🌹గుడ్ మార్నింగ్ 🌹మనపై మనకు నియంత్రణ లేకపోవడమే మనో చంచలత్వం. వద్దు అనుకున్నవి - వింటాము, మాట్లాడతాము,చూస్తాము, చేస్తాము, తింటాము, తాగుతాము. చిత్రమేమిటంటే వద్దు అనుకునేది కూడా మనమే.........................
మనమే మనతో విరోధముగా ఉంటూ - ఎప్పటికప్పుడు మారే మనకు అనుకూలముగా ఎదుటి వారు లేరని బాధపడుతూ ఉంటాము..............
మనను బాధపెట్టేవి - బాధపెట్టేవారు బయటలేరు. మన లోపల - మనకు మనమే వ్యతిరేకముగా వున్నాము. మన ఆలోచనలు, పనులే మనకు మనం విరుద్ధముగా చేసుకుంటూ - నాకు అందరూ సహకరించాలనుకోవటం - నాకు కొందరు వ్యతిరేకముగా వున్నారనుకోవటం - ఇవన్నీ ఎక్కువగా మనలోని మార్పుల వల్లనే జరుగుతున్నాయి.................
మనలో మనకు మనమే వ్యతిరేకముగా ఉన్న విషయాలను గుర్తించి - మనకు మనం అనుకూలముగా మారటమే ఆధ్యాత్మికము. వద్దు అనుకున్నవి - చెడు, చేయకూడదు అన్నవి చేయకుండా ఉండగలిగేలా నిత్య సాధన చేయాలి........................
మంచి - చేయవలసినవి అనుకున్నవి - ఆపకుండా, చేసేలా నిత్య సాధన చేయాలి... వద్దు అనుకున్నవి - చేయాలి అనుకున్నవి...
ఈ రెండింటిపట్ల నిరంతర మరుపులేని ఎరుక ఉండాలి........................
మరుపులేని - మార్చుకోని ఎరుకని సాధించుకోవటమే ఆధ్యాత్మిక సాధన.....
అయినా మన మాట మనమే వినకుండా - చుట్టూ ఉన్న అందరూ సహకరించటం లేదనుకోవటం ఎంత హాస్యాస్పదమో - గమనించుకుంటే తెలుస్తుంది..............
నీతో నువ్వు పూర్తిగా ఉండు - నీలో నువ్వు పూర్తిగా ఉండు. నీలో నీకు విభేదాలు లేకుండా నువ్వు సంపూర్ణముగా ఏకత్వముతో జీవించు... ఈ సత్యాన్ని తెలియచెప్పి, అలా జీవించేలా జ్ఞానాన్ని అందించేదే ఆధ్యాత్మిక చదువు. స్వీయ అంతరంగ ఆత్మజ్ఞాన చదువు.... 🌹god bless you 🌹
No comments:
Post a Comment