*అగ్నిహోత్రం గురించి సంపూర్ణ వివరణ - 2* .
ఇన్తకు ముందు పోస్టులో అగ్నిహోత్రం గురించి కొంచెం వివరణ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అగ్నిహోత్రం వలన వాతావరణం తో సంభవించు మార్పులు మరియు ఔషధ ప్రభావాన్ని గురించి వివరణ్.
వాతావరణంలో ఏ విధమైన మార్పు సంభవించినను అది వెంటనే ప్రాణము మీద ప్రభావం చూపించును. ప్రాణము మరియు మనస్సు అనేది బొమ్మ , బొరుసుల వలే ఒక నాణెముకు రెండువైపులు అని చెప్పవచ్చు. ఇది వేదములోని హోమథెరఫీ విధాన ప్రక్రియ వివరణము. మనము అగ్నిని ప్రేరిపించినప్పుడు వాతావరణములో మార్పు కలుగుట సహజమే కదా ! మంత్రోచ్చారణ చేసినప్పుడు ఆ మంత్రాల ప్రకంపనాలు వాతవరణం లో ప్రయాణించును. ఈ అగ్నిహోత్ర ప్రభావం బాలుర మీద అత్యంత ప్రభావం చూపించును . అత్యంత తెలివి , పరిపూర్ణత , దయ సంపన్న గుణములతో వారు ప్రవర్తించును.
అగ్నిహోత్రపు బూడిద మీద పరిశోధన చేసిన జర్మనీ పరిశోధకులు ఇది ఒక మహోత్తర శక్తివంతమైన ఆయుధం అని క్యాన్సర్ వంటి మొండివ్యాధులను కూడా నయం చేయగలదని తెలుసుకొన్నారు. అంతకు ముందు నేను మీకు అగ్నిహోత్రము నందు ఉపయోగించదగిన కొన్ని మూలికల పేర్లు వివరించాను . ఇప్పుడు ఆ మూలికల ఔషధ గుణాలు కూడా వివరిస్తాను.
అందులో మొదటిది జిల్లేడు . ఈ జిల్లేడులో తెల్లది , ఎర్రది అని రెండుజాతులు కలవు. తెల్లజాతికి గుణం ఎక్కువ అని వైద్యుల అభిప్రాయం . విరేచనములు చేయు గుణం కలదు. కఫ , వాత వ్యాధులను హరించును . ప్రథమ దశలోని కుష్టువ్యాధిని నయం చేయును . జీరకోశము నందలి జబ్బులను , పేగుల యందలి క్రిములను చంపును. దీని ఆకుపోగ ఉబ్బసరోగులకు హితముగా ఉండును. దీని వేరు బెరడు నీటిలో వేసి కాచి ఆ నీటిని కొద్దిగా తాగించిన చలిజ్వరం , రోజుమార్చి రోజు వచ్చే జ్వరములు తగ్గును.
No comments:
Post a Comment