Wednesday, September 25, 2024

🌹గుడ్ మార్నింగ్ 🌹ఈ సృష్టిని మనకు తెలిసినంత వరకు పరిశీలిస్తే మంచి, చెడు, కర్మ ఫలాలు తిరిగి అనుభవించటం -  ఇవన్నీ ఒక్క మనిషికి మాత్రమే ఉన్నట్లుగా కనపడతాయి. ఇదే విధముగా సృష్టిలో తనకు అవసరమైన వస్తువులు, విషయాలతో ఒక మానవ లోకాన్ని మనిషే తయారుచేసుకున్నాడు. మిగిలినవన్నీ సృష్టికి అనుకూలముగా జీవిస్తున్నట్లు కనపడుతున్నది. మనిషికి ఈ ప్రత్యేక జ్ఞానము సృష్టిచే ఇవ్వబడింది. ఈ జ్ఞాన స్పర్శ చేతనే మంచి చెడులు మనిషికి తెలుస్తున్నాయి. తెలుస్తున్న వాటిలో ఇవి చేయకూడదు అని, ఇలా వుండకూడదు, ఇలా భావించకూడదు, ఇలా ఆలోచించ కూడదుఅని తెలుస్తూ - మొత్తముగా ఎలా జీవించకూడదో - ఎలా జీవించాలో - తనలోపలే తనకు తెలుస్తున్నా సరే ..... 
తప్పులతో , చెడులో జీవించటం మనిషిలో జంతు లక్షణం.................
జంతువులకు మంచి చెడుల జ్ఞానము ఇవ్వబడలేదు. కనుక అవి అలా వున్నా వాటికీ కర్మ ఫలానుభవము తెలియదు.
కాని విచక్షణ - జ్ఞానము ఇవ్వబడి, మంచి చెడు తెలుస్తున్న మనిషి - చెడులో జీవిస్తున్నాడు అంటే తనలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించటం లేదు, కనుక జంతువువలె జీవిస్తున్నాడు. జ్ఞానము ఇవ్వబడి వున్నది కనుక ఆ చెడు కర్మల ఫలము అనుభవమునకు తెలుస్తున్నది.............
ఈ చెడును పోగొట్టి, చెడు కర్మఫలానుభవమును పోగొట్టి, జంతు స్థితి నుండి మనిషిని జ్ఞానిగా మార్చేదే ఆధ్యాత్మిక, స్వీయ ఆత్మజ్ఞాన అంతరంగ చదువు. నీ లోపలే నీకు అన్ని తెలుస్తున్నప్పుడు - నిన్ను నువ్వు ఎందుకు జంతువుగా ఉంచుకుంటావు? జ్ఞానముతో మంచిగా బ్రతికి, మనిషిగా - జ్ఞానిగా జీవించు అంటూ దారులు చూపించిదే ఆధ్యాత్మిక చదువు. నిన్ను నువ్వే చదువుకో - నిన్ను నువ్వే తెలుసుకో - నీ అనంత ఆత్మ తాత్వాన్ని కలుసుకో...... 🌹god bless you 🌹

No comments:

Post a Comment