*సత్సంగం*🚩
*పరమాత్మను దగ్గర చేసే మానవుని - మనసు ఎలా వుండాలి???*
*సత్త్వసంశుద్ధి...!!!*
*'సత్త్వం' అంటే అంతఃకరణం.. మనస్సు!!.*
*'శుద్ధి' అంటే కల్మషాలు లేకుండా స్వచ్ఛంగా ఉండటం!!.*
*'సంశుద్ధి' అంటే పూర్తిగ స్వచ్ఛంగా, నిర్మలంగా ఉండటం.*
*ఇలా మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటే అది దైవీసంపద అవుతుంది.*
*మనస్సు స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ప్రకాశం ఉండేది.*
*నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా.. కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి.*
*మనస్సు నిర్మలంగా ఉంటేనే బయటి ప్రవర్తన ఆచరణ పవిత్రంగా ఉంటుంది.*
*బయటి ప్రవర్తన లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు, అప్పుడే పరమాత్మకు సమీపంగా నీ మనస్సు ఉంటుంది.*
*ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే??_*
*నిరంతరము భగవత్ సంబంధమైన పూజాదికాలు, యజ్ఞ దాన తపస్సులు, శ్రవణం, సత్సంగం, గురుభక్తి, గురుసేవ, ఆధ్యాత్మిక సాధనలు ప్రీతితో ఆచరించాలి.*
*అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో, రజోగుణ తమోగుణ ప్రాబల్యంతో ఉన్నట్లైతే అది ఆసురీ సంపదను పెంచి పరమాత్మకు దూరం చేస్తుంది.*
*_🌺శుభమస్తు🌺_*
No comments:
Post a Comment