🔥ప్రతి మనిషీ సంతోషాన్ని కోరుకుంటాడు.
🌹తన జీవితం ఆనందభరితం కావాలని ఆశిస్తాడు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా సగటు మనిషి గుర్తించలేడు.
🔥 మరేదో వస్తేనే ఆనందం అని భ్రమపడతాడు.
🌹అందరూ ఒకేలా ఉండరు. ఒకేలా ఆలోచించరు.
ఎవరి దృక్పథాలు వారివి.
🔥ఒకరికి సంతోషాన్ని ఇచ్చిన సందర్భం మరొకరికి ఇవ్వదు.
🌹వైద్యశాస్త్రం ప్రసాదించిన ఔషధాలు సైతం ఒక జబ్బుకు ఒకరికి పనిచేసినట్లు మరొకరికి పనిచేయకపోవచ్చు.
🔥ఇది ప్రకృతి వైవిధ్యానికి నిదర్శనం.
🌹ఒక వ్యక్తికి జబ్బు చేసినప్పుడు మందులు వాడితే శారీరక బాధ నయమవుతుంది.
🔥అయినా కొందరు తమ వ్యాధి ఇంకా తగ్గలేదని వాపోతారు.
🌹అందుక్కారణం జబ్బు ఆత్మలో లయం కావడమే అన్నది విజ్ఞుల భావన.
🔥ఆత్మకు పట్టిన జబ్బును భౌతిక ఔషధాలు నయం చేయలేవు.
🌹ధ్యానం వల్లనే అది సాధ్యం అంటారు గురువులు.
🔥నిజానికి మనిషి భయస్తుడు.
🌹పశు పక్షి మృగాలు తమ శరీరానికి ఏదో అయిపోతుందని బెంగపడవు.
🔥శత్రువు అలికిడి అయితే ఉలిక్కిపడతాయి. వెంబడిస్తే పారిపోతాయి.
🌹మనిషి భయానికి అనేక కారణాలు!
🔥ఉన్నది పోతుందని, రాబోయేది దక్కదని మనిషి మాత్రమే భయపడతాడు.
🌹ఏ ఇతర ప్రాణికీ లేని మృత్యుభయం మనిషిని వెంటాడుతుంది.
🔥తనలోని ఆత్మకు చావు లేదని మనిషి బలంగా విశ్వసించినప్పుడు, ఈ శరీరం పోతుందేమో అన్న భయం నుంచి కొంతవరకు ముక్తుడవుతాడు.
🌹అలా మనిషి మృత్యుభయాన్ని జయించవచ్చునంటారు ఆధునిక భాష్యకారులు శ్రీకృష్ణ గీతోపదేశానికి కొనసాగింపుగా.
🔥మృత్యు భయాన్ని ఆధునిక వైద్య శాస్త్రం సైతం పోగొట్టలేకపోతోంది.
🌹చాలా వ్యాధులను అది పూర్తిగా నయం చేయలేదు. కేవలం నియంత్రిస్తుంది.
మనిషి మరణ సమయాన్ని వాయిదా వేయగలుగుతుంది. అంతే!
🔥మృత్యు భీతిని జయించే మార్గాన్ని ఉటంకిస్తూ ఓషో ధ్యానాన్ని సూచించాడు.
🌹నిరంతరం అభ్యసిస్తే ధ్యానం ఒక్కటే మనిషి మరణ భయాన్ని తొలగించగల దివ్య ఉపకరణమన్నది ఆయన భావన.
🔥మరణం అన్న పదం నిష్క్రమణ అర్థాన్ని సూచిస్తుంది.
🌹ఆత్మ, దేహం నుంచి నిష్క్రమించడం మరణం.
🔥అప్పుడు మనిషి అనుభవించే నిరంతర బాధలకు ముక్తి కలుగుతుంది.
🌹ముక్తి దేహానికి, దేహబాధలకే గాని ఆత్మకు కాదన్నది ఇక్కడ కీలకాంశం.
🔥ఆత్మకు బంధాలు లేవు. ముక్తీ లేదు.
🌹బంధాలు, ముక్తి దేహానికే అన్నది సత్యం!
🔥ఒక కొత్త వస్తువు సమకూరితే ఆనందం కలుగుతుంది.
🌹కొన్నింటిని వదిలించుకున్నప్పుడు ఆనందం లభిస్తుంది.
🔥ఓ రోగం దూరమైనప్పుడు ఆనందానుభవం చూడవచ్చు.
🌹తృప్తిని మించిన ఆనందం మరొకటి లేదు.
ఏది ఉన్నా, ఏది లేకపోయినా తృప్తి అన్నది ఒకటుంటే మనిషికి బతుకంతా ఆనందమే!
🔥ఒక ప్రాణాంతక వ్యాధి నయమైతే మనిషి మృత్యువును జయించాడంటారు.
🌹నిజానికి చావును వాయిదా వేయగలిగాడన్నది వాస్తవం.
🔥మరణాన్ని ఎంతకాలం వాయిదా వేయగలిగితే అంత ఆరోగ్యంగా మనిషి జీవించాడని చెప్పవచ్చు. మరణాన్ని ఎవరూ ఆపలేరు.
🌹చేయగలిగింది చావు తేదీని పొడిగించడమే!
🔥జయించగలిగింది మరణాన్ని కాదు, మరణభీతిని అన్నది తెలుసుకోవలసిన నిజం.
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment