Sunday, May 3, 2026

మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే.. ఇలా చేయండి? | Bhagavad Gita Lessons for Peace

మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే.. ఇలా చేయండి? | Bhagavad Gita Lessons for Peace

Author Name:Telugu Box Stories

Youtube Channel Url:https://www.youtube.com/@telugubox_stories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cXcIxqaFfys



Transcript:
(00:00) మిత్రులారా ఈ ప్రపంచంలో మీరు ఎవరితోనైనా యుద్ధం చేసి గెలవగలరు. 100 మంది విమర్శకుల నోళ్ళు మూయించగలరు. కానీ ఒక్క వ్యక్తిని ఓడించడం మాత్రం చాలా కష్టం. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? అద్దంలో మీకు కనిపిస్తున్న మీరు అవును మీ అతి పెద్ద శత్రువు మీ పక్కింట్లో లేడు మీ ఆఫీసలో లేడు వాడు మీ లోపలే ఉన్నాడు.
(00:26) మీరు ఒక గొప్ప పని చేద్దాం అనుకున్నప్పుడు బొద్దులే రేపు చూద్దాం అని మిమ్మల్ని ఆపే బద్ధకం మీ శత్రువు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నీ వల్ల కాదు అని భయపెట్టే మీ అపనమ్మకం మీ శత్రువు ఎదుటివాడు ఏదో అన్నాడని రోజంతా కుమిలిపోయే మీ బలహీనమైన మనసు అది మీ అసలైన శత్రువు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బంధువులను చూసి విల్లు కింద పడేసినప్పుడు కృష్ణుడు చెప్పిన మొదటి మాట ఇదే అర్జున బయట ఉన్న శత్రువు కంటే నీ లోపల ఉన్న మోహం అనే శత్రువు నిన్ను బలహీన పరుస్తుంది.
(01:02) దాన్ని ముందు చంపు మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా మన బాధలకి కారణం ఎవరో బయట వ్యక్తులు అని సాకులు వెతుక్కుంటాం. కానీ నిజం ఏమిటంటే బయట ఎన్ని తుఫానులు వచ్చినా పడవ మునగదు. ఆ తుఫాను నీరు పడవ లోపలికి వచ్చినప్పుడే అది మునిగిపోతుంది. అలాగే బయటి ప్రపంచం మిమ్మల్ని ఎన్ని మాటలన్నా మీరు నాశనం అవ్వరు. ఆ మాటలను మీరు మనసు లోపలికి తీసుకున్నప్పుడే మీ పతనం మొదలవుతుంది.
(01:27) శ్రీకృష్ణుడు గీతలో అన్నట్టు నీకు నీవే మిత్రుడవు నీకు నీవే శత్రువు మీ మనసు మీ మాట వినడం మొదలు పెట్టిన రోజు ఈ ప్రపంచంలో నిన్ను ఓడించే శక్తి ఏది ఉండదు. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి పక్కవాడిని గెలవడం కాదు ముందు నీ లోపల ఉన్న ఆ భయాన్ని ఆ బద్ధకాన్ని గెలువు యుద్ధం మొదలయింది. ఇందులో నువ్వు గెలుస్తావా లేక నీ బలహీనతలకు బానిసగా మిగిలిపోతావా క్రమశిక్షణ మిత్రులారా విజయం సాధించడానికి కావాల్సింది తెలివితేటలు మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్టే ఈ ప్రపంచంలో ఎంతో మంది తెలివైన వారు ఓడిపోయి రోడ్డు మీద తిరుగుతున్నారు.
(02:08) ఎంతో మంది ప్రతిభావంతులు అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఆగిపోయారు. మరి విజేతలను నిలబెట్టేది ఏమిటో తెలుసా? అది క్రమశిక్షణ. చాలా మందికి క్రమశిక్షణ అంటే ఒక శిక్షలా అనిపిస్తుంది. కానీ నిజానికి క్రమశిక్షణ అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ లక్ష్యం కోసం ఏ పని చేయాలో ఆ పనిని ఖచ్చితంగా చేయడమే. నీ మనసు నిద్రపో అన్నప్పుడు నీ లక్ష్యం కోసం లేచి పని చేయి అని నీ మనసును నువ్వు శాసించడమే అసలైన క్రమశిక్షణ.
(02:41) శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక గొప్ప మాట చెప్పారు. అభ్యాసేనతు కౌంతేయ అంటే ఏదైనా సరే సాధన ద్వారానే సాధ్యమవుతుంది. క్రమశిక్షణ లేని సాధన చిల్లుపడ్డ పాత్రలో నీరు పోయడం వంటిది. ఎంత పోసినా అది నిండదు. అలాగే ఎంత ప్రతిభ ఉన్నా క్రమశిక్షణ లేకపోతే అది వృధా అయిపోతుంది. గుర్తుంచుకోండి మనసు ఒక కోతి లాంటిది. అది మిమ్మల్ని ఎప్పుడూ సుఖం వైపు విలాసాల వైపు లాగుతుంది.
(03:09) దానికి నచ్చినట్టు మీరు వదిలేస్తే అది మిమ్మల్ని పాతాళానికి తొక్కుతుంది. అదే క్రమశిక్షణ అనే అంకుశంతో దాన్ని అదుపు చేస్తే అది మిమ్మల్ని శిఖరానికి చేరుస్తుంది. ఒక రాయి శిల్పం కావాలంటే అది ఎన్ని దెబ్బలైనా భరించాలి. ఆ దెబ్బలే రాయికి క్రమశిక్షణ. మీరు కూడా ఒక అద్భుతమైన వ్యక్తిగా మారాలంటే మీరు మీ సోమరితనాన్ని మీ వాయిదా వేసే తత్వాన్ని దెబ్బ తీసి చెక్కాలి.
(03:36) క్రమశిక్షణ లేని జీవితం చుక్కాని లేని పడవ లాంటిది. గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది తప్ప గమ్యానికి చేరదు. మిత్రులారా ఇప్పటి నుండి మీ జీవితానికి మీరే యజమాని అవ్వండి. మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక చిన్న మార్పుతో మొదలు పెట్టండి రేపు కాదు ఇప్పుడే భయం మిత్రులారా ఈ ప్రపంచంలో మనిషిని బ్రతికుండగానే చంపేసే ఆయుధం [సంగీతం] ఒకటి ఉంది.
(04:03) అది కత్తి కాదు విషం కాదు అది భయం భయం అనేది ఒక చీకటి గది లాంటిది. అందులోకి వెళ్ళినవాడు తన సొంత నీడను చూసి కూడా శత్రువు అనుకొని వణకిపోతాడు. అసలు భయం అంటే ఏమిటో తెలుసా? జరగని దాని గురించి జరగబోయే దాని గురించి మనం ఊహించుకునే ఒక భ్రమ చాలామంది అడుగుతారు నాకు భయంగా ఉంది నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని గుర్తుంచుకోండి భయం లేనివాడు వీరుడు కాదు భయం ఉన్నా కూడా అడుగు ముందుకు వేసేవాడే అసలైన వీరుడు మీరు భయాన్ని చూసి పారిపోతే అది మిమ్మల్ని వేటాడుతుంది.
(04:40) మీరు వెనక్కి తిరిగి దాని కళ్ళలోకి చూస్తే అది మాయమైపోతుంది. కురుక్షేత్ర రణరంగంలో లక్షల మంది సైన్యాన్ని చూసి అర్జునుడు భయపడలేదు కానీ నేను ఓడిపోతే ఏంటి నా వారు చనిపోతే ఏంటి అనే ఊహల్ని చూసి భయపడ్డాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు అర్జున భయం అనేది అజ్ఞానం రేపు ఏం జరుగుతుందో నీ చేతుల్లో లేదు కానీ యుద్ధం చేయడం నీ ధర్మం ధర్మాన్ని పట్టుకో భయం తనంతట అదే పారిపోతుంది.
(05:11) మీరు గమనించారా మన జీవితంలో మనం భయపడే విషయాల్లో 90% అసలు జరగవు కానీ ఆ భయం వల్ల మనం చేసే పనులు ఆగిపోతాయి. మన ప్రతిభ అణచివేయబడుతుంది. ఓడిపోతాననే భయం ఉన్నవాడు ఎప్పటికీ గెలవలేడు ఎందుకంటే వాడి దృష్టి గెలుపు మీద కాదు పడిపోవడం మీద భయం అనేది నీ మనసు నీకు చెప్పే అబద్ధం నువ్వు చేయలేవు నీ వల్ల కాదు లోకం నిన్ను చూసి నవ్వుతుంది అని అది నిన్ను నిరంతరం హెచ్చరిస్తుంది.
(05:40) కానీ ఆ అబద్ధాన్ని దాటి ఒక్క అడుగు ముందు వేసి చూడండి. అక్కడ విజయం మీకోసం వేచి ఉంటుంది. మిత్రులారా ఇప్పటి నుండి భయానికి బానిస అవ్వకండి. సింహం గర్జించినప్పుడు అడవి భయపడుతుంది. కానీ సింహం దేనికి భయపడదు. ఎందుకంటే [సంగీతం] దానికి తన శక్తి మీద నమ్మకం ఉంది. మీలో ఉన్న ఆ దైవత్వాన్ని నమ్మండి. భయం అనే మాయాజాలాన్ని మీ ఆత్మవిశ్వాసంతో చేదించండి.
(06:07) బద్ధకం మిత్రులారా శత్రువు బయట ఉంటే మనం కత్తితోనో మాటతోనో ఎదురించవచ్చు కానీ ఒక శత్రువు మన రక్తంలో కలిసిపోయి మనల్ని లోపలి నుండి తినేస్తుంటాడు. ఆ శత్రువు పేరే బద్ధకం బద్ధకం అంటే కేవలం పని చేయకపోవడం కాదు నీలో ఉన్న శక్తిని నీలో ఉన్న ప్రతిభను నీవే సమాధి చేసుకోవడం బద్ధకస్తుడు జీవించి ఉన్న వాడుఒక కదిలే శవం వంటివాడే చాలామందికి ఒక అలవాటు ఉంటుంది.
(06:39) రేపు చేద్దాంలే ఈ ఒక్క మాట కోట్లాది మంది జీవితాలను నాశనం చేసింది. ఆ రేపు అనేది ఎప్పటికీ రాదు. మీరు వాయిదా వేసే ప్రతి నిమిషం మీ విజయాన్ని మీరు ఒక అడుగు దూరం చేసుకుంటున్నారని గుర్తుంచుకోండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మాభలేషు కదాచన అంటే పని చేయడం మీద మాత్రమే నీకు అధికారం ఉంది.
(07:04) కానీ బద్ధకస్తుడు పనిని వదిలేసి ఫలితం గురించి కలలు కంటాడు. శ్రమించని వాడికి ఫలితాన్ని ఆశించే హక్కు కూడా లేదు. కృష్ణుడు అర్జునుని యుద్ధం చేయమని ప్రేరేపించింది అందుకే కూర్చొని ఆలోచిస్తే సమస్యలు పెరుగుతాయి. కదిలి పని చేస్తేనే పరిష్కారాలు దొరుకుతాయి. ప్రవహించే నది ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. కానీ నిలిచిపోయిన నీరు మురికిగా మారి కంపు కొడుతుంది.
(07:28) మీ జీవితం కూడా అంతే [సంగీతం] మీరు నిరంతరం కదులుతూ పని చేస్తూ ఉంటేనే మీ విలువ పెరుగుతుంది. బద్ధకం అనేది ఒక వ్యసనం అది మొదట్లో హాయిగా ఉంటుంది. కానీ చివరిలో నరకం చూపిస్తుంది. మీరు పనిని వాయిదా వేస్తున్నారంటే మీరు మీ భవిష్యత్తును తగలబెడుతున్నారని అర్థం. మిత్రులారా సోమరితనం అనేది ఒక ఇనుప గొలుసు లాంటిది. దాన్ని తెంచుకోవాలంటే గట్టి సంకల్పం కావాలి.
(07:53) నీ మనసు కాసేపు పడుకో అన్నప్పుడు నీ ఆశయం నిన్ను లేచి పరుగెత్తు అని తట్టాలి. గుర్తుంచుకోండి సింహం పడుకొని ఉంటే ఏ జంతువు దాని నోట్లోకి వచ్చి పడదు. అది కూడా వేటాడాల్సిందే. ఇప్పటి నుండి రేపు అనే పదాన్ని మీ డిక్షనరీ నుండి తీసేయండి. విజేతలు పనిని మొదలు పెడతారు. బలహీనులు సాకులు వెతుక్కుంటారు. మీరు విజేతలా లేక సాకులు చెప్పే బలహీనులా అసూయ.
