షాకింగ్ స్టోరీ తన ఇంటి వెనకాలే అణు రియాక్టర్ నిర్మించిన కుర్రాడు! | Jaisimha | Square Talks
https://m.youtube.com/watch?v=gQsM5H-QeEg
https://www.youtube.com/watch?v=gQsM5H-QeEg
Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మామూలుగా ఒక తల్లి తండ్రి విడిపోతే పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అనే విషయం మనకు తెలుసు కానీ కానీ అమెరికాలో ఒక తల్లి తండ్రి విడిపోయారు. అమెరికాలో తల్లితండ్రులు విడిపోవడము పిల్లలు ఎవరి దగ్గరన ఒకరి దగ్గర పెరగడం అనేది చాలా కామన్ విషయం ఎందుకంటే అక్కడ ఆ పెళ్లిళ్లు పెళ్లిల మాదిరిగానే డైవర్స్లు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు రెండు సార్లు మూడు సార్లు కూడా మళ్ళీ మళ్ళీ పెళ్ళీళ్లు చేసుకుంటూంటారు.
(00:53) ఈ డైవర్స్ కేసుల ప్రభావం ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం మీద ఉంటుంది అన్నది మనకు తెలిసిందే కానీ 1990స్ లో ఇలాగే డేవిడ్ హాన్ అనే ఒక టీనేజర్ ఒక టీనేజ్ అబ్బాయి ఉండేవాడు అతటి తల్లిదండ్రులు కూడా విడిపోవడం జరిగింది. కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అనేది ఆ ఏరియా మొత్తానికి ఒక పెద్ద ప్రమాదంగా మారింది.
(01:19) ఆ ఏరియా మొత్తమే ఆ విషతుల్యం అయిపోయి అనేకమంది అనారోగ్యం పాలయ్యే అంత ప్రమాదకర స్థితి ఏర్పడి అదృష్ట వశాత్తు ఎవరి ప్రాణాలు పోనప్పటికీ అదొక పెద్ద ఆ అనుధార్మిక అనుధార్మికత ఏర్పడి అంటే ఆ న్యూక్లియర్ రేడియో యక్టివ్ ప్రాబ్లం కింద మారింది. అదేంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడము పేరెంట్స్ విడిపోతే ఆ అబ్బాయికి ఏదో చిన్న సమస్య రావడము అక్కడి నుంచి మొదలుపెట్టి ఒక ఏరియా మొత్తం రేడియో యక్టివ్ ఎమిషన్స్ తో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలంటే మనం ఒకసారి 1990స్ కి వెళ్ళాలి 1990ల కాలానికి వెళ్ళాలి ఎక్కడ
(02:07) అంటే అమెరికా అమెరికాలో ఉన్న డెట్రాయిట్ ప్రాంతం మిచిగన్ అనే ఏరియాలో అక్కడ ఈ డేవిడ్ హాన్ అనే ఒక టీనేజ్ అబ్బాయి ఉండేవాడు అన్నమాట ఇతను స్కౌట్ ఇతని తల్లిదండ్రులు ఇద్దరు విడిపోవడం జరిగింది కొన్ని రోజులు ఈ అబ్బాయి తండ్రితో ఉండేవాడు ఆ తర్వాత తల్లితో కూడా ఉన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే విడిపోయిన తర్వాత తండ్రి మరో పెళ్లి చేసేసుకున్నాడు.
(02:35) అలాగే తల్లి కూడా ఇంకొక పెళ్లి చేసుకుంది. ఈ అబ్బాయికి ఆ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నప్పటికీ ఇద్దరు కూడా మళ్ళీ రెండోసారి వివాహం చేసుకున్నారు. అయితే ఈ అబ్బాయి మాత్రం డేవిడ్ హాన్ అనే అబ్బాయి తల్లితో ఉండేవాడు మొదట్లో తండ్రితో కూడా కొన్ని రోజులు ఉన్నాడు అప్పుడు తండ్రితో ఉన్నప్పుడు ఇతను కెమికల్స్ కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు ఇంట్లో కావచ్చు ఇంటి వెనకాల అటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చేస్తూ ఉండేవాడు ఎందుకు అంటే యస్ ఏ స్టూడెంట్ ఇతడికి కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం కెమికల్స్ కావచ్చు ఆ మందులు కావచ్చు లేకపోతే
(03:13) రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కావచ్చు వీటన్ని అన్నిటి మీద చాలా ఆసక్తి అన్నమాట అప్పుడే గమనించాల్సిన తండ్రి ఆ అలాగే సవతి తల్లి వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు ఈ డేవిడ్ హాన్ ని ఒ రెండు మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా కూడా చూసి చూడనట్టు వదిలేశారు వాళ్ళు ఆ తర్వాత తల్లి దగ్గరికి వచ్చి తల్లితో ఉంటున్న డేవిడ్ హాన్ తల్లి ద్వారా కూడా ఈ విషయం గమనించకపోవడంతో తల్లి కూడా ఈ విషయాన్ని గమనించకపోవడంతో తన ఎక్స్పెరిమెంట్స్ రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని కంటిన్యూ చేస్తూ వచ్చేవాడు తల్లి దగ్గర ఉంటున్నప్పుడు కూడా ఇతడికి చిన్న చిన్న
(03:48) ప్రమాదాలు జరిగితే వెనకాల ఒక షెడ్ వేసి ఆ షెడ్ లో ఎక్స్పెరిమెంట్ చేసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నావ అనుకున్నారు కానీ ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకి అప్పట్లో అర్థం కాలేదు. సో తనకు ఎవరు కనిపించే ఎవరికీ కనిపించకుండా సీక్రెట్ గా షెడ్ లో చేసుకునే అవకాశం రావడంతో ఈ డేవిడ్ హాన్ మరింత ప్రమాదకరమైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చేవాడు అన్నమాట కాబట్టి సైన్స్ వర్సెస్ మూఢనమ్మకం అని చాలాసార్లు మనం మాట్లాడుకుంటుంటాం.
(04:21) మూఢ నమ్మకాలు ఖచ్చితంగా వ్యతిరేకించాలి మూఢ నమ్మకాలని ఎవరం కూడా సమర్ధించం కానీ సైన్స్ పేరు చెప్పినప్పుడు సైన్స్ పేరుతో ఏదైనా చేసేస్తే సరిపోతుంది అనుకుంటే కుదరదు సైన్స్ కూడా అప్పుడప్పుడు మూఢనమ్మకం లాగా మారిపోయే ప్రమాదం ఉంది అని మనకు ఈ డేవిడ్ హాన్ అనే ఒక టీనేజర్ కథ చెప్తుందన్నమాట ఇంకొంచెం లోతుగా వెళితే ఇతను 1990స్ లో అంటే ఇప్పుడు ఉన్న అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమెరికాలో కూడా అప్పుడు ఉండేవి కాదు కాబట్టి అప్పుడు ఇతను చాలా క్లెవర్ మెథడ్స్ యూస్ చేసి చాలా తెలివైన పద్ధతుల్లో ఆ అనుధార్మికత కలిగించగలిగే ప్రమాదకరమైన ఆ వస్తువుల్ని లేదంటే మెటీరియల్స్ ని
(05:06) పదార్థాల్ని పోగేయడం మొదలు పెట్టాడు అందుకోసం ఏం చేసేవాడంటే అఫీషియల్ లెటర్స్ లాగా అనిపించే విధంగా లెటర్ హెడ్స్ మీద రకరకాల లెటర్ హెడ్స్ మీద లెటర్స్ రాసేసి ఫలానా వస్తువులు కాంటే రకరకాల ఈ పదార్థాలు నాకు కావాలి కెమికల్స్ కావాలి అని చెప్పి లెటర్స్ సృష్టించేవాడు దొంగ లేఖల లెటర్స్ అన్ని సృష్టించేవాడు అన్నమాట అట్లానే ఫిజిక్స్ టీచర్ లాగా తాను టీనేజర్ అయినప్పటికీ తానే ఒక ఫిజిక్స్ టీచర్ అన్నట్టుగా ఆ ఆధారాలు సృష్టించి ఆ ఆధారాల ద్వారా ఈ డేవిడ్ సిస్టమాటికల్లీ అక్వైర్డ్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ రేడియో ఆక్టివ్ మెటీరియల్స్ రేడియో ఆక్టివ్ మెటీరియల్స్ మెటీరియల్స్
(05:50) చిన్న చిన్న మొత్తంలో పోగేయగలిగాడు అన్నమాట పోగేసి ఆ తర్వాత ఇతను చేసింది ఏంటంటే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇతను రేడియా ఆక్టివ్ మెటీరియల్స్ అనుధార్మిక పదార్థాలు ఎక్కడి నుంచి సంపాదించగలిగాడు అంటే రేడియం ఫ్రమ్ యాంటిక్ లూమినియస్ క్లాక్స్ మనకు వాచీల్లో రేడియం ఉంటుందనే విషయం తెలుసు కదా ఆ ఆ పురాత తర్వాత పాతకాలపు వాచుల్లో ఉండే రేడియం ని ఎక్స్ట్రాక్ట్ చేశాడు అన్నమాట.
(06:22) మొత్తా మీద దాంట్లోనుంచి రేడియం సంపాదించగలిగాడు. అలాగే బ్యాటరీస్ లో ఉండే లిథియం ఈ బ్యాటరీస్ లో ఉండే లిథియం కూడా సంపాదించి ఇతను ప్లాన్ చేసింది ఏంటంటే ఆ రకరకాల ప్రయోగాల ద్వారా ప్రిటీయం అనేది సృష్టించి అందులోంచి అనుధార్మిక శక్తిని ఉత్పత్తి చేయాలి అని అనుకున్నాడు అన్నమాట. దానికోసం తన సో కాల్డ్ లాబరేటరీ షెడ్ లో ఏం చేశాడంటే చాలా కెమికల్ ప్రాసెస్ ఇతడికి కెమిస్ట్రీ మీద కొంత తెలివి ఉందనేదయతే చాలా క్లియర్ మూర్ఖుడు అంటే ఏమి తెలియని వాడు కాదు నిజంగా కెమిస్ట్రీ మీద ఆసక్తి ఇష్టం ఉండడం వల్లే చేశాడు ఆ అబ్బాయి టీనేజ్ అబ్బాయి కాబట్టి అతడి ఉద్దేశాలని
(07:07) కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు అతడికి వేరే చెడు ఆలోచనలు ఉండకపోవచ్చు కానీ సగం అజ్ఞానం కంటే అర్ధజ్ఞానం చాలా ప్రమాదం అంటారు కదా ఆ విధంగా హాఫ్ నాలెడ్జ్ తో చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయి. ఆ లాబరేటరీలో చాలా లాంగ్ ప్రాసెస్ ఉపయోగించి ఇతను ఏం చేశాడంటే ఐసోలేట్ అండ్ కాన్సంట్రేట్ ద రేడియో యక్టివ్ ఐసోటోప్స్ అంటే ఈ అనుధార్మిక పదార్థాలని రకరకాల ప్రయోగాలు చేయడం ద్వారా కొన్ని రకాల మార్పులు కెమికల్ మార్పులు మార్పులు దాంట్లో తీసుకొచ్చి అందులోంచి శక్తిని ఉత్పత్తి చేసే ప్రయత్నం అయితే చేశాడన్నమాట ఇతను తనకు ఏర్పాటు చేసుకున్న ఆ షెడ్ లో
(07:51) ఏర్పాటుచే చేసుకున్న సెటప్ మొత్తానికి రియాక్టర్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ రియాక్టర్ లో ఇతను కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ తీసుకొద్దాం అనుకున్నాడు ఇప్పుడు మనకు విద్యుత్ కోసం ఏర్పాటు చేసే ఆ న్యూక్లియర్ స్టేషన్స్ లో న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ప్రాంతాల్లో జపాన్ లో చాలా ఉంటాయి ఆ మధ్య సునామి వచ్చినప్పుడు ఉకుషిమా ప్రాంతంలో ఇటువంటి న్యూక్లియర్ రియాక్టరే ప్రమాదానికి లోనైతే ప్రపంచం అంతా ఊపిరి పిగపట్టుకొని చూడాల్సి వచ్చింది ఎందుకంటే అది పూర్తిగా పేలిపోతాయి గతంలో చెర్నోబిల్ అనే ప్రాంతంలో ఇదే జరిగింది రష్యాలో ఇవి చాలా
(08:30) ప్రమాదము కొన్ని వేల మంది చనిపోవచ్చు లక్షల మంది అనారోగ్యాల పాలవ్వచ్చు కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాలు కూడా ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. సైంటిస్టులు నిరంతరం దాన్ని పర్యవేక్షణలో ఉండాలి. ఇవన్నీ చేయరు ఏవి లేకుండా ఈ పిల్లవాడు తన షెడ్ లో చిన్నపాటి అటువంటి న్యూక్లియర్ రియాక్టర్ ని తాను తయారు చేస్తున్నాను అనే భ్రమలో ఉండి ప్రమాదకరమైన ప్రయోగాలు చేయడంతో కొంతవరకు ఆ సక్సెస్ అయ్యాడు అని చెప్పలేం కానీ రేడియేషన్ మాత్రం వచ్చింది.
