Thursday, December 8, 2022

🌻 సందేహప్రాణి

 🌻 సందేహప్రాణి 

ఒక పామర వ్యక్తి ఒక సాధువుతో  "మీరు సదా భగవంతుని ధ్యానంలోనే వుంటారు కదా మరి ఆ దేవుడు అందరికీ నిజంగా సహాయం చేస్తాడా ?   ఆ విషయం మీరు నమ్ముతున్నారు ?  అని అడిగాడు.

అందుకు ఆ సాధువు "అందులో సందేహం లేదు. భగవంతుడు తప్పక  అర్హులైన వారందరికీ తప్పక సాయం చేస్తాడు." అని చెప్పాడు.

"అయితే, మీరు భగవంతుని ఎలా ? ప్రార్ధిస్తారో నాకు చెప్పండి. నాకు తక్షణమే పదివేల రూపాయలు అత్యవసర పడుతున్నాయి. నేను తక్షణమే భగవంతుని ప్రార్ధించి ఆ ధనం పొందాలి" అని అడిగాడు ఆ పామరుడు.

అందుకు సాధువు చిరునవ్వుతో "దానికి ముందు  నేను మీకు ఒక మాట చెపుతాను వినండి.నేను మిమ్మల్ని ఒక ధనవంతునికి పరిచయం చేశాననుకోండి. మీరు తక్షణమే ఆయన జేబులో నుంచి  స్వతంత్రంగా డబ్బును తీసుకొనగలరా?"

"అది తప్పు కదా.." అన్నాడు ఆ వ్యక్తి.

"ఔనా ! మరి మీరు ఏమి చేస్తే ఆ చనువు, స్వాతంత్ర్యం 
వస్తుంది?" వారిని పరిచయం చేసుకుని వారికి చేరువ కావాలి.. వారి నమ్మకానికి పాత్రమవ్వాలి.  ప్రేమాభిమానాలు పొందాలి కదా ? అలాగే భగవంతుని వద్ద కూడా యిదే మార్గం అనుసరించాలి. దైవాన్ని మీ భక్తి శ్రధ్ధలతో మెప్పించి  వారి అనుగ్రహం పొందాలి. అప్పుడు  భగవంతుడు మీ కోరికలేవో అడగకుండానే అనుగ్రహిస్తాడు అర్ధమైనదా ? " అని అడిగాడు సాధువు.

సాధువు మాటల అంతరార్ధం గ్రహించుకొన్న ఆ వ్యక్తి  మహాత్మునికి  వందనం చేసి వీడ్కోలు తీసుకున్నాడు.
     నమ్మకం, విశ్వాసంతో సరైన సాధన చేస్తే అద్బుతాలు చూడడమే కాదు అద్బుతాలు సృష్టించే మహా గొప్ప శక్తిగా ఎదుగుతారు, అనుమానాలు నుండి అనుమానలు రావు స్థాయికి ఎదుగుతారు... ప్రతి సమస్యకూ పరిష్కారం చూపించే శక్తి సామర్థ్యాలు కలిగి యుంటారు... విన్నవారు కూడా ఎవరి సమస్యలు వారే పరిష్కరించు(దగ్ధం) కోవాలి సరైన సాధన ద్వారా మాత్రమే.. ప్రశ్నలు వేసేవారు ప్రశ్నగానే మిగిలి పోతారు... సాధన చేసినవారే ప్రతి ప్రశ్నకు సమాధానం పొందుతారు..
          * * 🌷* *

No comments:

Post a Comment