(08:19) మిత్రులారా శత్రువు బయట ఉండి దాడి చేస్తే మనం కవచంతో కాపాడుకోవచ్చు. కానీ లోపలే ఉండి మనల్ని నిలువున దహించేసే ఒక భయంకరమైన విషం ఉంది. దాని పేరే అసూయ. పక్కవాడు సుఖంగా ఉన్నాడని ఎదుటివాడు ఎదుగుతున్నాడని మనసులో పుట్టే ఆ చిన్న మంట మెల్లమెల్లగా మనలోని సంతోషాన్ని ప్రశాంతతను భస్మం చేసేస్తుంది. అసూయ అంటే ఏమిటో తెలుసా ఎదుటివాడికి కీడు జరగాలని కోరుకోవడం కాదు వాడు బాగున్నందుకు నువ్వు బాధపడటం ఇది ఎదుటివాడిని ఏమీ చేయలేదు కానీ నిన్ను మాత్రం ప్రతి క్షణం నరకంలో బ్రతికేలా చేస్తుంది.
(09:03) మహాభారతంలో దుర్యోధనుడి పతనానికి కారణం వాడి బలహీనత కాదు వాడి అసూయ. పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించి వైభవంగా ఉన్నప్పుడు అది చూసి దుర్యోధనుడు నిద్రలేని రాత్రులు గడిపాడు. కృష్ణుడు పదే పదే చెప్పాడు. దుర్యోధన నీ దగ్గర ఉన్నది అనుభవించు పక్కవాడి ఐశ్వర్యాన్ని చూసి నీ రక్తాన్ని ఉడికించుకోకు అని కానీ అసూయ అనే పాము వాడి వివేకాన్ని మింగేసింది.
(09:30) చివరికి ఆ అసూయే కురువంశ నాశనానికి పునాది అయింది. గుర్తుంచుకోండి ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తే మొదటి దీపం వెలుగు తగ్గదు కదా పెరుగుతుంది. అలాగే పక్కవాడి ఎదుగుదల చూసి నువ్వు ఆనందిస్తే నీలో ఉన్న ధనాత్మక శక్తి పెరుగుతుంది. అసూయ పడేవాడు ఎప్పుడూ పక్కవాడి దారినే గమనిస్తూ ఉంటాడు తప్ప తన దారిని తాను చూసుకోలేడు.
(09:53) వాడు పద అడుగులు ముందుకు వేస్తే నువ్వు ఏడుస్తూ అక్కడే ఉండిపోతావు. మిత్రులారా నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. నీకంటూ ఒక గమ్యం ఉంది. పక్కవాడి గీతను చెరపాలని చూడటం కాదు నీ గీతను పెద్దదిగా గీసుకోవడం నేర్చుకో ఎదుటివాడి విజయం నీకు స్ఫూర్తి కావాలి తప్ప అది నీలో మంటను పుట్టించకూడదు. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి. పక్కవాడి తోటలో పూలు పూసాయని బాధపడకండి.
(10:18) మీ తోటను మీరు ఎలా అందంగా మార్చుకోవాలో ఆలోచించండి. అసూయ అనే నిప్పును చల్లార్చండి. అప్పుడే మీ మనసు ప్రశాంతమైన సరసులా మారుతుంది. మాట తీరు మిత్రులారా ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది కాంతి కాదు మీ నోటి నుండి వచ్చే మాట. ఒక మాట ఒక వ్యక్తిని ఆకాశానికి ఎత్తగలదు. అదే మాట ఒక వ్యక్తిని అధాతాళానికి తొక్కగలదు. [సంగీతం] కత్తితో చేసిన గాయం మానిపోతుంది కానీ మాటతో చేసిన గాయం మనసులో జీవితాంతం పచ్చి పుండులా రగులుతూనే ఉంటుంది.
(10:56) మీ మాట తీరును బట్టే మీ వ్యక్తిత్వం మీ సంస్కారం మరియు మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. చాలామంది అంటారు నేనేదో సరదాకే అన్నాను అని కానీ గుర్తుంచుకోండి విల్లు విడిచిన బాణం నోరు జారిన మాట వెనక్కి తీసుకోలేము. మీరు ఆవేశంలో అనే ఒక్క మాట కొన్ని దశాబ్దాల బంధాలను నిమిషాల్లో ముక్కలు చేయగలదు. మహాభారత యుద్ధానికి బీజం పడింది ఎక్కడో తెలుసా మాటలోనే గుడ్డివాడి కొడుకు గుడ్డివాడే అని ద్రౌపది అన్న ఒక్క మాట దుర్యోధనుడి గుండెల్లో మంటను రాజేసింది.
(11:32) అదే మాట కురుక్షేత్ర రణరంగానికి దారి తీసింది. శ్రీకృష్ణుడు అందుకే అంటారు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ అంటే ఎదుటి వారిని నొప్పించనిది సత్యమైనది ప్రియమైనది మాత్రమే మాట్లాడాలి. మీ మాటలు తేనెలా ఉండాలి తప్ప తేలు కుట్టినట్టు ఉండకూడదు. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. నేను చెప్పే ఈ మాట అవసరమా? ఇది నిజమా? ఇది ఎదుటివారికి మేలు చేస్తుందా? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం అవును అయితేనే మీ నోరు విప్పండి లేదంటే మౌనంగా ఉండటమే శ్రేయస్కరం.
(12:14) గంభీరంగా మాట్లాడడం అంటే అరవడం కాదు మీ మాటలో అర్థం ఉండాలి. [సంగీతం] మిత్రులారా మీ మాట తీరును బట్టే శత్రువులు మిత్రులవుతారు మిత్రులు శత్రువులుఅవుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నది సామెత మాత్రమే కాదు అది జీవిత సత్యం. మీ వాక్కుని ఒక ఆశీర్వాదంగా మార్చుకోండి తప్ప ఒక శాపంగా మార్చుకోకండి. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి.