(09:05) తను అనుకున్న అనుశక్తి విడుదల అవ్వలేదు కానీ అనుధార్మికత వల్ల సమస్య మొదలైింది అన్నమాట. ఇతను చాలా రకాల కష్టపడి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నానని తనను తాను అనుకున్నప్పటికీ కూడా ఒక ఐదు అడుగుల దూరంలో తను ప్రయోగం చేస్తున్న దగ్గర నుంచి ఐదు అడుగుల విస్తీర్ణంలో ఎటువైపు వెళ్ళినా కూడా 1000 రేట్లు అధిక రేడియేషన్ వెలువడం మొదలైపోయింది అన్నమాట అంటే దాన్ని అలాగే వదిలేసి ఉంటే ఆ ఏరియాలో ఇంకా విస్తరించి బయట చాలామంది కూడా దాని ప్రమాదంలో పడేవాళ్ళు కానీ అప్పటికే ఇతను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆ రేడియో రేడియో ఆక్టివ్ మెటీరియల్స్ కి అనుధార్మిక పదార్థాలకి ఆ రేడియం టియం ఇట్లాంటి వాటికి
(09:48) లిథియం లాంటి వాటికి దగ్గరగా ఉండడం వల్ల ఇతని ఆరోగ్యంలో మార్పులు రావడం మొదలయ్యాయి అన్నమాట మొత్తానికి 1994 లో ఇతను చేస్తున్న ఆ ఇతను చేస్తున్న సాహసం లేదంటే ఇతను చేస్తున్న తెలివితక్క ప్రయోగాలన్నీ పోలీసుల దాకా వెళ్ళాయి ఎందుకు అంటే ఒకసారి కార్ ని పోలీసులకు అనుమానం వచ్చి వీళ్ళకు సంబంధించిన ఒక కార్ ని ఆ చెక్ చేసినప్పుడు ఆ కార్లో ఒక టూల్ బాక్స్ బయటపడింది ఆ పరికరాలు పెట్టాల్సిన టూల్ బాక్స్ లో రేడియో ఆక్టివ్ మెటీరియల్స్ కనిపించడంతో పోలీసులకు డౌట్ వచ్చి దాన్ని ఈ కేసు ని సీరియస్ గా తీసుకొని మరింత లోతుగా దర్యాప్తు చేసినప్పుడు ఏమైందంటే ఈ కేసు
(10:33) ఈపిఏ అంటారు అమెరికాలో అంటే ది ఎన్విరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వాతావరణ పరిరక్షణ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు రంగంలోకి దిగి ఇత ఈ పిల్లవాడికి సంబంధించిన షెడ్ ఆ షెడ్ లో ఉన్న ఆ అనుధార్మిక పదార్థాలు ఇవన్నీ చెక్ చేసినప్పుడు డేవిడ్ హాన్ చేసిన ప్రయోగాల వల్ల తీవ్రమైన అనుకాలుష్యం జరిగింది అనుధార్మికత ఆ పరిసరాల్లో ఏర్పడిందని కన్ఫర్మ్ అయిందన్నమాట ఇది అలాగే కంటిన్యూ చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు డేవిడ్ హాన్ కే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న వందలాది మందికి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి అప్పట్లో వార్తలు
(11:12) వచ్చాయి. సో నెక్స్ట్ జరిగింది ఏంటంటే సైట్ క్లీన్ అప్ జరిగింది. ఈపిఏ మనం చెప్పుకున్న ఎలక్ట్రా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆ షెడ్ ని సీస్ చేసేయడం అక్కడన్న ప్రాపర్టీని కూడా సీస్ చేసేసి ఆ షెడ్ మొత్తం డిస్మాంటిల్ చేసి అంటే కూల్ చేసి అక్కడున్న పదార్థాల అన్నిటిని రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా తీసుకుపోయి దగ్గరలో ఉన్న పుటా డెసర్ట్ అంటే అమెరికాలో ఉన్న ఒక రకమైన ఎడారి ప్రాంతం అది ఆ ప్రాంతంలో ఇసక తవ్వి దాంట్లో ఆ పూర్చి పెట్టడం జరిగిందన్నమాట అయితే ఈ మొత్తం కేసు అప్పుడు 1994 లో
(11:52) అమెరికాలో చాలా పెద్ద సంచలనం అయి ఛానల్స్ ఛానల్స్ కంటే ఎక్కువగా అప్పుడు పేపర్స్ ఉండేవి కాబట్టి ఆ పేపర్స్ లో చాలా రకాల న్యూస్ పేపర్స్ న్యూస్ మ్యాగజైన్స్ అవన్నిట్లలో ఈ డేవిడ్ హాన్ అనే అబ్బాయి గురించి చాలా ప్రముఖంగా ప్రచురించడం జరిగిందన్నమాట కానీ విచిత్రం ఏంటంటే డేవిడ్ హ్యాన్ అనే అబ్బాయి ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వానికి కి అలాగే ఆ వివిధ అధికారిక సంస్థలకి సహకరించలేదు తనకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలకు ఒప్పుకోలేదు.
