Sunday, September 29, 2024

 బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం, వైష్ణవాస్త్రం, నాగాస్త్రం మొదలైనవి శక్తిమంతమైన అస్త్రాలు అంటారు కదా. కానీ, వీటి ప్రయోగం వలన మహాభారతంలో గాని, గాని రామాయణం ఎవరూ మరణించలేదు. అంటే ఇవి శక్తివంతమైన అస్త్రాలు కావా?
గురువుగారు శర్మ గారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. ఆ అస్త్రాల శక్తీ ,వాటి ఉదృతి రామాయణ, భారతం లో పాల్గొన్న ఏ కొద్ది మంది అతి మహా రధుల పైన తప్ప ఇతరుల పైన వాడెతంట అల్పమైనవి కాదు. రామాయణం లో కేవలం రావణుడు, ఇంద్రజిత్ తప్ప ఇతరులు తపస్సు చేసి అస్త్రాలు సిద్దించుకొన్న సరి సమానులు కారు. అలాగే భారతం లో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వద్ధామ, కర్ణుడు, ఒకరిద్దరు తప్ప కౌరవుల పక్షాన ఎవరూ లేరు. మిగతా వారు అందరూ కేవలం మానవ మాత్రులు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు వారిమీద అవి నిజానికి ఎవరివద్ద ఉన్నా ప్రయోగించ కూడదు.

బ్రహ్మాస్త్రం రామాయణం లో హనుమ మీద రావణుడి కుమారుడు ప్రయోగిస్తాడు కానీ హనుమ పై ఏ అస్త్రాలు పని చేయక పోయినా రావణుడికి సందేశం ఇవ్వాలని కట్టుబడి ఉన్నట్టు నటించాడు కానీ ఈ లోపల అతనిపై మరో చిన్న అస్త్రం ప్రయిగింప బడితే బ్రహ్మాస్త్రం విడిపోతుంది అని తెలిసినా హనుమ కట్టుబడినట్టే నటించాడు. తర్వాత as అశ్వద్ధామ ఉత్తర గర్భం మీద ప్రయోగించడం అదీ తెలిసిందే.

ఇక నారాయాణా స్త్రం వస్తూ ఉంటే అస్ట్రాలు వదిలి నమస్కరిస్తే చాలు అది ఏ హానీ చేయదు. భీముడు అలా నమస్కరించక కురుక్షేత్రం లో అస్త్రం పట్టుకొనే నిలబడితే ధర్మరాజు తదితరులు అతని చేత అస్త్రం పడేయించి నమస్కారము పెట్టిస్తారు.

వైష్ణవ అస్త్రం నాకు తెలిసి ఇద్దరి దగ్గరే ఉంది అది హరి హరులు కానీ ఈ అస్త్రాన్ని కురుక్షేత్రం లో ఉన్నా వాడనట్టు గుర్తు. నాగాస్త్రం రావణుడి కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణుడి పై ప్రయోగించాడు కానీ లక్ష్మణుడు స్వయంగా ఆది శేషుడు కనక నాగాస్ట్రం ఆయన మీద పని చేయకపోయినా అది తనకే అవమానం అదీగాక నాగజాతి గౌరవ మర్యాద లకు హాని వస్తుంది అని దానికి కట్టుబడి పోయాడు. తర్వాత హనుమ చేత వైకుంఠం పంపి గరుడుడి ని పిలిపించి అతని చేత నాగ భందాలు విప్పించారు.

ఇక రావణుడి కన్నా ప్రమాదకరమైన ఇంద్రజిత్తు ని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం లాంటి పెద్ద అస్త్రాలు తో కాక కేవలం ఐo ద్రాస్తం తో సంహరించడానికి కారణం వాడు ఇంద్రుణ్ణి జయించి ఇంద్ర జిత్ అని బిరుదు పెట్టుకొని విర్రవీగాడు కాబట్టి ఇంద్రుడి పేరున ఉన్న అస్త్రం తోనే సంహరించాడు. అదీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా తన అన్న రాముడి సత్య సంధత మీదే ఒట్టు పెట్టీ మరీ అస్తం వేశాడు.

నేను రామాయణ భారత గ్రంధాలు చదివి చాలా సంవత్సరాలు అయింది కాబట్టీ నాకు మెమరీ లో ఉన్నవరకు తెలిసింది తెలిపాను. తప్పులు ఉండవచ్చు. ఉంటే మన్నించగలరు.

No comments:

Post a Comment