(12:43) ఎదుటివారు తక్కువగా మాట్లాడినా మీరు హుందాతనంగా సమాధానం చెప్పండి. మీ సంస్కారం మీ మాటల్లో కనిపించాలి. గుర్తుంచుకోండి నిశశబ్దం తర్వాత అంతటి శక్తి ఉన్నది కేవలం మృదువైన మాటకే సమయపాలన మిత్రులారా ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉందో వాడు కాదు ఎవరి దగ్గర అయితే సమయం ఉందో వాడు మీరు పోగొట్టుకున్న డబ్బును సంపాదించగలరు.
(13:10) కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందగలరు. కానీ గడిచిపోయిన ఒక్క సెకను కూడా మీరు ప్రపంచంలో ఉన్న ఆస్తినంతా ఇచ్చినా తిరిగి కొనలేరు. సమయాన్ని వృధా చేయడం అంటే మీ జీవితాన్ని మీరు ఆత్మాహుతి చేసుకోవడమే. చాలా మంది అంటారు నాకు టైం లేదు అని కానీ గుర్తుంచుకోండి అగ్రరాజ్య అధినేతకైనా సామాన్య మానవుడికైనా ప్రకృతి ఇచ్చేది రోజుకు కేవలం 24 గంటలు మాత్రమే విజేత ఆ 24 గంటలను పెట్టుబడిగా మారుస్తాడు బలహీనుడు అదే 24 గంటలను కాలక్షేపం అనే మంటలో తగలబెట్టేస్తాడు.
(13:46) శ్రీకృష్ణుడు భగవద్గీతలో తనను తాను కాలోస్మి నేనే కాలన్ని అని చెప్పుకున్నారు. కాలం ఎవరి కోసం ఆగదు ఎవరికీ తలవంచదు అది నిరంతరం ప్రవహించే నది మీరు ఆ ప్రవాహంతో పాటు పయణిస్తూ మీ పని పూర్తి చేయాలి. కాలం విలువ తెలియని వాడికి దైవం విలువ కూడా తెలియదు. కృష్ణుడు వర్జనుడికి గీతను బోధించింది కూడా యుద్ధభూమిలో అత్యంత కీలకమైన సమయంలోనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే చరిత్ర నిన్ను క్షమించదు.
(14:16) ఒక్కసారి ఆలోచించండి మీరు మీ సమయాన్ని దేనికి ఖర్చు చేస్తున్నారు పనికిరాని కబుర్లకా లేక సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి స్క్రోల్ చేయడానిక మీరు సమయాన్ని వృధా చేస్తున్నామ అనుకుంటారు. కానీ నిజానికి సమయమే మిమ్మల్ని వృధా చేస్తోంది. గడిచిపోయిన ప్రతి నిమిషం మీ ఆయుష్యు నుండి కరిగిపోతోంది. రేపు చేద్దాంలే అనుకునే ప్రతి ఆలోచన మీ విజయానికి మీరు కొట్టుకుంటున్న గోరి.
(14:41) మిత్రులారా సమయం అనేది ఒక ఆయుధం దాన్ని సరిగ్గా వాడితే నీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు లేదంటే అది నిన్నే గాయపలుస్తుంది. ప్రతి ఉదయం మీకు 86,400 సెకండ్ల బహుమతి లభిస్తుంది. దాన్ని ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి. కాలాన్ని చంపకండి. దాన్ని జీవించండి. నీ సమయం ఎక్కడ ఖర్చువుతుందో అక్కడ నీ భవిష్యత్తు తయారవుతుంది.
(15:09) నువ్వు కాలాన్ని గౌరవిస్తే కాలం నిన్ను ప్రపంచం గౌరవించేలా చేస్తుంది. నేర్చుకునే తత్వం మిత్రులారా ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరికైతే నాకు అంతా తెలుసు అని అహంకారం ఉంటుందో వాడు. ఏ రోజైతే మీరు నేర్చుకోవడం ఆపేస్తారో ఆ రోజే మీ ఎదుగుదల ఆగిపోతుంది. జ్ఞానం అనేది ఒక అనంతమైన సముద్రం. మనం అందులో ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళం మాత్రమే నేర్చుకునే తత్వం ఉన్నవాడు ఎప్పుడూ నవయువకుడిలా ఉత్సాహంగా ఉంటాడు.
(15:41) అదే నేర్చుకోవడం ఆపేసినవాడు బ్రతికుండగానే ముసలివాడైపోతాడు. చాలామంది ఒక డిగ్రీ రాగానే లేదా ఒక స్థాయికి చేరగానే నేను నేర్చుకోవాల్సింది ఇంకేముంది అనుకుంటాడు. కానీ గుర్తుంచుకోండి మీరు నేర్చుకున్నది ఘోరంతా నేర్చుకోవాల్సింది కొండంతా. అహంకారం తలకెక్కే కొద్దీ కొత్త విషయాలు లోపలికి వెళ్ళడానికి చోటు ఉండదు. భగవంతుడైన శ్రీకృష్ణుడే సాందీపని మహర్షి ఆశ్రమంలో ఒక సామాన్య విద్యార్థిగా ఉండి 64 విద్యలను నేర్చుకున్నారు.
(16:11) ఆయనకు తెలియనిది ఏముంది అయినా లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఆయన విద్యార్థిగా మారారు. నేర్చుకోవడంలో సిగ్గుపడకూడదు అహంకారం చూపించకూడదు అని ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. జ్ఞానం ఉన్నచోట వినయం ఉండాలి. గర్వం ఉన్నచోట జ్ఞానం నిలవదు. నిండిన పాత్రలో మీరు ఎన్ని నీళ్లు పోసినా అవి బయటకి వెళ్ళిపోతాయి. అలాగే నాకు అంతా తెలుసు అనుకునే మెదడులోకి ఏ కొత్త ఆలోచన వెళ్ళదు.
(16:40) మీరు నేర్చుకోవాలంటే ముందు మీ పాత్రను ఖాళీ చేసుకోవాలి. ఎదుటివాడు చిన్నవాడైనా పెద్దవాడైనా వారి నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. చీమ నుండి క్రమశిక్షణను సూర్యుడి నుండి క్రమబద్ధతను పక్కన ఉన్న శత్రువు నుండి కూడా వాడి వ్యూహాలను నేర్చుకోవచ్చు. మిత్రులారా కాలం మారుతోంది టెక్నాలజీ మారుతోంది. మారే కాలంతో పాటు మీరు కూడా కొత్త విషయాలను నేర్చుకోకపోతే చరిత్రలో ఒక పాత జ్ఞాపకంలా మిగిలిపోతారు.
(17:08) నీ అపజయాల నుండి పాఠాలు నేర్చుకో నీ విజయాల నుండి వినయాన్ని నేర్చుకో ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు కనీసం ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. నేర్చుకోవాలనే ఆకలి నీలో ఉన్నంత కాలం నిన్ను [సంగీతం] ఓడించే శక్తి ఈ ప్రపంచంలో పుట్టలేదు. జ్ఞానమే నిజమైన శక్తి అపజయాలు మిత్రులారా మనం గెలవాలని కోరుకోవడంలో తప్పు లేదు కానీ ఓడిపోతామని భయపడటమే అసలైన తప్పు ఈ ప్రపంచంలో ఓటమిని చవి చూడకుండా శిఖరాన్ని చేరిన వారు ఎవ్వరూ లేరు.
(17:43) అపజయం అనేది నీ ప్రయాణానికి ముగింపు కాదు. అది నీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రకృతి నీకుఇచ్చిన ఒక అవకాశం. కింద పడటం తప్పు కాదు కానీ పడిపోయిన చోటే సాకులు వెతుక్కుంటూ ఉండిపోవడం [సంగీతం] అతి పెద్ద నేరం. చాలామంది ఒకసారి ఓడిపోగానే ఇక నా వల్ల కాదు నా తలరాత ఇంతే అని చేతులు ఎత్తేస్తారు. కానీ గుర్తుంచుకోండి. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత దగ్గరలో ఉన్నట్టు. నీ ఓటమి నిన్ను బలహీన పరచకూడదు.
(18:13) అది నిన్ను మరింత రాటుదేలేలా చేయాలి. శ్రీకృష్ణుడిని అందరూ రణచోడ్ అని ఎగతాళి చేసినప్పుడు ఆయన కుంగిపోలేదు. రణచోడనే నిలబడటం అనేది కృష్ణుడికి ఓటమి కాదు. అది ఒక పెద్ద విజయానికి ఆయన వేసిన వ్యూహం. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వేయడం అంటే పారిపోవడం కాదు. 10 అడుగులు ముందుకు దూకడానికి సిద్ధమవ్వడం. ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించడం నేర్చుకో ఎందుకంటే నువ్వు ఓడిపోయినప్పుడే నీ అసలైన మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో నీకు తెలుస్తుంది.
(18:47) థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ముందువెయి సార్లు విఫలమయ్యారు. ఆయన ఏమన్నారో తెలుసా? నేను వెయి సార్లు ఓడిపోలేదు. బల్బు వెలగడానికి పని చేయనివెయి మార్గాలను కనుగొన్నాను అని అదే విజేతకు ఉండే లక్షణం. ప్రతి ఓటమి నీకుొక పాఠాన్ని నేర్పుతుంది. ఆ పాఠాన్ని చదివినవాడు విజేత అవుతాడు. ఆ పాఠాన్ని చూసి భయపడినవాడు పరాజితుడు అవుతాడు. మిత్రులారా అపజయం అనేది నిన్ను ఆపే గోడ కాదు అది నువ్వు ఎక్కాల్సిన మెట్టు నీ కష్టాన్ని నీ శ్రమను నమ్ముకో నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావు అన్నది ముఖ్యం కాదు.
(19:24) ఎన్నిసార్లు తిరిగి లేచి నిలబడ్డావు అన్నదే నీ చరిత్రను రాస్తుంది. ఇప్పటి నుండి ఓటమికి భయపడకండి. అపజయాలను ధైర్యంగా ఆహ్వానించండి. ఎందుకంటే గెలుపు నీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే ఓటమి నీకు నిన్ను పరిచయం చేస్తుంది. నీ ఓటమిని విజయానికి ఇంధనంగా మార్చుకో సంతోషం మిత్రులారా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి దేనికోసం పరిగెట్టుతున్నారో తెలుసా? సంతోషం కోసం ఎవరైనా కష్టపడుతున్నారన్నా డబ్బు సంపాదిస్తున్నారన్నా పదవుల కోసం పాకులాడుతున్నారన్నా చివరికి వారికి కావాల్సింది ఒక చిన్న సంతోషం కానీ విచిత్రం ఏమిటంటే అందరూ ఆ సంతోషాన్ని బయటి వస్తువుల్లోనో మనుషుల్లోనో వెతుకుతున్నారు. అందుకే ఒక
(20:11) వస్తువు రాగానే కాసేపు సంతోషించి అది పాతబడగానే మళ్ళీ [సంగీతం] అశాంతిలో మునిగిపోతున్నారు. గుర్తుంచుకోండి సంతోషం అనేది ఒక గమ్యం కాదు అదొక ప్రయాణం అది బయట దొరికే వస్తువు కాదు అది మీ లోపల ఉండాల్సిన ఒక మానసిక స్థితి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్పారు. నాస్తి బుద్ధిర యుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయతః శాంతిర శాంతస్య కుతః సుఖం అంటే ప్రశాంతత లేని వాడికి సంతోషం ఎక్కడి నుండి వస్తుంది మీరు కోట్లు సంపాదించినా ప్రపంచమంతా మీ పాదాక్రాంతమైన మీ మనసు ప్రశాంతంగా లేకపోతే మీరు సంతోషంగా
(20:57) ఉండలేరు. సంతోషానికి కావాల్సింది పెద్ద పెద్ద బంగళాలు కాదు నిర్మలమైన హృదయం సంతోషం అంటే అన్ని ఉండటం కాదు ఉన్నదానితో తృప్తిగా ఉండటం మీ దగ్గర ఉన్న చిన్న వస్తువును చూసి మీరు ఆనందించలేకపోతే రేపు విలాసవంతమైన కారు వచ్చినా మీరు సంతోషించలేరు. ఎందుకంటే సంతోషం అనేది మీ అలవాటులో ఉండాలి. బయటి పరిస్థితులు మీ సంతోషాన్ని నిర్ణయించేలా మీరు అనుమతి ఇస్తే మీరు ఎప్పటికీ ఇతరుల చేతుల్లో బొమ్మలాగే మిగిలిపోతారు.
(21:32) వాడు పొగిడితే నవ్వడం వాడు తిడితే ఏడవడం ఇదేనా మీ జీవితం మిత్రులారా నీ సంతోషం అనే తాళం చెవిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో నీ లోపల ఉన్న ఆనంద నిధిని కనుగను పరిస్థితులు ఎలా ఉన్నా నీ ముఖం మీద ఆ చిరునవ్వు చెక్కు చెదరకూడదు అదే అసలైన విజయం ఎదుటివాడు నీ ఆస్తిని లాక్కోగలడు నీ పదవిని తీసేయగలడు కానీ నీ మనసులో ఉన్న సంతోషాన్ని దొంగిలించే శక్తి ఎవరికీ లేదు.
(22:02) ఇప్పటి నుండి ఒక నిర్ణయం [సంగీతం] తీసుకోండి. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతకండి. ప్రవహించే గాలిలో కురిసే వానలో పలకరించే మిత్రుడిలో సంతోషాన్ని అనుభవించండి. నువ్వు సంతోషంగా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అందంగా కనిపిస్తుంది. ఏకాగ్రత మిత్రులారా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏంటో తెలుసా? అది అణుబాంబు కాదు అది మీ ఏకాగ్రత సూర్య కిరణాలు ఒకేచోట కేంద్రీకృతమైతే కాగితాన్ని కాల్చేస్తాయి.
(22:39) ప్రవహించే నీరు ఒకే చోట కేంద్రీకృతమైతే కొండలను కూడా తొలిచేస్తాయి. అలాగే మీ ఆలోచనలు చెల్లాచెదురుగా కాకుండా ఒకే లక్ష్యం మీద కేంద్రీకృతమైతే ఈ భూమి మీద మీరు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. చాలామంది అడుగుతారు నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ నాకు ఫలితం రావడం లేదఎందుకు అని దానికి కారణం మీ కష్టంలో లోపం కాదు మీ ఏకాగ్రతలో ఉన్న లోపం మీరు పని చేస్తున్నప్పుడు మీ శరీరం అక్కడ ఉంటుంది. కానీ మీ మనసు ఎక్కడో ఉంటుంది.
(23:13) ఇలాంటి అరకొర ప్రయత్నాలతో విజయం రాదు. గుర్తుంచుకోండి ద్రోణాచార్యుడు పక్షిని గురి చూడమన్నప్పుడు అందరికీ ఆకాశం కనిపించింది చెట్టు కనిపించింది పక్షి కనిపించింది. కానీ ఒక్క అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది. కృష్ణుడు అర్జునుడికి ప్రియ శిష్యుడు అవ్వడానికి కారణం కూడా ఆ ఏకాగ్రతే యోగస్తః కురుకర్మాణి అంటే పరమాత్మలో మనసును లగ్నం చేసి పని చేయమని కృష్ణుడు బోధించారు.
(23:46) నీ పనిలో నువ్వు లీనమైపోయినప్పుడు ఆ పని ప్రార్థనగా మారుతుంది. మీ ఏకాగ్రతను దొంగిలించడానికి ఈ రోజుల్లో వేల కొద్ది డిస్ట్రాక్షన్స్ సిద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా నోటిఫికేషన్లు అనవసరమైన కబుర్లు గతపు జ్ఞాపకాలు ఇవన్నీ మీ విజయానికి అడ్డుపడే గోడలు గుర్రం కళ్ళకు కట్టినట్టుగా మీ దృష్టి కేవలం గమ్యం మీద మాత్రమే ఉండాలి.
(24:13) పక్కన ఏం జరుగుతోందో ఎవరు ఏమంటున్నారో మీకు వినబడకూడదు. కేవలం మీ లక్ష్యం మాత్రమే మీకు కనిపించాలి. మిత్రులారా పని మీద ధ్యాస లేనివాడు నిద్రలో నడిచే వాడితో సమానం. మీరు చదువుతున్న పని చేస్తున్న లేదా ప్రార్థిస్తున్న మీ మొత్తం శక్తిని ఆ క్షణంలోనే పెట్టండి. ఏకాగ్రత అనేది ఒక కండరం లాంటిది. దాన్ని ప్రతి రోజు సాధన చేయాలి.
(24:41) ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి 10 పనులు ఒకేసారి చేయడం గొప్ప కాదు ఒకే పనిని పరిపూర్ణమైన ఏకాగ్రతతో చేయడం గొప్ప అర్జునుడి లాంటి ఏకాగ్రతను అలవరుచుకోండి అప్పుడు మీరు సంధించిన ప్రతి బాణం లక్ష్యాన్ని తాకుతుంది. మీ ఏకాగ్రతే మీ గెలుపును శాసిస్తుంది. సహనం మిత్రులారా ఈ ఆధునిక ప్రపంచంలో మనకు అన్నీ వెంటనే కావాలి. ఒక బటన్ నొక్కగానే ఆహారం రావాలి.
(25:13) ఒక క్లిక్ చేయగానే సమాచారం రావాలి. కానీ జీవితంలో విజయం మాత్రం అలా రాదు. ప్రకృతిలో ఏ అద్భుతమైన కార్యమైనా జరగడానికి సమయం పడుతుంది. ఒక విత్తనం మహా వృక్షం కావాలన్నా ఒక పిండం శిశువుగా మారాలన్నా సహనం తప్పనిసరి. ఓపిక లేనివాడు సగం విజయం సాధించి గమ్యం దగ్గరకు రాగానే వెనుదిరిగే బలహీనుడు చాలామంది అడుగుతారు నేను ఎంతో శ్రమిస్తున్నాను కానీ ఫలితం రావడం లేదు ఇంకెంతకాలం వేచి చూడాలి అని గుర్తుంచుకోండి మీరు వేసే ప్రతి అడుగు మీరు పడే ప్రతి చెమట చుక్క లెక్కించబడుతుంది.
(25:54) కానీ అది పండడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చేవరకు వేచి ఉండడమే అసలైన వీరుడి లక్షణం. శ్రీకృష్ణుడు పాండవులకు నేర్పిన అతి పెద్ద పాఠం ఇదే 13 ఏళ్ల వనవాసం అజ్ఞాతవాసం అవమానాలు కష్టాలు భీముడు అర్జునుడు ఒక్క క్షణంలో శత్రువులను తుదముట్టించగలరు. కానీ కృష్ణుడు వారిని ఆపాడు. ఎందుకంటే ధర్మం గెలవాలంటే సరైన సమయం రావాలి.
(26:28) సహనం అంటే చాతకానితనం కాదు అది లోపల యుద్ధానికి [సంగీతం] సిద్ధమవుతూ బయట ప్రశాంతంగా ఉండటం శ్రీకృష్ణుడు అందుకే అంటారు కాలః కలయతామహం కాలాన్ని శాసించేవాడిని నేనే కానీ ఆ కాలనిచ్చే ఫలితం కోసం నువ్వు ఓపిక పట్టాలి. ఒక రాయిపై 100 దెబ్బలు వేసినప్పుడు అది పగలకపోవచ్చు కానీ 101వ దెబ్బకు అది ముక్కలవుతుంది. [సంగీతం] అంటే ముందు వేసిన 100 దెబ్బలు వృధ అయినట్టు కాదు అవి ఆ రాయిని బలహీనపరిచాయి.
(27:01) మీ ప్రయత్నం కూడా అంతే మీరు ఓడిపోతున్న ప్రతిసారి గెలుపుకు దగ్గర అవుతున్నారు. సహనం అనేది చేదుగా ఉండవచ్చు కానీ దాని ఫలితం మాత్రం చాలా తీయగా ఉంటుంది. మిత్రులారా తొందరపాటు అనేది అపజయానికి తొలిమెట్టు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఓపిక లేక వదిలేసే పనులు నిన్ను జీవితాంతం పశ్చాత్తాపానికి గురి చేస్తాయి. సముద్రం అలలు ఎగసి పడినా అది తన హద్దులను దాటదు.
(27:32) నీవు కూడా అంతే స్థిరంగా ఉండాలి. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి. పని చేయడం నీవంతు అది ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వాలో నిర్ణయించడం కాలం వంతు నీ శ్రమ మీద నీకు నమ్మకం ఉంటే ఆ ఓపికే నిన్ను విజేతగా నిలబెడుతుంది. గుర్తుంచుకోండి నిరీక్షణలో ఉన్న శక్తి ఆవేశంలో లేదు. నీ చుట్టూ ఉన్న మనుషులు మిత్రులారా మీరెంత గొప్పవారైనా ఎంత మేధావైనా మీ చుట్టూ ఉన్న మనుషులు సరైనవారు కాకపోతే మీరు పతనం అవ్వడం ఖాయం.
(28:09) ఒక సామెత ఉంది నువ్వు ఎవరితో తిరుగుతున్నావో చెప్పు నువ్వు ఎలాంటి వాడివో నేను చెబుతాను అని మీ ఆలోచనలు మీ అలవాట్లు మీ ఆశయాలు ఇవన్నీ మీరు ఎవరితో సమయాన్ని గడుపుతున్నారో వారిని బట్టే తయారవుతాయి. నీ చుట్టూ ఉన్న ఐదుగురు మిత్రుల సగటు వ్యక్తిత్వమే నీవు చాలామంది అంటారు నేను మారను వాడు ఎలాంటి వాడైతే నాకేంటి అని కానీ గుర్తుంచుకోండి గంధపు చెక్క పక్కన ఉన్న కర్రకు కూడా సువాసన వస్తుంది.
(28:40) అదే మురికి గుంట పక్కన ఉన్న పూల మొక్క కూడా కంపు కొడుతుంది. సాంగత్యం అనేది ఒక అంటు వ్యాధి లాంటిది. అది తెలియకుండానే మీ రక్తంలోకి ఎక్కుతుంది. మహాభారతంలో దుర్యోధనుడు పుట్టుకతోనే చెడ్డవాడు కాదు కానీ వాడికి తోడైన శకుని ఆలోచనలు వాడిని వినాశనం వైపు నడిపించాయి. అదే అర్జునుడికి శ్రీకృష్ణుడి సాంగత్యం దొరికింది కాబట్టి యుద్ధభూమిలో కూడా ధర్మం వైపు నిలబడగలిగాడు.
(29:08) నీ చుట్టూ ఉన్నవారు శకునిలాగా నిన్ను పతనం చేస్తున్నారా లేక కృష్ణుడిలాగా నిన్ను ఉద్ధరిస్తున్నారా అన్నది నువ్వే చూసుకోవాలి. నీ స్నేహితులు నిన్ను తప్పుడు పనులకు ప్రోత్సహిస్తున్నారంటే వారు నీ మిత్రులు కాదు నీ ఎదుగుదలకు అడ్డుపడే శత్రువులు నీకంటే మేధావులు నీకంటే క్రమశిక్షణ గల వ్యక్తుల మధ్య నువ్వు ఉంటే నువ్వు కూడా వారిలాగే మారతావు.
(29:32) కానీ ఎప్పుడూ నిన్ను విమర్శించేవారు బద్ధకస్తులు నెగిటివ్ మనుషుల మధ్య ఉంటే నీలో ఉన్న వెలుగు కూడా మెల్లగా ఆరిపోతుంది. నీ సమయం చాలా విలువైంది. దాన్ని ఎవరికో ఇచ్చి వృధా చేయకండి. మీకు ప్రేరణ ఇచ్చే మనుషులను మీకు నిజం చెప్పే మనుషులను దగ్గరకు చేర్చుకోండి. మిత్రులారా ఒంటరిగా ఉండటం ఎప్పుడూ నష్టం కాదు కానీ తప్పుడు మనుషుల మధ్య ఉండటం మాత్రం మరణంతో సమానం.
(29:58) నీ సర్కిల్ ను మార్చుకో నీ జీవితం తనంతట అదే మారుతుంది. నీ స్థాయికి తగని మనుషులకు దూరంగా ఉండటం అహంకారం కాదు అది నీ ఆత్మ గౌరవం. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి. నీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల నువ్వు మంచివాడిగా మారుతున్నావా లేక నీ సంస్కారాన్ని కోల్పోతున్నావా అని ఆలోచించండి. మంచి సాంగత్యమే నీ విజయానికి తొలిమెట్టు కృతజ్ఞత మిత్రులారా ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రార్థన ఏంటో తెలుసా? అది కోరికలు కోరడం కాదు ధన్యవాదాలు చెప్పడం.
(30:36) దీనినే కృతజ్ఞత అంటారు. చాలామంది మన దగ్గర లేని వాటి గురించి ఏడుస్తూ ఉన్నవాటి విలువను మర్చిపోతుంటారు. మీరు లేని దాని గురించి బాధపడుతున్నంత కాలం మీ జీవితంలోకి కొత్తది ఏదీ రాదు. కానీ మీ దగ్గర ఉన్న చిన్న విషయానికి కూడా మీరు ఎప్పుడైతే కృతజ్ఞతతో ఉంటారో అప్పుడు ప్రకృతి మీకు మరిన్ని అద్భుతాలను ప్రసాదిస్తుంది. కృతజ్ఞత అనేది కేవలం ఒక పదం కాదు.
(31:06) అది ఒక జీవన విధానం మీకు ఈరోజు తిండి దొరికిందా కృతజ్ఞత చెప్పండి. మీకు నివాసం ఉందా కృతజ్ఞత చెప్పండి. మీ శరీరం ఆరోగ్యంగా ఉందా? కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే మీరు అనుభవిస్తున్న ఈ జీవితం కూడా కోట్లాది మందికి ఒక కల మాత్రమే. శ్రీకృష్ణుడు కుచేలుడి కథ ద్వారా మనకు నేర్పింది ఇదే. కుచేలుడు తెచ్చిన ఆ పిడికెడు అటుకులలో ఉన్నది సంపద కాదు అనంతమైన కృతజ్ఞత.
(31:34) ఆ చిన్న కానుకను చూసి కృష్ణుడు మురిసిపోయి కుచేలుడికి అష్టైశ్వర్యాలను ప్రసాదించారు. భగవంతుడికి కావాల్సింది మీ ఆస్తులు కాదు మీ హృదయంలో ఉన్న కృతజ్ఞత భావం పత్రం పుష్పం ఫలం తోయం అంటే నువ్వు భక్తితో ఒక ఆకు ఇచ్చినా నేను స్వీకరిస్తాను అని కృష్ణుడు చెప్పిన మాట వెనుక ఉన్న అర్థం ఇదే కృతజ్ఞత ఉన్నచోట అసూయ ఉండదు కోపం ఉండదు అశాంతి ఉండదు.
(32:04) మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీ మెదడులో డోపమైన్ అనే సంతోషకరమైన రసాయనం విడుదల అవుతుంది. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే మీకు ఉన్న మూడు మంచి విషయాల గురించి ఆలోచించండి. నేను బ్రతికున్నాను నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను నన్ను ప్రేమిస్తున్న మనుషులు ఉన్నారు. ఈ ఆలోచన మీ రోజంతా పాజిటివ్ గా ఉండేలా చేస్తుంది.
(32:30) మిత్రులారా ఇప్పటి నుండి ఒక అలవాటు చేసుకోండి. మీకు సహాయం చేసిన వారికి మీకు పాఠం నేర్పిన వారికి కనీసం మీకు ప్రాణవాయువునిస్తున్న ఈ ప్రకృతికి కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత గల హృదయం ఎప్పుడూ దైవత్వానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకోండి. లేని వాటి గురించి కన్నీళ్లు పెట్టకండి. ఉన్నవాటిని దీవెనలుగా భావించండి.
(32:57) మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే మీ జీవితం అంత ఐశ్వర్యవంతంగా మారుతుంది. మిత్రులారా మనం ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేశాం. మౌనం నుండి మొదలుపెట్టి భయాన్ని జయించి బద్ధకాన్ని వదిలి కృతజ్ఞత వరకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కానీ ఈ పాఠాలన్నీ వింటే సరిపోదు. వీటిని మీ జీవితంలో ఆచరించినప్పుడే ఈ ప్రయాణానికి ఒక అర్థం ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు ఈ సమాజం మారదు.
(33:25) ఈ లోకం ఇంతే నేను ఒక్కడిని మారితే ఏం జరుగుతుంది అని కానీ గుర్తుంచుకోండి. ఒక చిన్న దీపం వెలిగితే చీకటి భయపడుతుంది. ఆ దీపం నీవు కావాలి. లోకం మారడం అంటే కోట్లాది మంది ఒక్కసారిగా మారిపోవడం కాదు నువ్వు మారడం నీ ఆలోచన మారడం నీ ప్రవర్తన మారడం ఇదే లోకం మారడానికి తొలి అడుగు భగవద్గీత చివరిలో కృష్ణుడు అర్జునుడికి అంతా చెప్పాక ఒక మాట అంటారు.
(33:55) యథేచ్చసి తథా కురు అంటే నీకు ఏది సరైనది అనిపిస్తే అది చెయి భగవంతుడు కూడా నీకు దారి చూపిస్తాడు తప్ప నీ అడుగును ఆయన వేయడు నీ జీవితాన్ని చెక్కుకోవలసిన శిల్పివి నీవే నీ లోపల ఉన్న దైవత్వాన్ని నువ్వు గుర్తించిన రోజు నువ్వుఒక సామాన్య మనిషివి కాదు నువ్వు ఒక శక్తివి నీ ఎదుగుదలే నీవు ఈ ప్రపంచానికి ఇచ్చే అతి పెద్ద సందేశం. మిత్రులారా ఇది కేవలం ఆరంభం మాత్రమే రేపు మళ్ళీ నీ లోపల బద్ధకం రావచ్చు మళ్ళీ నిన్ను ఎవరో అవమానించవచ్చు మళ్ళీ నీకు భయం కలగవచ్చు కానీ అప్పుడు ఈ 15 సూత్రాలను గుర్తు తెచ్చుకో నీ వెనుక ఒక కృష్ణ తత్వం ఉందని నీ మనసును నువ్వు గెలవగలవని నమ్ము నిన్ను నువ్వు గెలిచిన
(34:38) రోజు నీకు ఏ శత్రువు ఉండడు ఎందుకంటే నువ్వు అందరిలో నిన్ను చూసుకుంటావు. నీవు మారితే నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే ఈ దేశం మారుతుంది. ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలి. ఇతరుల తప్పులను వెతకడం మానేసి నీలోని గొప్పతనాన్ని వెలికితీయి. నీవు ఒక విజేతగా నిలబడినప్పుడు నీ నీడలో వేల మందికి ఆశ్రయం దొరుకుతుంది.

No comments:

Post a Comment