Sunday, December 28, 2025

 విగ్రహారాధన vs ఆత్మారాధన మీది ముఖ్యం ?
" ఏవం సతతయంక్తా ….." - భ.గీత 12:1

విగ్రహారాధన మంచిదా కాదా అన్న సమస్య ఇప్పటిది కాదు. ఆత్మారాధన అంటే మన ఆత్మను మనం ఆరాధించడం అని కాకుండా ఆత్మకు రూపంలేదు కనుక నిరాకారాధన అని భావించాలి.

అర్జునుడే కృష్ణపరమాత్మను అడిగాడు " నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆరాధించే వారు కొందరు, చైతన్య రూపమైన పరమేశ్వరుడి నిరాకారాన్ని ఆరాధించేవారు కొందరు. వీరిలో ఎవరు శ్రేష్టులు " అని.

ఇద్దరూ శ్రేష్టులే అన్నారు పరమాత్మ.

" విశేషేణ గ్రహతి ఇతి విగ్రహః " - విగ్రహం మనిషిని కట్టి పడేస్తుంది. అంటే మనస్సు నిలుస్తుంది. అందుకని సామాన్యులకు విగ్రహాన్ని ఆరాధించడం, ఫలితం పొందడం సులువు. అందుకని విగ్రహారాధన వచ్చింది.

వివేకానందుడు చికాగో మతసభలకు వెడదామనుకున్నారు. చేతిలో పైస లేదు. ఎవరో సలహా ఇస్తే ఓ రాజును కలిసారు సహాయం చేయమని. దేముడిని చూపిస్తే ఖర్చు అంతా తనే భరిస్తానన్నాడు రాజు. ఆ సభలోనే రాజుది నిలువెత్తు ఫొటో ( వర్ణచిత్రం ) ఉంది. అక్కడ కాపలా ఉన్న భటుడిని పిలిచి ఆ ఫోటో మీద ఉమ్మేయమన్నారు వివేకానందుడు.‌ భటుడు వణికిపోయాడు. రాజు ఏం మాట్లాడుతున్నావు అని అరిచాడు. వివేకానందుడు " రాజా మీరు ఎదురుకుండానే ఉన్నా ఈ ఫోటోలో మిమ్మల్ని చూస్తున్నాడు ఈ భటుడు. అదే మేము చేసేది. విగ్రహంలో దేముడిని చూస్తాం మేము " అని.

వివేకానందుడు " మేము విగ్రహాన్ని పూజించం, విగ్రహంలో ఉన్న దేముడిని పూజిస్తాం " అనేవారు.

అమెరికాలో ఉన్న అమ్మాయి/అబ్బాయితో మాట్లాడినప్పుడు మామూలు కాల్ అనుభూతి వేరు, వీడియో కాల్ అనుభూతి వేరు. విషయం ఒకటే అయినా వీడియో కాల్ లో ఎక్కువగా ఆనందం పొందుతాం.

No comments:

Post a Comment