Sunday, December 11, 2022

:::భరించ లేక పోవడం:::

 *:::::::::భరించ లేక పోవడం:::::::::*
    ఈ శరీరం సుఖాన్నిఇస్తుంది.
అలాగే బాధ/నొప్పి ని కూడా ఇస్తుంది.
    సుఖం కావాలంటాం, సుఖానుభూతి కోసం వెంట పడతాం. మరింత సుఖం కోసం  , అత్యంత సుఖం కోసం ఉవ్విళ్ళూరుతాం.
       ఈ శరీరం పెట్టే బాధ వద్దు అంటాం. కలిగే పరిస్థితి ని నివారిస్తాం. కలుగు తున్నప్పుడు అడ్డుకుంటాం. వ్యతిరేకిస్తాం.
     ఈ సందర్భంగా భరించలేక పోవటం అంటాం. ఇది నిజంగా వుందా???
    భరించ లేక పోతే కోమాలోకి వెళ్తాం.లేదా మరణిస్తాం.
 బ్రతుకు తున్నాము అంటే భరించ కలుగు తున్నామనే అర్థం.
    భరించ లేక పోతున్నాను అనేది శరీరం కాదు మనస్సు.
   *ఈ మనస్సు కి ఓర్పు,సహనం ఇచ్చే శిక్షణ పేరే ధ్యానం.*

*షణ్ముఖానంద.  9866699774*

No comments:

Post a Comment