*వర్జ్యం అంటే !*
➖
(చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు.)
*జ్యోతిష్యంలో వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.*
ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది .
వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.
అశుభ సమయం.
శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.
ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది. జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని, చంద్రస్ఫుటం గాని, ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ, అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.
భారతీయులు…. నూతనంగా ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా, మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటారు.
అటు దైవకార్యాలకి ఇటు శుభకార్యాలకి మంచి ముహూర్తం చూడటమనేది ప్రాచీనాకాలం నుంచి వస్తోంది.
ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటం వలన, అందరూ ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.
ఈ నేపథ్యంలోనే ‘వర్జ్యం’ అనే పేరు ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది.
‘వర్జ్యం’ అంటేనే విడువదగినది అని అర్థం. అంటే వర్జ్యం వున్న సమయాన్ని విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతోంది.
”ఇప్పుడు వర్జ్యం వుంది తరువాత బయలుదేరుతాం” …
”కాసేపాగితే వర్జ్యం వచ్చేస్తుంది … త్వరగా బయలుదేరండి” అనే మాటలు మనం తరచూ వింటూ వుంటాం.
వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు.
ఈ కారణంగానే పెద్దలు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.
వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది.
ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
ఈ సమయంలో దానాలు చేయడం వలన అనేక దోషాలు తొలగిపోతాయని అంటారు.
వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.
అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది.
ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
No comments:
Post a Comment