బ్రహ్మత్వాన్ని కోరకుండానే, అర్థము చేసుకోవడంతో ఆ బ్రహ్మమై నిలుస్తాడు.

ధ్యాన సాధనాలు అన్నిటికీ కారణ ంగా సాధించాలనే కోరిక ఉండి తీరుతుంది. చివరిదైనా ఈ కోరికే సాధకుని తన సాధనకు బందీని చేస్తుంది .చివరి కోరికైన ఈ మముక్షత్వం మొత్తం కోరికలన్నిటికంటే అతి బలియమై ధృడమైన బంధం గా సాధకుని మనసుని సాధనతో బంధిస్తుంది. ఈ చివరి బంధాన్ని చేదించటమే ఈ శ్లోకం లక్ష్యం .సాధన ప్రథమ దశలో ముముక్షత్వాన్ని గొప్పదిగా వర్ణించి ప్రోత్సహిస్తారు. అలా దానిపై విలువను పెంచుకున్న మనసు సహజంగా మిగిలిన కోరికల బంధం నుండి ముక్తమై, ఏకాగ్రమయి సునిశితము తీక్షణం అవుతుంది. అంతవరకు అనేక ఆకర్షణలతో చీలి హీనమైన మనసు తన శక్తి అంతటితో కోరిన ఈ ఒకే ఒక చివరి కోరిక మహాబలవంతంగా తయారై అజేయంగా అహంకారాన్ని రూపొందిస్తుంది. కోరే అహంకారము వేరుగా కోరబడేది వేరుగా ద్వైత భావము మరింత బలపడుతుంది. ద్వైతం ఏ రూపంలో ఉన్న గర్హ నీయమే. అద్వయమైన ఆత్మానుభవాన్ని పొందటానికి చూపించే మనో బుద్ధులను వీలైనంత బలహీనము చేసి చివరగా వాటిని అధిగమించాలి. ఇందుకు ముముక్షత్వం సాధన ప్రథమ దశలో సహకరించిన ,చివరికి బలియమైన బంధముగా రూపు దాలుస్తుంది. అందుకే ఆచార్యులు ఇక్కడ సాధనలను హెచ్చరిస్తూ అద్వైయమైన ఆత్మానుభవంలో ఉండటానికి ద్వైతాన్ని భావాల రూపంలో చూపించే మనసును అధిగమించి భావ శూన్య స్థితిలోకి రావలసిన అవసరాన్ని ఇంత గట్టిగా నొప్పి చెబుతున్నారు. మనసు భావ శూన్యరూపంలో తెలియబడుతూ ఉంటే మనసు అనబడుతుంది. ఆలోచన ప్రవాహం ఆగిపోతే అద్వైయమైన ఆత్మ తత్వం నిశ్చలంగా ఉంటుంది. కదలిక ఉన్నప్పుడు తరంగాలుగా నామరూపాలతో తెలియబడిన సముద్రమే కదలిక ఆగిపోయినప్పుడు నిచ్చల గంభీరంగా మహాసాగరంగా కేవలం గా నిలుస్తుంది.🙏🙏🙏
ఇంకా ఉంది మిగతాది రేపటి భాగంలో.    

No comments:

Post a Comment