🕉️ ఓం నమః శివాయ 🕉️
*ఆచార్య సద్బోధనా
లోకంలో మనుష్యులు నాలుగు రకాలు
ఉంటారని శాస్త్రం చెప్పిందని పెద్దలమాట.
స్వార్ధ, పరార్ధ, పరమార్ధ, వ్యర్ధ జీవులని!```
*స్వార్ధ*:-```
తనూ , భార్యాపిల్లలు, కోసమే నాలుగురాళ్ళసంపాదనే ధ్యేయంగా జీవిస్తుండేవారు స్వార్ధ జీవులు.```
*పరార్ధ*:- ```
తమకోసం కాకుండా కేవలం పరహితమే ధ్యేయంగా జీవిస్తుంటారు.```
*ఉదా :-*```
వృక్షములు , నదీనదములు, గోవులు వగైరా.```
*పరమార్ధ*:- ```
కనిపించే ప్రతీ వస్తువూ అశాశ్వతమనే పరమార్ధ భావనతో జీవిస్తూ మానవాళిని ఉద్ధరించడమే ధ్యేయంగా జీవిస్తుంటారు.```
*ఉదా:-*```
ఆదిశంకరులు, మహర్షి రమణులు, రామకృష్ణ పరమహంస వంటివారు.```
*వ్యర్ధ* :- ```
అసలు తామెందుకు పుట్టామో, ఏమి చేస్తున్నామో, ఏంచేయాలో కనీసం తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకుండా జీవిస్తుండేవారు వ్యర్ధజీవులు.✍️```
🙏 *సర్వం శ్రీ శివార్పణమస్తు
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
No comments:
Post a Comment