*:::::::::::: పనులు :::::::::::*
మనం రోజూ అనేక పనులు చేస్తూ వుంటాము. అందులో ఆలోచనలు వుంటాయి,
మాటలు చేతలు వుంటాయి,
అలాగే చూస్తూ, వింటూ, తాకుతూ, పీల్చుతూ వుంటాము.
వీటి నన్నింటిని రెండు రకాలుగా విభజించవచ్చు.(1)చేయ తలచినవి. (2)చేయ వలసినవి.
*చేయతలచినవి* వీటిని చేయక పోయినా పర్వాలేదు.అయినా చేస్తాం. కొన్నింటిని అలవాటుగా , మరికొన్ని టైమ్ పాస్ కి, ఇంకొన్ని గొప్పలు,కోసం చేస్తాం. వీటి వలన నష్టమే గాని ప్రయోజనం వుండదు.అయినా ఇష్టంగా చేస్తాం.
*చేయవలసినవి* ఇవి చాలా తక్కువగా వుంటాయి. వీటిని నీరసంగా, గత్యంతరం లేనట్లు, చేస్తాం.అయినా ఇవి మనకు ప్రయోజనాలను ఇస్తాయి.
*ధ్యానం చేయతలచిన పనులను ప్రక్కకు నెట్టి చేయి వలసిన పనులను ఇష్టంగా చేసే టట్లు చేస్తుంది*
*షణ్ముఖానంద9866699774*
No comments:
Post a Comment