Thursday, September 26, 2024

 *పుత్రదార గృహాదిషు అనభిష్వంగః .....*

అభిష్వంగః  అంటే అతిస్నేహం,

అనభిష్వంగః అంటే తగులుకోకుండా ఉండటం. 

సంతానం, భార్య భర్త, ఇల్లు మొదలైన విషయాల పట్ల అతిస్నేహం పనికి రాదు. వీటినే ఈషణత్రయం అంటారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ  వీటిలో మానవుడు తగులుకోరాదు. వీటిని కలిగి ఉండటంలో తప్పులేదు. కాని వాటిపై అతిస్నేహం కూడదు - అని గ్రహించాలి. నిజంగా ఇవి ఏవీ శాశ్వతం కాదు. అవి నీనుండైనా దూరమౌతాయి, లేదా నీవైనా వాటికి దూరం అవుతావు. ఈ విషయాన్ని గ్రహించి వాటి కొరకే నా జీవితం, అవి లేకపోతే నేను లేను. అనే భ్రమను తొలగించుకోవాలి. 

వ్యామోహం అనే జిడ్డును వదిలించుకోవాలి. అద్దాన్ని చూడండి. అది అన్నింటిని కౌగిలించుకొంటుంది. అందరితో సంబంధం పెట్టుకుంటుంది. కాని దేనికీ అంటుకోదు. అన్నింటిని వదిలేస్తుంది. కనుక సాధకుడు అద్దంలాగా ఉండాలి. 
  
|| ఓం నమః శివాయ ||

No comments:

Post a Comment