వెంటనే నటుడు శివాజీ క్షమాపణ ఎందుకు చెప్పినట్లు!?
చెప్పకపోతే....ఇక సినిమాలు రావు.
అందుకే తను చెప్పింది మంచి విషయమే అయినా...
సభలో 2 వాడకూడని అన్ పార్లమెంటరీ వర్డ్స్
వాడానని...క్షమాపణలు కోరాడు.
సభలో ఉన్నప్పుడు సభామర్యాద పాటించాలి. సరే.
కానీ ఓ స్టేజ్ కొచ్చాక అక్కినేని, బాలకృష్ణ, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ ...
తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి...సభా ముఖంగా!
వారి నెవ్వరూ క్షమాపణలు కాదు కదా...ఆక్షేపించే వారే లేరు!
నువ్వు నిఖార్సైన నిజం మాట్లాడినా సరే....దాని పర్యవసానాలు ఊహించి...
వాటికి తట్టుకుని నిలబడననుకుంటేనే...
తెగించి మాట్లాడాలి.
లేకుంటే...ఇదో ఇలాగే కాళ్ళబేరానికి రావాలి.
పాపం తనకు ఆప్షన్స్ కూడా ఏం లేవు.
ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తున్న ఫ్యామిలీస్ నుండి...
మా అసోసియేషన్ నుండి...
విషయం...మహళా హక్కుల కమీషన్..
మంత్రులు...సి.ఎం....పి.ఎం..దాకా పోయే!
మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ప్రకాష్ రాజు ను కాకుండా...
మంచు విష్ణు ను ఎలెక్ట్ చేసుకున్నప్పుడే....అర్ధమయ్యిందిగా !
తెలుగు చిత్రసీమలో ఎంత డర్టీ పాలిటిక్స్ ఉన్నాయో!
ఏ విధంగా చూసినా...ఎక్కడ ప్రకాష్ రాజ్!.. ఎక్కడ మంచు విష్ణు!...
నక్కకి - నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది.
ఇక్కడ బ్రతక నేర్చడం ముఖ్యం.
ముక్కు సూటి తనం అసలు పనికి రాదు.
#యు_నీడ్_టన్స్_ఆఫ్_హిపోక్రసీ_టు_గెట్_అలాంగ్
#ఇన్_ఫిల్మ్_ఫీల్డ్.
నటన -టాలెంట్....గట్రా ...తరువాత సంగతి.
అల్లు -కొణిదెల -మంచు -అక్కినేని -నందమూరి - దగ్గుబాటి...
ఇవే ప్రస్తుతం తెలుగు సినిమాలను శాసిస్తున్న ఫ్యామిలీస్.
ఇలాగే నోరు జారి....దిగ్విజయంగా సాగుతున్న సినీ జీవితాన్ని పాతాళం లోకి తొక్కించుకున్న
మంచి నటుడొకరున్నారు.
ఆయనే నరసింహ రాజు.
-oo0oo-
1977 నవంబర్ లో దివి సీమ తుఫాను బీభత్సం సృష్టిస్తే షుమారు 50 వేల మంది మరణించారు.
ఇక ఆస్తి నష్టం..బోలెడు.
ఎన్.టి.ఆర్ & ఎ.ఎన్.ఆర్. నేతృత్వంలో...సినీ తారలు ఎందరో కలిసి ఊరూరూ తిరిగి జోలె పట్టి చందాలు వసూలు చేశారు.
ఎందరో నటీ నటులు పాల్గొన్నారు.
ప్రత్యక్షంగా ఆ లారీల ప్రొసెషన్ ఇంకా కళ్ళకు కట్టినట్టుంది.
జమున, రాజసులోచన,కాంచన, ఛాయాదేవి, జయసుధ,జయప్రద, దీప, విజయ భాను...
కాంతారావు, మిక్కిలినేని, ఇంకా ఎందరో....దాదాపు 7 లారీలు ఉన్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రధాన నగరాల్లోను కలెక్ట్ చేశారు.
అంతా కలిపి.....15 లక్షలు దాకా వసూలైనట్లు సమాచారం.
కొందరు రాలేదు.
శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, ఇంకా కొందరు నటీ మణులు రాలేదు.
అందులో నర సింహరాజు ఒకడు.
కొందరితో మాటల్లో మాటగా...సరదాగానే...
ఎందుకీ హడావుడి? ఈ స్టార్స్ అంతా ఇన్ని రోజులు తిరిగిందానికి...ఎంత ఖర్చై ఉంటుంది.!
అనుకుంటే ..స్టార్స్ సొంతంగానే డొనేట్ చేయొచ్చు గదా. ప్రజలదగ్గర ఎందుకు వసూలు చెయ్యడం.
స్టార్స్ అందరూ కలిస్తే...15 లక్షలు ఈజీగా ఇవ్వొచ్చు. ఇంకా ఎక్కువే ఇవ్వొచ్చు...అనడమే
గాక.
వ్యక్తిగతంగా తనే ఓ లక్ష ఇచ్చాడు కూడా
రాజు చెప్పింది రైటే. కానీ అది అగ్ర హీరోల అహాన్ని దెబ్బతీసింది.
1977 నర సింహరాజు పీక్ లో ఉన్నాడు హీరోగా..
తూర్పు -పడమర,
ఇదెక్కడి న్యాయం
కన్య -కుమారి
రంభ -ఊర్వశి -మేనక...
అప్పట్లో యూత్ కు క్రేజీ హీరో నర సింహ రాజు.
ఆంధ్రా కమల్ హాసన్ అని పిలిచేవారు
-oo0oo-
ఇక...ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ & ఎ.ఎన్.ఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు...
నర సింహ రాజుకి వార్నింగులిచ్చారు.
అప్పుడు న్యూస్ పేపర్లే మీడియా ఆయుధాలు...
నీ సినిమాలు ఎట్లా ఆడతాయో చూస్తాం...
అసలు నీకు సినిమాలే రాకుండా చూస్తాం ...అన్నారు.
కానీ క్షమాపణలు చెప్పలేదు నర సింహ రాజు.
1978 లో 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
సింహ బలుడు(ఎన్.టి.ఆర్)
సింహ గర్జన(కృష్ణ)
జగన్మోహిని( నర సింహ రాజు)
జగన్మోహిన్ సూపర్ హిట్ అయ్యింది. ఫ్యాన్స్ చేసిందేమీ లేదు.
కానీ రాజుకు అవకాశాలు రావడం ఆగిపోయాయి....క్రమేణా.
ఒక్క విఠలాచార్య & దాసరి నారాయణ రావు తప్ప ...అందరూ బాయ్ కాట్ చేశారు.
బొంబాయిలో వాణీ జయరాం పరిస్థితి లాంటిదే.
దాసరి కి మాత్రం రాజు అంటే మహా ఇష్టం. అందుకే మళ్ళీ సినిమాలు వచ్చేవరకూ నా బిజినెస్ లు చూసుకోమని...
ఓ రిసార్ట్ లాంటిది అప్పగించారు.
నష్టాల్లో ఉన్న బిజినెస్ పరుగెత్తించాడు రాజు ..రోజుకు 40 వేలు లాభం చూపించాడట.
తనకు రోజుకు 5 వేలు జీతం.
దాసరి ఏవైనా సినిమా ఆఫర్లు చూస్తానన్నా....రాజు వద్దనే అన్నాడట.
ఇదే లాభ సాటిగా ఉంది....సినిమాలకంటే అని
అంతే.
ఫ్యామిలీ మద్రాస్ లో ఉంది. మద్రాస్ టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తూ...బిజినెస్ లే చూసుకున్నాడు.
తనూ స్వంతంగా ఏవో బిజినెస్ లు పెట్టారట .
-oo0oo-
దాదాపు వంద సినిమాల్లో చేసినా మొదట్లో నరసింహ రాజంటే ఉండే క్రేజ్ లేకుండా పోయింది.
అంత గ్యాప్ వచ్చేసింది.
వయసులోఉన్నప్పటి జోరు ఇప్పుడు లేదు.
పడి లేచిన అనుభవం. 70 దాటిన అనుభవం.
ఇప్పుడు చాల జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అయినా ముక్కు సూటి తనమన్నది...ఎంత కవర్ చేసినా తెలుస్తూనే ఉంది.
టి.వి. సీరియల్స్...చక్రవాకం...ఇంకా కొన్ని చేశారు. ఇంకా నటించే ఉద్దేశ్యం ఉంది కూడా.
మనిషి లో చార్మ్ తగ్గ లేదు.
ఇతర భాషల్లో కూడా చేశాడు.
అసలు మొదట 1969 లో కన్నడ మూవీస్ తో మొదలెట్టాడు తన 51 ఏళ్ళ సినీ ప్రస్థానం.
అదెలా అంటే...
ప.గో.జిల్లా లో ఉండ్రాజవరం మండలం - వడ్లూరు గ్రామంలో 1951 డిసెంబర్ 26 న పుట్టిన నరసింహ రాజు తండ్రి...
స్వతహాగా ఉన్నవారే...
రాజులు కదా ....దానధర్మాలు విరివిగా చేశారట...ఆస్తి తరిగిపోయేంతగా.
పి.యు.సి. తో చదువాపేసి...సినిమా వేషాల కోసం మద్రాసొచ్చేశాడు.
మొదట్లో కొన్ని కన్నడ చిత్రాల్లో..తమిళ చిత్రాల్లో గుర్తింపు లేని వేషాలు వేసినా...
గుర్తింపు తెచ్చినది...తొలి తెలుగు చిత్రం...నవశక్తి వారి...నీడలేని ఆడది.(1974). ప్రభకు కూడా అదే మొదటి మూవీ.
ఆ తరువాత అమ్మాయిలూ జాగ్రత్త. పెద్ద హిట్ కాలేదు. అప్పట్లో యూత్ కు నచ్చింది.
తూర్పు -పడమర(1976)
ఇదెక్కడి న్యాయం,(1977)
కన్య -కుమారి,.(1977)
అప్పుడు నర సిం హరాజంటే యూత్ ఐకాన్. అంత క్రేజుండేది.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. ఎవరి పుష్ లేదు.
1980 లో రిలీజ్ అయిన పున్నమి నాగు లో రాజు హీరో అయితే చిరంజీవి విలన్.
చిరంజీవి ఈ స్టేజ్ కొచ్చాడు కదా...దాని పై మీ అభిప్రాయమేమిటి?....అంటే...
తడబడ లేదు. అభిప్రాయం ఏముంది? కష్ట పడ్డాడు. పైకొచ్చాడు.
కాలం అనుకూలించింది. చాలా జాగ్రత్తపరుడు. బాగా ప్లాన్ చేసుకున్నాడు.
నేను ప్లాన్ చేసుకోలేదు.
అప్పట్లో మాదాపూర్ లో 90 రూపాయలు అంకణం. కొనలేదు. మద్రాస్ లో ఉండే నాకు హైదరాబాద్ లో స్థలమెందుకులే అనుకున్నా.
కానీ అనిశ్చితమైన ఈ సినీ ఫీల్డ్ కు...
ఎంతో అందంగా ఉండి...మార్షియల్ ఆర్ట్స్ నేర్చుకున్న 6-3 హైట్ ఉన్న కొడుకు సినిమాల్లో చేరుతానంటే....
వద్దని...
కెనడా లో బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ లో జాబ్ లో చేర్పించాడు.
కూతురు కూడా హెచ్.ఆర్ . గా జాబ్ చేస్తున్నారు.
కెనడాలో 2 విల్లాస్ కొన్నారట.
లైఫ్ కెనడాలో ఎంతో ఈజీ. చాలా హాయిగా ఉన్నారట.
ఎవరికైనా అదే కదా కావలసింది.
70 దాటాక ఎక్కడున్నా ప్రశాంతంగా జీవితం సాగాలి. హాయిగా ఉండాలి ఉన్నన్నాళ్ళూ.
ఇప్పటికీ నటించే ఉత్సాహం ఉంది.
రాజేంద్ర ప్రసాద్ మంచి మిత్రుడు....నరసింహ రాజుకు
ఓ మూవీ లో స్నేహితులు గా చేస్తున్నారట. నువ్వే వెయ్యాలిరా ఇది అని అడిగి మరీ వేయిస్తున్నాడట రాజేంద్రుడు.
నర సింహ రాజు మరిన్ని మంచి చిత్రాలలో నటించాలని ఆశిద్దాం.
#ఈ_రోజు_నరసింహ_రాజు_బర్త్_డే.🌹🎂🌹
(26-12-1951)
#బెస్ట్_విషెస్_చెప్దాం.💐💐💐💐
@highlight
🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹
- డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్.
No comments:
Post a Comment