💖💖💖
💖💖 *"399"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"గాఢనిద్రలో పొందే శాంతిని మెలకువలో కూడా పొందే వీలవుతుందా ?"*
*"అవుతుంది ! గాఢనిద్రలో కూడా మనం ఉంటున్నాం. కానీ అప్పుడు మనకు ఏ గుణాలు ఉండటంలేదు. మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. అందుకే అక్కడ అందరం శాంతంగానే ఉంటున్నాం. నిద్రించే ముందు వరకు ఉన్న శారీరక, మానసిక బాధలు అక్కడ ఉండటంలేదు. చివరికి శరీర అవసరాలైన ఆకలి, దాహం, విసర్జన వంటివి కూడా మెలకువ వచ్చిన తర్వాతే మనకు తెలుస్తున్నాయి. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. మెలకువ రాగానే మనసును అనేక గుణాలు అలముకుంటున్నాయి. మనసుకు అలవడే గుణాలను తొలగించుకోగలిగితే మెలకువలో ఉన్నప్పుడు కూడా గాఢనిద్రలోని శాంతిని పొందగలుగుతాం. ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం సంపాదించుకునే ఆ స్థితికే ముక్తి, మోక్షం, దైవదర్శనం, ఆత్మానుభవం అని అనేక పేర్లున్నాయి. ఈ గుణాలను తొలగించుకోవటంలో మనం చేయాల్సింది ఏమిటో గుర్తించి ఆచరించటమే సాధకుడి కర్తవ్యం !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment