Tuesday, December 13, 2022

 ✍️... నేటి చిట్టికథ
   
        
        అనగనగా మంధర అనే నగరాన్ని విజయుడు అనే రాజు పాలిస్తూ ఉండేవారు. విజయుడు పాలనలో సమర్థుడే అయినప్పటికీ చాల అహంకారం కలవాడు. అతనికి ఆస్థానంలో కనక భట్టు అనే తెలివైన మంత్రి ఉండేవాడు. రాజు చాలా సందర్భాలలో నాలాంటి గొప్ప తెలివైన వాడు ఈ రాజ్యంలో ఎవరైనా ఉంటారా? అంటూ మంత్రి తో ఎగతాళిగా నవ్వేవాడు. మంత్రి రాజుగారిపై భయంతో అవును మహారాజ మన రాజ్యంలో మీకంటే తెలివైన వారు ఎవరూ లేరు అనే వాడు . కానీ ఇది మంత్రి కనక భట్టుకు నచ్చేది కాదు. ఎలాగైనా ఈ రాజు అహంకారాన్ని అణచాలని భావించాడు.

        ఓ రోజు దర్బారులో మళ్లీ తన గురించి గొప్పలు చెప్పడం మొదలు పెట్టాడు రాజైన విజయుడు. ఆయన్ని ఎలాగైనా ఈ అలవాటు నుంచి బయటపడేలా చేసి రాజుగారి అహంకారాన్ని తొలగించాలని గట్టిగా భావించాడు కనక భట్టు.

       కనక భట్మటు రాజుతో … రాజుగారు ! మన  సరిహద్దుల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారు. మీరు ఆ ఊరి వారి కంటే తెలివైన వారిగా నిరూపించగలిగితే … మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది కదా . వారెవరూ మీ తెలివికి సరితూగలేరు ’ అన్నాడు మంత్రి.

       దానికి విజయుడు గర్వానికి పోయి …అలానా ! వెంటనే తేల్చుకుంటాను అని  విజయుడు గోపాలపురం బయలుదేరాడు.

       ఆ ఊరి పొలిమేరలో పశువుల కాపరి కనిపించాడు రాజుకి , రాజు అప్పుడు.. ‘నా తెలివితో ముందు వీడిని ఓడిస్తా..’ అనుకుంటూ అతడి దగ్గరికి వెళ్లాడు.

నేను మూడు ప్రశ్నలు అడుగుతా జవాబు చెబుతావా’అని అడిగాడు ఆ పశువుల కాపరిని. దానికి అతడు సరేనన్నాడు

1.ఈ సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది? ‘ గాలి’ చెప్పాడు పశువుల కాపరి.

2.అన్నింటికంటే ఉత్తమమైన జలం ? గంగాజలం అని జవాబు ఇచ్చాడు.

3.అన్నింటికంటే ఉత్తమమైన పాన్పు ఏది ? చందనపు కర్రతో చేసినది అని జవాబిచ్చాడు ఆ కాపరి.
    దానికి విజయుడు. శభాష్ ! నా మనసులో కూడా ఇవే జవాబులు ఉన్నాయి ? నువ్వు నాలా చాలా తెలివైన వాడివే అని ఆ పశువుల కాపరితో అన్నాడు.

      రాజుగారి మాటలకు ఆ పశువుల కాపరి  'హహ్హ హహ్హహ్హ’ అని పగలబడి నవ్వాడు. దానికి విజయుడు...... అతనివైపు ఆశ్చర్యం గా చూస్తూ.....ఏమైంది ? ఎంటా నవ్వు అని కాపరిపై కోపంతో అంటాడు.

      అప్పుడు ఆ కాపరి..క్షమించండి రాజా ! నేను ఇంతకమునుపు మీతో తప్పుగా చెప్పిన జావాబుల్ని మీరు సరైనవి అంటే నాకు నవ్వొచ్చింది అని అంటాడు.

     దానికి విజయుడు ...ఏంటి వీటికి సరైన జవాబులు వేరేవున్నాయా...!? అని అంటాడు రాజు .

దానికి ఆ కాపరి … అవును మహారాజ అంటూ......

1.ఈ సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?–‘ మెదడు ‘

2.అన్నింటికంటే ఉత్తమమైన జలం ?- ‘ ఎడారుల్లో దొరికేది’

3.అన్నింటికంటే ఉత్తమమైన పాన్పు ఏది ? – ‘ అమ్మఒడి ‘

….అని జవాబు ఇచ్చాడు.
        
            పశువుల కాపరి జవాబులతో బుద్ధి తెచ్చుకున్న విజయుడు మనసులో…  ఈ పశువుల కాపరే ఇంత  తెలివైన వాడు అయితే ..ఆ గ్రామ ప్రజలు ఇంకెంత తెలివైన వారు అయింటారో అనుకొని పరాభవంతో బుద్ధి తెచుకొన్నావాడై తన రాజ్యానికి వెనుతిరిగాడు.

🔹🔸🔹🔸🔹🔸🔹

No comments:

Post a Comment