*సేతు రహస్యం - 19*
🌊
రచన : గంగ శ్రీనివాస్
మైఖేల్, శరత్చంద్రలు ముందుగా తమ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు.
అక్కడ పరిసరాలను పరిశీలనగా గమనిస్తూ వస్తున్న శ్రీధర్ కు తన హెడ్ లైట్ కాంతి ఒక చోట పడి ఒక మెరుపు కదిలినట్లు అనిపించింది. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అక్కడే అటు ఇటు వెతుకుతూ చూడసాగాడు.
కేట్ కి ఏమి అర్ధంకాక అతనికి సైగ చేసింది, ఏమిటి అని. తనకు మెరుపు కనిపించిన దిశ వైపు చూపుతూ మెల్లగా పెదవులు కదిపి 'ఫ్లాష్' అని సైగ చేసాడు. కేట్ అతని సూచనను అందుకుని తన తల అటు తిప్పి తన హెడ్ లైట్ ని ఫ్లాష్ మోడ్ లో ఉంచింది. అప్పుడు అతని అనుమానాన్ని నిజం చేస్తూ అతను వెతుకుతున్న దిశ నుంచి ఫ్లాష్ వెనుకకు రిఫ్లెక్ట్ అయింది. దానితో శ్రీధర్ కి కుతూహలం పెరిగింది. కాని అప్పటికే వారికి కేటాయించిన సమయం అయిపోయింది.
వెంటనే తిరుగు ప్రయాణం చేయాలా లేక రిస్కు తీసుకుని తమ పరిశోధన ఇంకా కొనసాగించాలా అని ఒక క్షణం ఆలోచన లోపడ్డాడు శ్రీధర్. అతని సందిగ్ధావస్థను గమనించిన కేట్ ఐదు వేళ్ళు చూపించి మెరుపు వచ్చిన దిశ వైపు చూపింది. అయిదు నిముషాలలో ఆ పరిశోధన ముగిద్దామనుకుని మెరుపు వచ్చిన వైపుకి సాగారు.
అద్భుతంగా బండల మధ్య పెద్ద గుహ లాంటి ద్వారం కనిపించింది. వారికి కనిపించిన మెరుపు దాని లోపల నుంచే వస్తున్నది. బయట నుంచి చూసినప్పుడు ఏదో ఒక ప్రాంతం నుంచే ఆ మెరుపు కనబడటానికి కారణం ఆ మెరిసే వస్తువు ఆ గుహ లోపల ఉండటమే. మైఖేల్, శరత్చంద్రుల దృష్టికి ఆ వస్తువు గోచరించక పోవటానికి కూడ అదే కారణం.
గుహ లోపలకు వెళ్ళిన శ్రీధర్, కేట్లు అక్కడ కనిపించిన దృశ్యం చూసి నివ్వెరపడ్డారు. వారి ఎదురుగా షుమారుగా యాభై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పులతో ఎత్తైన ఘనాకారపు రాతి వస్తువు కనిపించింది. దానికి గుహ ముఖ ద్వారం వైపు ఉన్న ఉపరితలానికి ఒక పెద్ద గాజు గోళం బిగించబడి ఉంది. దాని పైన వాళ్ళ హెడ్ లైట్ పడినప్పుడు అది రంగు రంగుల కాంతులతో మెరుస్తున్నది.
ఒకసారి ఆ రాతి ఘనాకారం చుట్టూ తిరిగారు వారిద్దరు. ఆ రాతి పైన వేరే చోట్ల నుండి కూడ అటువంటి మెరుపులు కనిపించడంతో వాళ్ళ ఆశ్చర్యానికి అంతు లేకుండాపోయింది. ఆ రాతిని తవ్వి శాంపిల్ తీసుకోవాలనుకున్న శ్రీధర్ ను కేట్ వారించింది. అక్కడి వివరాలన్ని టిని తమ విడియో కెమెరా తన మెమోరిలో భద్రపరుచుకుని ఉంటుందనే భరోసాతో వారిద్దరూ వెను తిరిగారు. ఆ గుహ నుంచి బయటపడి వీలైనంత తొందరగా అక్కడ నుంచి సేతు సముద్రం ఉపరితలానికి చేరాలని బయల్దేరారు.
వారిద్దరూ బోట్ ని చేరుకునేసరికి మైఖేల్ శరత్ లు బోట్ లో వీరి కోసం ఎదురు చూస్తూ ఉండటం కనబడింది. బోట్ లోని సహాయ సిబ్బంది సమయం మించిపోయి నందుకు ఆందోళనగా ఉన్నారు. కేట్ శ్రీధర్లను చూడగానే చేయి అందించి వాళ్ళను బోట్లోనికి లాగుకున్నారు.
తాము చూసిన వస్తువు కలిగించిన ఆశ్చర్యం నుంచి తేరుకొనటానికి చాలా సమయం తీసుకున్నారు కేట్, శ్రీధర్లు. వారి దగ్గర రికార్డయిన వీడియో క్లిప్పింగ్ ని బోట్ లోని తమ సహచరులకు చూపించారు. ఆ గాజు గోళాన్ని రాతి ఘనాకారపు వస్తువు నుంచి వేరు చేసి తీసుకుని రావల్సిందని ఆండ్రూస్ భావించాడు. కాని దాని గురించి ఇంకాస్త వివరాలు సేకరిస్తే గాని ఆ పని చేయకుడదని మైఖేల్ చెప్పాడు. ఆ వస్తువు మానవ నిర్మితమా లేక సహజంగా ఏర్పడిన ఏదైనా భౌగోళిక విశేషమా అన్న విషయం కూడా తేలలేదు.
అది గనుక మానవ నిర్మితమైతే రామసేతు వు నిర్మాణం విషయంలో కలిగిన అన్ని ప్రశ్నలకు అదొక్కటే శాస్త్రీయమైన సమాధానం అవుతుందని అక్కడ ఉన్న అందరూ అన్నారు. కేట్ ఏదో ఆలోచనలో ఉంది. అది గమనించి శ్రీధర్ ఆమెను ప్రశ్నించాడు.
"ఏమి ఆలోచిస్తున్నావ్ కేట్" అంటూ. ఇంకా ఆలోచనలలో నించి బయటకు రాని కేట్, అస్పష్టంగా అంది. "గాజు గోళం నుంచి అన్ని రంగుల కాంతులు రావటం ఆశ్చర్యంగా ఉంది.".
"అవును, నేను కూడా అదే విషయం ఆలోచిస్తున్నాను. అది డైమండ్ అయి ఉంటుందనిపిస్తుంది" అన్నాడు.
"ఎగ్జాక్ట్ నాకూ అదే సందేహం కలుగుతోంది. దానిని చూడగానే సాన పట్టని ముడి డైమండ్ అనిపించింది. మళ్ళీ చూద్దాం పద" అది కేట్.
"అలాగే వెళదాం" అన్నాడు శ్రీధర్, రాజేష్ వైపు చూసి, "మరొకసారి అక్కడకు వెళదా మనుకుంటున్నాం ఖచ్చితంగా అదే ప్రదేశానికి వెళ్ళేలా నువు డైరెక్ట్ చేయాలి సరేనా” అన్నాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
రాజేష్ వారు తీసిన విడియో క్లిప్పింగ్ ని మరోసారి పరిశీలించి వారు రాతి వస్తువు దగ్గర ఉన్న సమయానికి సముద్రంలో వారున్న స్థల వివరాలను కంప్యూటర్ ద్వారా గణన చేయించి వారికి మార్గ నిర్దేశం చేయాటానికి కావలసిన ఏర్పాట్లు చేసాడు.
📖
మరోసారి సాగర ప్రవేశానికి శ్రీధర్, కేట్లతో పాటు, మైఖేల్, కూడా సిద్ధపడ్డాడు. తమ తమ పరికరాలను సరి చూసుకుని అవసరమైన మార్పులు చేసుకుని, సరికొత్త ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని పరిశోధకులు సేతు సముద్రంలోకి దిగారు.
ఈసారి ఒకే పని మీద ఏకాగ్రచిత్తంలో ఉన్న వారంతా తిన్నగా శ్రీధర్, కేట్లు చూసిన గుహ సమీపానికి వెళ్ళిపోయారు. వారికి కావలసిన మార్గ నిర్దేశం రాజేష్ సమర్ధంగా చేసాడు. ఈసారి ఆ రాతి వస్తువును మరింత పరిశీలనగా చూసే అవకాశం వారికి దొరికింది.
అది చూడటానికి ఒక పెద్ద గది లాగ ఉంది. అక్కడక్కడ మెరుస్తున్న రాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ మెరుపు రాళ్ళను అక్కడ తాపడం చేసారా లేక ఆ రాతిలోనే సహజంగా ఆ రాళ్ళు ఉన్నాయా అనే విషయం అర్ధంకావటం లేదు. స్ట్రేపర్స్ (పదునైన వస్తువుతో గీరటం) ఉపయోగించి నల్లగా మకిలి పట్టి ఉన్న ఆ రాతి వస్తువు పై రుద్ది చూసాడు శ్రీధర్. గీకిన కొద్దీ నల్లటి పదార్థం కొద్దికొద్దిగా పొడిలాగా రాలసాగింది. కేట్ పెద్ద గాజు గోళంను పరిశీలిస్తూ దాని చుట్టు స్ట్రేపర్ ని ప్రయోగించింది. ఆమె అక్కడ షేప్ చేసిన కొద్దీ ఆ గాజు గోళం డైమండ్ లాగా ప్రకాశించసాగింది. ఆ విషయాన్ని శ్రీధర్ కి కూడా చూపించింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మైఖేల్ ఆ రాతి వస్తువుని కొంత చిప్ చేసి తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అతను ఎంత ప్రయత్నించినా ఆ రాతికి కొంచెం కూడా గాటు పెట్టలేకపోతున్నాడు. కేట్ చూపించిన చోటు పరిశీలనగా చూసిన శ్రీధర్ కి అక్కడ వలయాకారంలో కొన్ని గీతలు కూడా కనిపించాయి. డైమండ్ నుంచి వెలువడుతున్న కాంతిలో ఆ గీతలు లీలగ గోచరిస్తున్నాయి. అవి మరింత స్పష్టంగా కనిపించడం కోసం అక్కడ పేరుకుపోయి వున్న నల్లటి మట్టిలాంటి పదార్థాన్ని సున్నితంగా స్ప్రేప్ చేసాడు శ్రీధర్..
ఆ డైమండ్ బూడిద గుమ్మడికాయ సైజులో ఉండి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే, శ్రీధర్ స్ప్రేప్ చేస్తుంటే బయటపడిన డిజైన్లు అంతకుమించి ఆశ్చర్యజనకంగా ఉన్నాయి. తవ్విన కొలదీ కొత్త విషయాలు బయట పడుతున్నాయే అనుకున్నాడు శ్రీధర్.
మైఖేల్ పట్టువదలకుండా ఒక చిన్న రాతి ముక్కనైన విరిచి శాంపిల్ గా తీసుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే శ్రీధర్ వెళ్ళి వారించాడు. వారు కనుగొన్న శిల సామాన్యమైనది కాదు. అది రామసేతువు నిర్మాణాన్ని సంశయాలకు అతీతంగా నిరూపించగల అద్భుత వస్తువు అని శ్రీధరికి తోచింది. అక్కడ అంతకంటే చేయగలిగింది లేక వెనుతిరిగారు వారంతా.
📖
ఆ రోజంతా ఆ విడియో క్లిప్పింగ్స్ పదే పదే చూస్తూ ఆలోచనలతో తమ మస్తిష్కాలను మధించారు మారుతి గ్రూప్ లోని ముఖ్య సభ్యులంతా. ఆ శిలను నీటి ఉపరితలా నికి తీసుకుని వచ్చి దాన్ని ప్రత్యేకమైన అధ్యయనం చేస్తేగాని దాని తలాతోక తెలసుకోలేమనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళంతా.
కంప్యూటర్లో దాని వివరాలను ఫీడ్ చేసి అది ఎంత బరువు ఉండవచ్చో అంచనా వేసారు. అంత బరువున్న వస్తువుని బయటకు తీసుకురావాలంటే ఎంత సామర్థ్యమున్న క్రేన్లు కావాలి, దాని కోసం ఎటువంటి ప్రత్యేకమైన షిప్ లను తీసుకు రావలసివస్తుందో అంచనా వేసారు.
తల తిరిగిపోయేలా ఉన్నాయి వారి అంచనాలు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ క్రేన్ లు గాని, ఏ షిప్ లు తమ అవసరాలను తీర్చలేవనే వాస్తవం తెలిసి నిరుత్సాహపడ్డారు. ఎంత ఆలోచించినా ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు.
🌊
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment