కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యాకా ధర్మరాజు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకున్నాడు కదా. మరి ఇంద్రప్రస్థం పరిస్థితి ఏమైంది? ఆ నగరాన్ని ఎవరు పరిపాలించారు?
ఇక్కడ ధర్మబద్ధంగా ధర్మరాజే రాజ్యానికి రాజు, ఎందుకంటే అభిషిక్తుడయ్యింది ధర్మరాజు మాత్రమే, దుర్యోధనుడు కాదు, ఆయనకు ఎలాంటి పదవి లేదు, ఉన్నదల్లా నాన్న రాజు తాను యువరాజు అన్న అభిప్రాయం మాత్రమే, కానీ సింహాసనం పైన ఉంది ధార్తరాష్త్రుడైనా మొత్తం రాజ్యభారం వహించింది భీష్మపితామహుడే, ఎందుకంటే ఇక్కడ సర్వసైన్యాధ్యక్షుడు ఆయనే రాజును కూర్చోబెట్టి ఆయనే అన్ని ఎదుర్కొని రాజ్యభారం చేసాడు,
ఇక ఇంద్రప్రస్థానికి వాసం ఎందుకు చేసారంటే నిత్యం గొడవలు కక్ష్యకార్పణ్యాలతో బతికేకన్నా పక్కన ఉండడం మేలని తలంచి పెద్దలు చేసిన ఏర్పాటు అది, ఇక ఇంద్రప్రస్థాన్ని రాజ్యంగా చేసుకున్నప్పుడు పాండురాజు జయించిన రాజ్యాలు తాము జయించిన రాజ్యాలు కలిపి విభాజ్యంలో వాసం కాగా హాయిగా ధర్మంగా రాజ్యం చేశారు.
యుద్ధం తర్వాత కృష్ణనిర్యాణం తెలిసి ద్వారకా నగరం సముద్రంపాలు కాబోతున్నాడని తెలిసి అర్జునుడు యాదవ బాల వృద్ధ స్త్రీ సమూహాలను హస్తినకు తీసుకురాగా ధర్మరాజు కృష్ణనిర్యాణం గురించి వార్త తెల్సి ఇక తన సమయానికి కూడా కాలం గమించిందని తలిచి
కలి ప్రవేశం జరగనున్న మార్పులు అన్ని గమనించి హస్తినాపురం సింహాసనానికి పరీక్షిత్తుని రాజును చేసి, ద్వారకా ప్రజల కోసం ప్రద్యుమ్నుని పౌత్రుడు అనిరుద్ధుని పుత్రుడు ఐన వజ్రుడిని రాజును చేసి సంరక్షక బాధ్యతలను సుభద్రకు అప్పగించి, అది హస్తినాపురం సింహాసనంలో భాగంగానే ఉంచి తాను మహాప్రస్థానానికి పయనమయ్యాడు. ఈయనను అనుసరించి మిగిలిన పాండవులు ద్రౌపది కూడా పయనమయ్యారు.
ఇక మొత్తం కథ ఆ దేవుని వల్ల సత్యశుభదాయకమైంది, ఆ తర్వాత పరీక్షిత్తు వల్ల కూడా
అదే ధర్మంతో విలసిల్లింది, ఆ మహానుభావుడు చేసిన ఒక పొరపాటు వల్ల అమృతమయమైన భాగవతం మనకు లభించింది, అంతకన్నా తీయనైన అచ్చ తెలుగు పలుకులతో పోతనామాత్యుల పాలపడి మన జన్మలు ధాన్యం చేస్తోంది.
No comments:
Post a Comment