*సార్ధకత*
*దేహములోనున్న జీవుడు బయటకు పోయినప్పుడు ఆ దేహము దగ్గరకు రావడానికి భార్యకూడ భయ పడుతుంది.
*మనము ఎంతో ప్రేమగా చూసుకునే భార్యాబిడ్డలు వాకిలివరకే వస్తారు.
*బంధుమిత్రులు వల్లకాటివరకే వస్తారు.
*పరమేశ్వరుడు మనము ఎన్ని జన్మలెత్తినా కూడా మనతో ఉండి ఎప్పుడెప్పుడు మనలను తరింపచేద్దామా అని ఎన్నో ఉపాయములతో నిరంతరం మన వెంట ఉంటున్నాడు.
*ఆ పరబ్రహ్మ మనలను వదలకుండా ఏ దేహము ధరించినా అందులో హృదయవాసిగా ఉంటున్నాడు.
*అటువంటి పరబ్రహ్మను నేడు మనం మరచిపోయి భార్య పిల్లలు, బంధుమిత్రులు, ధనదాన్యాలు, వస్తువాహనాలు ఇవే నిత్యమనుకుని వీటి చుట్టూ తిరుగుతున్నాము.
*ఫలితంగా ఏమెుస్తుంది? అసంతృప్తి, ఆందోళన, అశాంతి.
*దేనిని పట్టుకుంటే జీవితమునకు సార్థకత చేకూరుతుందో దానిని పట్టుకోవాలి. దానినే పొందడానికి సాధన చేస్తుండాలి.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏
No comments:
Post a Comment