Friday, October 10, 2025

 *అగ్నిహోత్రం గురించి సంపూర్ణ వివరణ  - 1.*

        ప్రస్తుతం మన పరిస్థితి ఎంత దారుణంగా మారిందో మీకు అనుభవపూర్వకంగా అర్థం అవుతుంది కదా !  ఇలాంటి సమస్య రావడానికి ప్రధానకారణం . మనకి ప్రకృతికి మధ్య ఉన్న బంధం చెరిగిపోవడమే . ప్రకృతి ఒక నియమబద్దంగా తనపని తాను చేసుకుంటూ వెళ్తుంది. కాని మనుష్యులు ప్రకృతివిరుద్ధంగా ప్రవర్తించడం వలన ప్రకృతి జూలు విదులుస్తుంది . అటువంటి సమయాల్లోనే ఇప్పుడు మనం చూస్తున్న విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

              ఇలాంటి దారుణ పరిస్థితుల్లో సమస్త మానవాళిని కాపాడటానికి మన సనాతన సంప్రదాయవాదులు , ఋషులు మనకి అనేక గొప్పగొప్ప నియమాలు ఏర్పరిచారు. ఈ నియమాలు కొన్నివేల సంవత్సరాల నుంచి మన భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయాయి. కాని నాగరికత పేరుతో సంప్రదాయ పద్ధతులు వదిలివేసి మనుష్యులు తమ శక్తిని , ఆయుష్షును కోల్పోతున్నారు.  మన సనాతన భారతీయుల గృహాల్లో నిత్యం అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేది. దీనికి కారణం ఆ అగ్నిహోత్రం నందు అనేకరకాలైన ఔషధ మూలికలను మండించడం ద్వారా చుట్టుపక్కల గాలిలో ఉండే వైరస్ మరియు బ్యాక్టీరియా సమూలంగా నాశనం అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. 

          మనందరం మరిచిపోయిన మన సనాతన సంప్రదాయం అయిన అగ్నిహోత్రం గురించి , దాని గొప్పతనం గురించి సంపూర్ణంగా మీకు వివరిస్తాను .

    అసలు మొదట అగ్నిహోత్రం అంటే ఏమిటి  అనేదాని గురించి వివరిస్తాను.  

     సరిగ్గా సూర్యోదయం , సూర్యాస్తమయ సమయముల యందు పిరమిడ్ ఆకారపు రాగిపాత్రలో అగ్నిని రగిలించవలెను . దీనికి ఎలాంటి మినరల్ నూనెలను అనగా కిరోసిన్ వంటి తైలాలు వాడరాదు. అగ్నిహోత్రమునకు ఎండిన ఆవుపిడకలు , ఔషధయుక్తమైన ప్రత్యేకమైన వనమూలికలు అనగా జిల్లేడు , మోదుగ , చండ్ర , దర్భ , గరిక వగైరా వంటి మాత్రమే వాడవలెను . ఒకవేళ అటువంటి మూలికలు దొరకానిచో ముండ్లు లేనివి , చేదు లేని తియ్యటి పండ్లు కాయు ఏ చెట్టునైనా ఉపయోగించవచ్చు. ఆవునెయ్యి , గోధుమరంగు బియ్యపు అన్నమును హావిస్సుగా అగ్నికి అర్పించుచూ మీకు వచ్చింది ఏవైనా ఒకటి రెండు మంత్రాలను ఆ సమయములో ఉచ్చరించవలెను . ఇట్టి అగ్నిహోత్రమును సులభముగా ఎవరైననూ ఆచరించవచ్చు.  

        రేపటి పోస్టులో అగ్నిహొత్రం వలన వాతావరణం పైన ప్రభావం , ఔషధప్రభావం గురించి...   


No comments:

Post a Comment