Monday, December 15, 2025

 [12/15, 06:52] +91 98486 72301: *ధనుర్మాస వ్రతవిధానం..........!!*
*సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.* 

*గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి.* 

ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.

ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి. ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.

వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలాతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, తరువాత ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. 

అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దధ్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని  పూజించాలి. 

ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.          


[12/15, 06:57] +91 98486 72301: *ధనుర్మాసం అనగానే, మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  ఇది చాలా విశేషమైననెల.* 
       
*అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు.* *ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు.* *ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.*
*శ్రీశైలేశ దయాపాత్రం  ప్రవచనం*
*శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్* |
*యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్* ||
*లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్* |
*అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం* ||
       
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమనిష్టలతో వ్రతము చేసి. ఆ పాండురంగనుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం. అయితే ఆ అమ్మకు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.  
 
నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       
      
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు. ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత. ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది. తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు.
        
మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు, అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
       
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
       
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  

వ్రత విధానం : 
       
ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలనుకునేవారు మొదటగా వారు బంగారం లేదా వెండితో తయారుచేయబడిన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. ఒకవేళ మీకు ఇంత స్థాయి లేకపోతే.. మీ శక్తిమేరకు పంచలోహాలతోగాని, రాగితోగాని విష్ణువు విగ్రహాన్ని తయారు చేయించుకోవాలి. ఈ మాసంలో విష్ణువును ‘మధుసూదనుడు’ అనే పేరుతో వ్యవహరించాలి.
       
ఈ మాసం మొదలైన మొదటిరోజు నుంచి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే రోజువారి కార్యక్రమాలను ముగించుకోవాలి. తలస్నానం చేసిన తరువాత నిత్యపూజలు, సంధ్యవందనాలను ముగించుకుని ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకోవాలి. 
        
మొదటగా విష్ణువును ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. అందులో శంఖాన్ని ఉపయోగిస్తే శ్రేష్ఠం. తర్వాత తులసీ దళాలతోను, వివిధ రకాలైన పుష్పాలతోను స్వామివారిని నామాలతో పూజించుకోవాలి. 
       
మొదటి పదిహేను రోజులవరకు నైవేద్యంగా చెక్కర పొంగలిగాని, బియ్యం-పెసరపప్పుతో కలిపి వండిన ‘పులగం’ నుగాని సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు ‘ఉధ్యోదనం’  నైవేద్యంగా సమర్పించాలి.  తర్వాత ధూప, దీప, దక్షిణ, తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. 
       
మధుసూధనస్వామిని పూజించడంతోపాటు మీ బృందావనంలో వున్న తులసీని కూడా పూజించుకోవాలి. ఈ మాసమంతా విష్ణువుకు సంబంధించిన పురాణాల కథలను చదవడం లేదా వింటూ గడపాలి. విష్ణుదేవాలయాలను దర్శించుకోవాలి. 

ఫలితాలు :
       
ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణాలలో కథనాలు కూడా వున్నాయి. 

ఈ వ్రతాన్ని చాలావరకు వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతుంది. దీంతోవారికి మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం. 
       
శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని తన భర్తగా పొందినట్లు పురాణాలలో కథనాలు వివరంగా చెప్పబడి వున్నాయి.         

No comments:

Post a Comment