Sunday, April 23, 2023

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ✍️ చాగంటి

 దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో
                   ✍️ చాగంటి
🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

🪷 *నరుణ్ణి, నారాయణునిగా చేసేది దైవీ సంపద.  నరుణ్ణి వానరుడిగా చేసేది ఆసురీ సంపద.  మనిషిలో దైవంశా ఉంది, అలాగే.. రాక్షసాంశా ఉంది.*

🪷 తన కర్మలతో తాను దేవుడూ కావచ్చు. రాక్షసుడూ కావచ్చు. *"యధేచ్చసి తథాకురు".* 'నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో' అంటూ భగవంతుడు మనకు కర్మ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించారు. 

🪷 నా కర్మ.. నా గ్రహచారం.. అంటూ ఏడుస్తూ కూర్చోవాల్సిన పని లేదు. *'క్లైబ్యం మాస్మ గమః'*.. పిరికి పందవు  కావద్దు.. అని హెచ్చరిక. 

మరి ఏం చేయాలి.. 

🪷 *'ఉద్ధరేదాత్మనాత్మానం'*.. "నిన్ను నీవు ఉద్ధరించుకో.. పురుషార్ధం చెయ్యి.. అని ప్రోత్సహిస్తున్నాడు.

🪷 తన వెంట వచ్చే సంపద (పుణ్యం, పాపం, జ్ఞానం) గురించి ఆలోచించడు మానవుడు. విడిచి పెట్టిపోయే సంపదల (డబ్బు, ఇల్లు, పొలం, స్థలం, నగలు...) కోసం జీవితంలో చివరి రక్తపు బొట్టు వరకు.. చివరి శ్వాస వరకు తపించిపోతూనే ఉంటాడు. అన్నీ ఉన్నప్పుడు అహంకారం. అంతా ఉడిగిపోయిన తరువాత శ్రద్ధ. శ్వాసలున్నంత వరకు ఎవరన్నా లెక్కలేదు. శ్వాస ఎగిరిపోయే సమయంలో డాక్టర్ల కాళ్ళ మీద పడతారు.

🪷 వాళ్ళు మాత్రం ఏం చేస్తారు.. వాళ్ళ దగ్గర మందు ఉంటుందే గాని ఆయుష్షు ఉండదు గదా? రోగానికి మందు ఉంటుంది గాని రోగికి మందు ఉండదు. కనుక ఓ మానవుడా.. నీ గడియ గడియా అయిపోతున్నదని గడియారం టక టకా గంటలు కొట్టి హెచ్చరికలు చేసున్నది. త్వరగా.. "మేలుకో.. మేలుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో". నీలో జరిగే ఈ ఆసురీ సంపదకు.. దైవీ సంపదకు మధ్య పోరాటాన్ని గమనించు.

🪷 _*నీ బలం దైవీ సంపదకు ఇవ్వు. ఆసురీ సంపదను పారద్రోలు. అప్పుడే నీ లక్ష్యం నెరవేరుతుంది...*_

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు

*సేకరణ:* 

No comments:

Post a Comment