*ఆభరణం*
*ఐశ్వరస్య విభూషణం సుజనతా,* *శౌర్యస్య వాక్సంయమో,*
*ఙ్ఞాన స్యోపశమ, శ్రుతస్య* *వినయో,విత్తస్య పాత్రే వ్యయః,!*
*అక్రోధస్తపసః,క్షమా* *ప్రభవితుః,ధర్మస్యమిర్వ్యాజతా*
*సర్వేషామపి సర్వకారణ మిదం* *శీలంపరం భూషణం!!*
```
ఇదొక అద్భుతమైన సుభాషితం!
ఆభరణం అంటే అర్థం ఏమిటో ఎవరెవరికి ఎటువంటి ఆభరణం వుండాలో చెబుతుంది...
ఎన్ని సిరి సంపదలున్నా మానవత్వం మంచితనం లేని వాడికి సమాజంలో విలువివ్వరు కనుక...‘సుజనతా’ఐశ్వర్యవంతుడి ఆభరణం!
శూరుడైనా కూడా...
’బలంవంతుడ నాకేమని’ అన్నట్లు ఏది పడితే అది వాగకుండా మితభాషి అయి వుండటం ఆభరణం!
జ్ఞాని కి ఇంద్రియ లౌల్యం నుంచి ఉపశమనం పొందటం ఆభరణం!
విని నేర్చుకునే వాడు శ్రోత, విద్యార్థి వారికి వినయం ఆభరణం!
అధికారం వున్నవాడికి పాత్రత తెలుసుకుని వ్యవహరించడం ఆభరణం!
మరియు...
కోపం లేక పోవటం ఆభరణం!
ఉన్నత స్థాయిలో వున్నవాడికి క్షమా గుణం, ధర్మం తప్పకుండా ఆచరించడం ఆభరణం!
ఇవికాక సర్వ కాల సర్వావస్థలలోనూ అందరూ కలిగివుండవలసిన ఆభరణం సౌశీల్యం!
ఆభరణం అంటే ఏమిటో, దాని విలువ తెలియక, మూర్ఖ మానవుడు పైకి కనిపించే వస్తువులనే ఆభరణాలని భ్రమ పడి సంబరపడిపోతుంటాడు.
No comments:
Post a Comment