మిస్-కమ్యూనికేషన్: బంధాలు తెగే ప్రమాదం!| SHIVA CHANDANA |SQUARE TALKS |
Author Name:Shiva Chandana
Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27
Youtube Video URL:https://www.youtube.com/watch?v=C2HljjEZuQ8
Transcript:
(00:12) హలో నేను చందన ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదిఏంటంటే సహజంగా మనం కాన్వర్సేషన్స్ చేస్తున్నప్పుడు రకరకాల విషయాలు మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఏదైనా ఒక ఒపీనియన్ చెప్పడం గానీ ఒక విషయం గురించి మన కామెంట్ చేయడం గానీ అట్లా రకరకాలుగా చాలా వర్డ్స్ యూస్ చేస్తుంటాము చాలా కామెంట్స్ చేస్తుంటాం సెంటెన్స్ మాట్లాడుతుంటాము ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే మనం చెప్పేదే ఎదుటి వాళ్ళకి ఎగజాక్ట్ గా కమ్యూనికేట్ అవ్వాలని లేదన్నమాట కొన్నిసార్లు మనం చెప్పింది వేరే రకంగా కూడా కమ్యూనికేట్ అవుతుంది. రీసెంట్ గా ఒక
(00:49) కేస్ లో ఏమైందంటే ఆ ఒక వ్యక్తి తను డేటింగ్ యప్స్ యూస్ చేస్తున్నారు. ఒక డేటింగ్ వెబ్సైట్ లో ఎంటర్ అయ్యాక రకరకాల ప్రొఫైల్స్ వచ్చాయన్నమాట. అందులో ఒక అమ్మాయి ప్రొఫైల్ లో కాంట్రవర్షియల్ గా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేవాళ్ళ అంటే ఇష్టము అలా నాతో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి అంటే సహజంగా ఈ డేటింగ్ యప్స్ ఎలా ఉంటాయంటే దానిలో మనం ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు కొంత బయో రాస్తారు.
(01:15) అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి ఏమ ఇష్టం ఏంటి వాళ్ళ ప్రిఫరెన్సెస్ అలా కొంత బయో ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ లో ఆ అమ్మాయి నాకు కాంట్రవర్షియల్ గా మాట్లాడే వాళ్ళంటే ఇష్టము అని చెప్పి మెన్షన్ చేసింది. కాంట్రవర్షియల్ గా మాట్లాడే వాళ్ళంటే ఇష్టము అని తను మెన్షన్ చేసింది కాబట్టి ఆ అమ్మాయికి ఆ అమ్మాయితో కాన్వర్సేషన్ చేయాలి అంటే నేనేదో కాంట్రడిక్ట్ చేస్తూ తన మాటల్ని తెల తన ఐడియాలజీని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడాలేమో అని ఈ అబ్బాయి అనుకొని తన ప్రొఫైల్ మొత్తం చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ తన పూల ఇమేజెస్ బొమ్మలు ఉంటాయి కదా అవి ఎక్కువ ఫ్లవర్స్ వి అలా పెడుతూ
(01:54) వచ్చింది. ఎక్కువ ఫ్లవర్స్ ఇమేజ్ ఉండేటప్పటికి తన ప్రొఫైల్ లో అతను ఏమన్నాడంటే ఫ్లవర్స్ే పెడతారా ఫ్లవర్స్ ఇచ్చిన వాళ్ళ గురించి ఏమి మీరు మాట్లాడరా అని చెప్పి తను మెసేజ్ చేశడఅన్నమాట వెంటనే తనంది మీరు ఇంత ఏజ్ వచ్చింది 31 ఇయర్స్ వచ్చాయి ఇంత ఏజ్ వచ్చాక కూడా మీరు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యూస్ చేసుకొని నేను ఇక్కడ చదివాను అక్కడ చదివాను అని చెప్పి మాట్లాడుతున్నారు అంటేనే మీరు ఏంటో తెలుస్తుంది అది ఇది అని చెప్పి ఒక రెండు మాటలు మాట్లాడేసి అక్కడితో ఇంకా అమ్మాయి క్లోజ్ చేసేసింది.
(02:26) అయితే ఇక్కడ ప్రాబ్లం్ ఏమవచ్చిందంటే అతనికి అర్థం కాలేదు. తను మెన్షన్ చేసింది కదా తన ప్రొఫైల్ లో తను మెన్షన్ చేసింది కదా కాంట్రవర్షియల్ గా మాట్లాడమని నేను అలాగే కదా మాట్లాడాను అని చెప్పి తను డౌట్ ఎక్స్ప్రెస్ చేశారన్నమాట ఇక్కడ కాంట్రవర్షియల్ గా మాట్లాడు మాట్లాడితే నాకు ఇష్టము అని అమ్మాయి చెప్పింద చెప్పిన వర్డ్ కి అర్థం నా గురించి కాంట్రడిక్ట్ గా మాట్లాడండి అని కాదు కదా సో ఈ డిఫరెన్సియేషన్ అనేది అతనికి అర్థం కాలేదు అలా అర్థం కాకపోవటం వల్ల ఏంటి తను ఆ అమ్మాయి బయో మీద కాంట్రడిక్ట్ చేస్తూ తను మాట్లాడారు.
(03:03) అట్లా మాట్లాడటం వల్ల తను వెంటనే కోపం వచ్చింది వెంటనే అక్కడతో కాన్వర్సేషన్ కట్ చేసుకుంది అన్నమాట. సో మన రియల్ ఇంటరాక్షన్స్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సహజంగా ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిందే కదా నేను చేశాను లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసినప్పుడు వాళ్ళు అడిగితేనే కదా నేను వాళ్ళు చెప్పమంటేనే కదా నేను వాళ్ళలో తప్పు చెప్పాను అయినా కూడా వాళ్ళు ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మనం వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఎందుకు అది ప్రాక్టికల్ గా వర్క్ అవ్వదు అని అలాగే మన కాన్వర్సేషన్స్ లో మనం మాట్లాడిందే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాల్సిన అవసరం
(03:40) లేదు ఇక్కడ అబ్బాయి పూలు ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడరా అనిఅంటే ఆ అమ్మాయి అది అఫెన్సివ్ గా తీసుకుంది అంటే నేనేదో చాలా మందితో రిలేషన్ పెట్టుకుంటే పెట్టుకునే దానిలాగా ఇతను మాట్లాడుతున్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని తను అఫెన్సివ్ గా ఫీల్ అయింది అన్నమాట. అలా ఫీల్ అవ్వడం వల్ల ఏంటి అతనితో ఎక్కువ మాట్లాడకుండా వెంటనే వితిన్ ఫైవ్ మినిట్స్ లో ఇతని నుంచి మెసేజ్ వెళ్ళిన ఫైవ్ మినిట్స్ లో అతన్ని బ్లాక్ చేసేసింది.
(04:06) అక్కడితో కాన్వర్సేషన్ ఆ అమ్మాయితో కంటిన్యూ అవ్వకుండా కట్ అయిపోయింది. సో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం ఏం చెప్తున్నాము అన్న దానికంటే మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది మనం ఏం కమ్యూనికేట్ చేస్తున్నాము మనం చెప్పిందే అక్కడ కమ్యూనికేట్ అవుతుందా లేదా ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్ కమ్యూనికేట్ అయినప్పుడు మన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళతో అవి చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉంటాయి అన్నమాట అంటే మనం చెప్పింది వాళ్ళక అలా రీచ్ అవ్వాలని అన్నిసార్లు రూల్ లేదు ఒక్కొక్కసారి మనం చెప్పింది వాళ్ళకి వేరే రకంగా కూడా అర్థమయ్యే అవకాశ ఉన్నప్పుడు వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకొని వాళ్ళకు
(04:44) అర్థమైన దాని నుంచే రెస్పాండ్ అవుతారు తప్ప మనం ఏం ఫీల్ అయి చెప్పాము అన్న దాని నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో మనం ఈ క్లారిటీ పెంచుకొని వీలైనంత వరకు ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏం కమ్యూనికేట్ అవుతుంది అనేదాన్ని బేస్ చేసుకొని మాట్లాడినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్ లో గాని సోషల్ రిలేషన్స్ లో గాని ఎదుటి వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అన్న దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే కమ్యూనికేట్ అవ్వకుండా ఉండే అవకాశం పెరుగుతుంది.
(05:14) అలాంటప్పుడు ఏంటంటే మన రిలేషన్ ఏదైతే ఉందో అది కొంత స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంది అలా కాకుండా మనం మనం ఒకటి చెప్తూ వాళ్ళకి ఇంకోటి కమ్యూనికేట్ అవుతున్నప్పుడు ఏంటంటే తెలియకుండానే ఆ రిలేషన్ ఏదో ఏదో ఒక పాయింట్లో అది బ్రేక్ అవ్వడం లేదంటే వాళ్ళు అఫెన్సివ్ గా ఫీల్ అవ్వడం లేదా వాళ్ళు హట్ అయి మీ నుంచి దూరం జరగడం వీళ్ళు ఇలా మాట్లాడుతారు అని అందరికీ స్ప్రెడ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరగకుండా మనం చూసుకోవాలి అంటే వీల లేనంత వరకు మన కాన్వర్సేషన్స్ లో మనం ఏం మాట్లాడుతున్నాము అన్న దాంతో పాటు మనం మాట్లాడింది అవతల
(05:52) వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అయింది మనం చెప్పిందే వాళ్ళు అర్థం చేసుకున్నారా లేకపోతే మనం చెప్పిన దాన్ని వేరేగా వాళ్ళు అర్థం చేసుకున్నారా అన్నది కూడా మనం ఫోకస్ చేసినప్పుడు ఇట్లాంటి డిస్ప్యూట్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. రిలేషన్స్ లో ఎప్పుడూ కూడా కమ్యూనికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక రిలేషన్ ప్రాపర్ గా ఉండాలి అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది ఎంత బెటర్ గా ఇద్దరి మధ్య ఉంటే అంత బెటర్ గా రిలేషన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో కమ్యూనికేషన్ ఇంత కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మన ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ లో వీలైనంత వరకు ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు ఏం
(06:30) చెప్తున్నారు అనే దానితో పాటు మీరు చెప్పింది ఎలా కమ్యూనికేట్ అయింది అనేది కూడా మీరు చూసుకున్నప్పుడు ఏంటంటే రిలేషన్స్ బ్రేక్ అవ్వకుండా లాంగ్ రన్ ఉండే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అండ్ డిస్ప్యూట్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment