*మీ రాశిని బట్టి..మీరు ఎందులో..రాణిస్తారో..*
*తెలుసా...*
లైఫ్ లో సక్సెస్ అవ్వాలని,
మంచి కెరీర్ ఎంచుకోవాలని,
ఉన్నత స్థానానికి వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
కానీ ......
కెరీర్ ఛాయిస్ లో వేసే తప్పటడుగులే వాళ్ల ఫెయిల్యూర్ కి కారణమవుతుంటాయి.
కొంతమంది వాళ్లు ఎంచుకున్న దారిలో అద్భుతమైన విజయం సాధిస్తారు.
అయితే టాలెంట్ ని..
మీ చదువుని, మీరు చేసిన డిగ్రీని, ఆర్థిక స్థోమతను బట్టి ఎంచుకుంటారు.
కొంతమంది ఇష్టం లేకపోయినా,
అదే ప్రొఫెషన్ లో వెళ్తూ ఉంటారు.
కొంతమంది వాళ్లు వెళ్తున్న దారిని ఎంజాయ్ చేస్తారు.
ఏది ఏమైనా...
మనం ఎంచుకునే కెరీర్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా
ఎదుర్కునే శక్తి మన కెరీర్ పైనే ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి.
అందుకే ఎలాంటి ప్రొఫెషన్ ఎంచుకోవాలి అన్న డైలమాలో ఉన్నవాళ్లకు జ్యోతిష్యం చూపిస్తున్న చక్కని పరిష్కారం.
ఎందుకంటే మీ రాశిని బట్టి మీరు మీ కెరీర్ ని ఎంచుకోవచ్చు?
మరి మీకు కలిసొచ్చే కెరీర్ ఏంటో..చూద్దాం.
మేషం..
మేషరాశి వాళ్లకు తెలివి తేటలు చాలా ఎక్కువగా ఉంటాయి.
చాలా పట్టుదల కలిగి ఉంటారు.
వీళ్లు ఛాలెంజింగ్ ఉన్న జాబ్స్ అయితే సంతృప్తి చెందుతారు.
కాబట్టి మిలట్రీ, రాజకీయాలు, రెస్క్యూ వర్క్ లో రాణించగలుగుతారు.
అలాగే పారిశ్రామిక వేత్తలుగా కూడా సక్సెస్ అవవచ్చు.
వృషభం.
వృషభ రాశి వాళ్లు హార్ట్ వర్క్ చేస్తారు.
వీళ్లు చాలా లగ్జరీగా, అందంగా ఉంటారు.
డిజైనర్స్ లేదా చెఫ్ గా అయితే సక్సెస్ అవుతారు.
మిథునం.
మిధున రాశి వాళ్లు చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు.
అలాగే తెలివైనవాళ్లు.
వీళ్ల టాలెంట్ కి, వీళ్ల మనస్తత్వానికి స్టాక్స్ లో వర్క్ చేస్తే మంచి ఫలితాలుంటాయి.
లేదా టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్, సేల్స్ జాబ్స్ కూడా సక్సెస్ అవుతారు.
కర్కాటకం.
కర్కాటక రాశివాళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు.
చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు.
ఎలాంటి సమస్యనైనా చాలా సృజనాత్మక పద్ధతిలో పరిష్కరిస్తారు.
వీళ్లు టీచర్స్, సైకాలజిస్ట్, సోషల్ వర్కర్స్, గార్డెనర్స్ జాబ్స్ కి బాగా సూట్ అవుతారు. సక్సెస్ అవుతారు.
సింహం.
సింహరాశి వాళ్ల పర్సనాలిటీకి తగ్గట్టు చాలా మంచి కెరీర్ ఉంటుంది.
వీళ్లకు భయమంటే తెలియదు.
వీళ్లు కెరీర్ లో బాగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు.
అలాగే డబ్బులు సంపాదిస్తారు.
వీళ్లు సీఈవో, మేనేజర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా బాగా సక్సెస్ అవుతారు.
కన్య.
కన్యా రాశి వాళ్లు చాలా లాజికల్ గా ఉంటారు.
ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటారు.
వీళ్లు ఎడిటింగ్, వ్రైటింగ్, రీసెర్చ్, స్టాటిస్టికల్ అనాలసిస్ జాబ్స్ లో సెటిల్ అవడం మంచిది.
తుల.
తులారాశివాళ్లు మంచి తెలివైనవాళ్లు.
వీళ్లకు ఎదుటివాళ్ల ఆలోచనలు తెలుసుకునే సత్తా ఉంటుంది.
అలాగే ఎదుటివాళ్లు చెప్పే విషయాలు ఓపిగ్గా వింటారు.
వీళ్లకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఎదుటివాళ్లను ఆకట్టుకుంటాయి.
వృశ్చికం.
వృశ్చిక రాశి వాళ్లకు చాలా లోతుగా ఆలోచించే తత్వం ఉంటుంది.
చాలా నిజాయితీగా ఉంటారు.
స్వతంత్రంగా ఉండాలనుకుంటారు.
చాలా స్మార్ట్ గా కూడా ఉంటారు.
కాబట్టి వీళ్లు డిటెక్టివ్, సర్జన్, సైంటిస్ట్ వంటి ప్రొఫెన్స్ ఎంచుకుంటే లైఫ్ లో విజయం సాధిస్తారు.
ధనస్సు.
ధనస్సు రాశి వాళ్లు చాలా సైలెంట్ గా ఉంటారు.
ట్రావెలింగ్ ను ఇష్టపడతారు.
జీవితం యొక్క పరమార్థం తెలుసుకోవాలని ఎక్కువ ఇష్టపడతారు.
ఎక్కువగా ఆధ్మాత్మిక విషయాల గురించి ఆలోచిస్తారు.
కాబట్టి వీళ్లు ఇతరులను ప్రేరేపించడానికి,
కోచింగులు ఇవ్వడానికి, మంత్రులుగా, ఫిలాసఫర్లుగా రాణిస్తారు.
మకరం.
మకర రాశి వాళ్లు చాలెంజ్ లను ఇష్టపడతారు.
అప్పుడే సంతోషంగా ఉంటారు.
జీవితాన్ని విభిన్నంగా మార్చుకోవడానికి ఇష్టపడతారు.
చాలా మెచ్యూర్ గా ఉంటారు.
వీళ్లు కెరీర్ ఎంపికలో ఐటీ, మెడిసిన్, బ్యాంకింగ్ వంటివి చూసుకోవడం మంచిది.
కుంభం.
కుంభరాశి వాళ్లు చాలా లోతుగా ఆలోచించే తత్వం కలిగి ఉంటారు.
తమ చుట్టూ ఉన్న విషయాలపై ప్రశ్నించుకోవడం అలవాటు.
చాలా క్యూరియాసిటీగా ఉంటారు.
కాబట్టి వీళ్లు మంచి సైంటిస్ట్ లు అయ్యే అవకాశాలున్నాయి.
లేదా ఏరోనాటిక్స్, ఆస్ట్రానమీ, ఆర్గానిక్ ఫార్మింగ్
వంటి ప్రొఫెన్స్ లో మంచి ఫలితాలు పొందుతారు.
మీనం.
మీన రాశి వాళ్లు సహాయపడే గుణం ఉంటుంది.
చాలా సృజనాత్మకంగా, పాషినేట్ గా ఉంటారు.
కాబట్టి వీళ్లు ఆర్టిస్ట్ లు మంచి లైఫ్ ఉంటుంది. *ఆధ్యాత్మిక కుటుంబం 4*
No comments:
Post a Comment