(12:25) వాళ్ళకు సహకరించడంతో ఇతన్ని ఆరోగ్య పరీక్షలు సంపూర్ణంగా చేసి ఆ అనుధార్మిక పదార్థాల యొక్క ప్రభావం డేవిడ్ హాన్ మీద ఎంత పడింది అనే విషయం ఇప్పటికీ మిస్టీరియస్ గానే ఉండిపోయింది. అతను ఆ తర్వాత తీవ్ర అనారోగ్యాలకయతే లోన అవ్వలేదు కానీ అనేక రకాల చిన్న చిన్న సమస్యలు అతడికి వచ్చాయని చెబుతూ ఉంటారు. కానీ అతడు ప్రభుత్వానికి డాక్టర్లకు సహకరించకపోవడంతో అది అలాగే ఉండిపోయింది అలాగే ఆ తర్వాత కూడా చాలాసార్లు అతను కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ తాను ఎక్స్పరిమెంట్స్ చేసుకోవచ్చు అనే విధంగా న్యాయ పోరాటం కూడా చేశాడని చెప్తూఉంటారు అన్నమాట డేవిడ్ హాన్
(13:03) పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఈ మొత్తం స్టోరీలో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే సైన్స్ పట్ల ఆసక్తి ఉండడం చాలా గొప్ప విషయం సైన్స్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం కూడా మంచిదే కానీ సరైన ఆ మార్గదర్శనంలో లేదంటే సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణమైన అవగాహనతో చేయాల్సి ఉంటుంది. అలాగే టీనేజ్ పిల్లలు సైన్స్ పేరు చెప్పేసి ప్రయోగాలు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం ముఖ్యంగా తల్లిదండ్రులు గమనిస్తూ గుర్తించాల్సి ఉంటుంది.
(13:38) ఈ డేవిడ్ హాన్ అంత ప్రమాదకరంగా ప్రవర్తించడానికి కారణం అతనికి ఉన్న కెమిస్ట్రీ మీద అతనికి ఉన్న ఆసక్తి ఒకటి మాత్రమే కాదు అతనికి కెమిస్ట్రీ మీద ఆసక్తి ఉండడం నిజంగా స్వాగతించాల్సిన విషయం కానీ అతను ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని తల్లిదండ్రులు పట్టించుకోలేకపోవడం వాళ్ళద్దరూ విడిపోవడం మళ్ళీ రెండోసారి పెళ్లిళ్లు చేసుకోవడం వాళ్ళు వాళ్ళ జీవితాలతో బిజీగా ఉండడం వల్ల ఇతనికి చాలా ప్రమాదకరమైన ప్రయోగాలు చేసే ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడింది అనేది మనం గుర్తించాలి.
(14:08) కాబట్టి పిల్లల్ని కనడంతో పాటు పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ పెంచడం కూడా తల్లిదండ్రుల బాధ్యత అనేది ఈ కెమిస్ట్రీ స్టోరీలో మనం గుర్తించాల్సిన సోషల్ లెసన్ అన్నమాట థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment