231222a1928. 241222-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀707.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*భక్తులనే వారు - ఎలాంటి గుణములు అలవర్చుకోవాలి???*
*పాముకు రెండు విషపు కోరలు ఉంటాయి!!...*
*ఆ కోరలు ఉన్నంత వరకు అది అందరినీ భయ పెడుతూ, కాటేస్తూ ఉంటుంది!!...*
*ఎప్పుడైతే ఆ రెండు కోరలు పీకేస్తామో అప్పటినుండి అది ఎవరిని భయ పెట్టకుండా ఒక మూలన దాగి ఉంటుంది..!*
*అలాగే… “మనిషి మనసులో కూడా అహంకార మమకారాలు అనే రెండు విషపు కోరలు ఉన్నాయి !!"*
*వీటి వలన మనిషి చేయరాని పనులెన్నో చేస్తూ మోయలేని భారమెంతో మోస్తూ, తనకు, తన చుట్టూ ఉన్న సమాజానికి గొప్ప హానిని తలపెడుతున్నాడు!!*
*దీని వలన అటు సమాజం, ఇటు తాను కూడా చెడిపోయి, నష్టాలపాలు, కష్టాలపాలగుచున్నాడు!!*
*ఇది కూడని పని! *
*ఇట్టి చర్యల వలన మనకు ఉపకారం చేకూరదు!!*
*ఇలా జరగకుండా ఉండాలంటే మనిషి తనలో ఉన్న అహంకార మమకారాలు అనే రెండు కోరల్ని పీకి పారేయాలి!!*
*సహనము, వినయము, విధేయత, ప్రేమ, త్యాగము వంటి గుణాలతో మనసును నింపుకోవాలి!!*
*అప్పుడే మనసు అణిగి మణిగి ఉంటుంది, ఇట్టి స్థితి వలన అటు సమాజానికి , ఇటు మనిషికి లాభం చేకూరుతుంది.*
*అప్పుడు దేశమునకు, ప్రపంచానికి మంగళం కలుగుతుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment