[12/7, 08:53] +91 73963 92086: ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జునుడిలాంటి మనం అంటే “నరులం” .. ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుని ఆ రకంగా జీవించాలి. అప్పుడు మన జీవితరధానికి పూర్ణాత్మ అయిన “నారాయణుడు” రథసారధిలా సారధ్యం వహిస్తూ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణుడిలా అంటే తనంతటి పూర్ణాత్మలా మార్చేస్తాడు.
మళ్ళీ ఆ సరి క్రొత్త పూర్ణాత్మ .. సూర్యకిరణాలలా .. వేల కొద్దీ అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి వారికి సందేశాలు అందిస్తూ .. వారి ద్వారా తాను సృష్టి రచనా విన్యాసంలో పాలుపంచుకుంటూ ఉంటుంది.
ఇదంతా జరగాలంటే ముందు నరుడిలా పుట్టిన అంశాత్మలో .. నారాయణుడిలాంటి “పూర్ణాత్మ”ను తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలుకావాలి. అందుకు తపన చెందాలి; సాధన చెయ్యాలి.
*“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే*
*యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః”*
(భ.గీ.7-3)
“వేలకొద్దీ మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు” అని లెక్కలు కూడా కట్టారు భగవాన్ శ్రీకృష్ణుల వారు. అంతేకాదు
*“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ*
*అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః”*
(భ.గీ.18-66)
“సర్వధర్మాలనూ అంటే సమస్త కర్తవ్యకర్మలనూ తాత్కాలికంగా పరిత్యజించి .. నీలో నువ్వు స్వీయ శరణు భావనతో వుండు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వే విముక్తి చెందించుకుంటావు” అని అభయం కూడా ఇచ్చారు.
“ఇక్కడ ‘మామ్’ అంటే అంశాత్మ అనీ ‘అహం’ అంటే ‘పూర్ణాత్మ’ అనీ గుర్తించి మన సకల ఇంద్రియ ధర్మాలనూ, కుటుంబ ధర్మాలనూ ఒకింత ప్రక్కన పెట్టి .. ధ్యాన అభ్యాసం చెయ్యాలి” అని అర్థం చేసుకోవాలి.
కళ్ళు రెండూ మూసేసుకుని మన అంతరంగంలోకి ప్రవేశించి మన స్వీయ ఆత్మను అంటే “మామ్”ను మనం శరణు వేడాలి. అప్పుడు మన “పూర్ణాత్మ” అంటే మన “అహం”.. మనం గత అనేకానేక జన్మలుగా కూడబెట్టుకున్న అనేకానేక పాపకర్మల నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది.
మనం కొంత చేస్తే .. మన పూర్ణాత్మ మిగిలింది చేయగలుగుతుంది. మనం చెయ్యవలసింది చేస్తేనే మనం పొందవలసిన వాటిని ఏ ఆటంకం లేకుండా సకాలంలో పొంది శోకవిముక్తులం అవుతాము.
విశ్వనియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటీ అక్కడ ఖచ్చితంగా అమలుపరచబడుతుంది.
కనుక ఎంత “ఎరుక”తో మనం ఇక్కడ జీవిస్తే పైలోకాలలో అంత ప్రశాంతంగా ఉంటాం; అదే “సరస్వతీ జ్ఞానం” మరి ఆ సరస్వతీ జ్ఞానాన్ని మనకు తత్త్వ దర్శినులే అందిస్తారు. అలాంటి తత్త్వదర్శినులు దానికి సంబంధించిన ప్రశ్నలనే మనం తత్త్వ దర్శనులను అడగాల్సిందే.
తత్త్వదర్శనం పొందిన “జ్ఞానులు” మనకు సత్యాన్ని బోధిస్తారు:
*“తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా*
*ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః”*
(భ.గీ.4-34)
“తత్త్వదర్శనుల నుంచి జ్ఞానాన్ని గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి .. సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచితరీతిలో ప్రశ్నించాలి. అప్పుడు ఆ జ్ఞానస్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారు” అని తెలియజేసారు శ్రీకృష్ణుల వారు.
“రెండు కాళ్ళూ .. రెండు చేతులూ, ఒక మొండెం .. ఒక శిరస్సు .. మనస్సు మరి బుద్ధి” అనే ఎనిమిది అంగాలతో శ్వాసగురువుకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.
అంటే బహిరేంద్రియాలనూ, మనస్సునూ బుద్ధినీ “శ్వాస గురువు”కు అధీనం చేసి .. “పరి సేవ” చెయ్యాలి. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబడి మన దివ్యచక్షువు తెరుచుకోబడి .. తత్త్వదర్శనులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్యచక్షువులో దర్శనం ఇస్తారు. వారిని మనం “చనిపోయిన తరువాత ఏమౌతుంది?” అన్న పరిప్రశ్న వేసి వారి నుంచి “సరస్వతీ జ్ఞానాన్ని” పొందాలి. అదొక్కటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానం.
అంతే కానీ ధ్యానంలో జ్ఞానస్వరూపులు దర్శనం ఇవ్వగానే .. “నా కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుంది?” .. “నాకు ప్రమోషన్ ఎప్పుడొస్తుంది?” .. “నాకు పిల్లలు పుడతారా?” .. “నా స్థలానికి ఎంత రేటు వస్తుంది?” అంటూ మూర్ఖపు ప్రశ్నలు అడగకూడదు. అలా అడిగిన వారు ఏమీ సమాధానం చెప్పరు.
ఊరికే మనవైపు కాస్సేపు చూసి వెళ్ళిపోతారు అంతే! ఏకలవ్యుడు తపస్సు చేసి శారదాదేవి ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు అతడు తనకు గొప్ప విలువిద్యను ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. ఆమె “తథాస్తు” అంది! కానీ ఆ విలువిద్య అతనికి పనికి వచ్చిందా? శారదా దేవి అంతటి తత్త్వదర్శిని ప్రత్యక్షమైనప్పుడు .. “ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతీజ్ఞానాన్ని ఇవ్వమ్మా” అని కోరుకోవాలే కానీ .. ఈ లోకంలోనే పనికివచ్చే విలువిద్యను కోరుకోవడం తప్పు.
మన జీవిత పరిస్థితులను మనమే ఎంచుకుని వచ్చాం కాబట్టి .. “వాటిని మార్చెయ్యాలి” అనుకోవడం తప్పు.
[12/7, 08:53] +91 73963 92086: “ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేనిపట్ల కూడా ద్వేషభావం లేనివాడు దేనికీ శోకింపని వాడు, దేనినీ ఆశింపనివాడు .. శుభాశుభ కర్మలను త్యజించిన వాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు” అని ఒకానొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.
ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా దేనిపట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికీ శోకించకుండా ప్రకృతి మనకు అందించిన వాటిని “ఉన్నది ఉన్నట్లుగా” స్వీకరించి ముందుకు సాగుతూ మనం స్వర్గలోకానికీ .. మర్త్యలోకానికీ మధ్య రాకపోకలు చేయాలి. వస్తూ పోతూండే ఈ క్రమంలో .. క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరివేసినట్లు వదిలివేస్తూ .. మళ్ళీ క్రొత్త బట్టలను ధరించినట్లు .. క్రొత్త జన్మలో క్రొత్త శరీరాన్నిధరిస్తూ ఉండాలి.
అనగ అనగ రాగమతిశయించినట్లు రాగాపోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా “అకామాలు” అయిపోయి .. పరిశుద్ధం చెందబడతాయి.
*“అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే*
*తేషాం నిత్యాభియుక్తానాంయోగక్షేమం వహామ్యహామ్”*
(భ.గీ.|| 9-22)
“వేరే ప్రాపంచిక ఆలోచనలు లేకుండా నిరంతరం తనలో తాను నిమగ్నమవుతూ నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగక్షేమాలను వారు స్వయంగా వహిస్తుంది” అని భగవాన్ శ్రీకృష్ణుల వారు తెలియజేశారు.
ప్రతి ఒక్క ఖజానాను తెరవడానికి ఒక రహస్యమైన “తాళం చెవి” ఉన్నట్లే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కూడా ఒక రహస్యమైన “తాళం చెవి” ఉంది.
అదే “మామ్” మరి “అహం” పదాలు యొక్క సరియైన అర్థాలు:
ఇక్కడ “మామ్” అన్నా మనమే .. మరి “అహం” అన్నా మనమే! ఒకటి మన అంశాత్మకు సంకేతం మరి ఇంకొకటి మన పూర్ణాత్మకు సంకేతం! రెండూ మనమే!
అంశాత్మలమైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ, పూర్ణాత్మనే సేవిస్తూ .. పూర్ణాత్మనే ధ్యానిస్తూ .. నిష్కామ భావంతో పూర్ణాత్మనే చింతిస్తూ ఉంటే .. మన పూర్ణాత్మే మన యోగక్షేమాలను చూసుకుంటూ ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంతటి పూర్ణాత్మలుగా పరిమారుస్తుంది! అంటే మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నామన్న మాట!
*“ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్*
*ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః”*
(భ.గీ.6-5)
“ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తమను తాము అధోగతి పాలుచేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు” కనుక .. మనం చెయ్యవలసిందల్లా నిరంతరం ధ్యానసాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమై ఉండడమే .. అదే మనకు వున్న ఒక్కగానొక్క రాచబాట!
ఇలా నిరంతరం ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్త్వం అవగతమై .. మన ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం దూరం అవుతుంది కనుక ..
*“తపస్వి యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః*
*కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున”*
(భ.గీ.6-46)
“ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. సకామ సాత్విక కర్మలను ఆచరించే వారి కంటే శ్రేష్ఠుడని భావించవచ్చు, కనుక అర్జునా! యోగివి కా” అని సూచించాడు శ్రీకృష్ణుడు.
రకరకాల పూజలూ, ఉపవాసాలూ మరి తపస్సులూ చేస్తే శరీరం తపిస్తుందే కానీ ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం మాత్రం పోదు గాక పోదు! సకల సంస్కృత శ్లోకాలను కంఠతా పట్టేసి రకరకాల శాస్త్రవిజ్ఞాన గ్రంథాలను పఠించేస్తే అక్షర పండితుడు అనబడతాడు కానీ అతని ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం పోదు గాక పోదు! గొప్ప గొప్ప కర్మలు చేసి ఎన్నెన్నో కీర్తిప్రతిష్ఠలు పొందినా ఆత్మను ఆవరించి వున్న అజ్ఞానం పోదు గాక పోదు! అందుకే ..
*“క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే*
*క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప”*
(భ.గీ.2-3)
“ఓ అర్జునా! పిరికితనానికి లోనుకావద్దు .. నీకు ఇది ఉచితం కాదు. ఓ పరంతపా! ఈ హృదయందౌర్భల్యాన్ని వీడి యుద్ధం చేయడానికి నడుము బిగించు” అంటూ కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు.
“శరీరం” అన్నది “ఆత్మ” కు “నీడ” వంటిది. శరీరానికి రోగం వచ్చినప్పుడు నీడకు చికిత్స చేస్తే లాభం లేనట్లు ఆత్మకు “అజ్ఞానం” అనే రోగం ఆవరించినప్పుడు దాని నీడలాంటి శరీరంతో తపస్సులు చేసినా, ఉపవాసాలు చేసినా, ఆసనాలు వేసినా, పుణ్యనదులలో మునిగినా మరి స్త్రోత్ర పారాయణలు చేసినా లాభం ఉండదు! చెయ్యవలసింది .. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుకుని ధ్యానం చేసి ఆత్మమూల ప్రకృతితో సంయోగం చెంది సత్యాన్ని అవగతం చేసుకోవడం.
సత్యాన్ని తెలుసుకునేంత వరకూ .. దానిని తెలుసుకోవడమే మన పని! మరి తెలుసుకున్నాక దానిని అందరికీ తెలియజెయ్యడమే మన పని!
మనం ఎవరిమో ఏ పని కోసం పుట్టామో తెలుసుకునేంత వరకూ మన ఆత్మకు దుఃఖమే ఉంటుంది. తెలుసుకున్న తరువాత ఇక ఆ చెయ్యాల్సిన పని చేస్తూంటే ఆనందమే ఆనందం! అలనాడు గౌతమ బుద్ధుడు అనుభవించిన ఆనందం అదే .. మరి ఈ రోజు ఆనాపానసతి .. “శ్వాస మీద ధ్యాస” ధ్యానప్రచారం చేస్తూ పిరమిడ్ మాస్టర్స్ అనుభవిస్తూన్న ఆనందం అదే!
No comments:
Post a Comment