Friday, September 27, 2024

*****మన జీవితపు* *యధార్థ లక్ష్యం ఏమిటి?*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *మన జీవితపు*
        *యధార్థ లక్ష్యం ఏమిటి?* 
              ➖➖➖✍️

```
“స్వామి రామతీర్థ” విదేశాలలో ఉన్న సమయంలో, స్వామి రామతీర్థ జపాన్ లో ఆధ్యాత్మికపరమైన తన పనిని ముగించుకుని అమెరికాకు ఓడలో వెళుతున్నారు. 

ఏకాంతంగా రామతీర్థులవారు ఓడ పై భాగం మీద ఒకరకమైన స్వేచ్ఛా స్ఫూర్తితో నిలబడి, సూర్యకిరణాలచే ఎరుపు రంగులో ఉన్నట్లుగా కనిపిస్తూ, అనంతంగా విస్తరించిన సముద్రం మీద సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్నారు. 

ఓడ శాన్ ఫ్రాన్సిస్కో  నౌకాశ్రయానికి చేరుకోనుంది, ప్రయాణీకులందరూ తమ సామాను సర్దుకుంటూ, దిగడానికి సిద్ధపడుతున్నారు.

అయితే అవేమి పట్టించుకోకుండా, స్వామీజీ మాత్రం ఆ అద్భుత ప్రకృతి దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఓడ పైన తిరుగుతూ ఉన్నారు.

తీర్థులవారిని నిత్యం కుతూహలంగా గమనిస్తున్న ఒక విదేశీయుడు ఆయనతో, “మిస్టర్, మనం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోబోతున్నాం. మీ బ్యాగ్, మీ సామాను ఎక్కడ ఉన్నాయి?” అని అడిగాడు.

దానికి రామతీర్థ, “నాకు సామాను లేదు... ఏం ఉన్నా అది నేనే, నేను మాత్రమే" అని అన్నారు.

ఆ విదేశీయుడు ఆశ్చర్యంగా, "అంటే, మీ నిత్యావసర వస్తువులు, డబ్బు, బట్టలు ఇలాంటివి", అని చెప్పడానికి ప్రయత్నించాడు. 

దానికి స్వామీజీ, "నా దగ్గర డబ్బు ఉంచుకోను, నేను ధరించి ఉన్నవే నా వద్ద ఉన్న బట్టలు", అని అన్నారు.

విదేశీయుడు కుతూహలంతో, "మరి డబ్బు లేకుండా ఎలా జీవిస్తావు?" అని అడిగాడు.

రామతీర్థ ఇలా సమాధానమిచ్చారు, "నన్ను ఆదరించేవారు నాకు ఎలాంటి కొరత రానివ్వరు. వారు నా ఆకలి, దాహం, నా అవసరాలన్నింటినీ తీరుస్తారు." 

విదేశీయుడి ఉత్సుకత పెరిగి, మళ్ళీ ఇలా అడిగాడు, “మీ ఇల్లు ఎక్కడ ఉంది? మీరు ఎక్కడ నివసిస్తున్నారు?”

"నాకు ఇల్లంటూ ఏమీ లేదు. ‘నా ఇల్లు’ అనే హద్దులను నేను బద్దలు కొట్టాను, అందువల్ల ఇప్పుడు ఈ ప్రపంచమంతా నా ఇల్లే”, అని రామతీర్థ చెప్పారు.

ఆ అమెరికా నివాసి, రామతీర్థ వ్యక్తిత్వానికి ముగ్ధుడయ్యాడు. అతని ఉత్సుకత ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మళ్ళీ ఇలా అడిగాడు, “మీకు అమెరికాలో ఎవరైనా స్నేహితులు లేదా బంధువులు ఉండిఉండాలి?" 

రామతీర్థ నవ్వుతూ ఆ వ్యక్తి భుజం మీద చేయి వేసి, "అవును! ఒక స్నేహితుడు ఉన్నాడు, అది నువ్వే" అన్నారు.

తరువాత, స్వామీజీ యొక్క ఆ అభిమాని ఆయనకు సాటిలేని భక్తుడు అయ్యాడు. యు.ఎస్. లో ఉన్న రెండేళ్లలో, ఆ వ్యక్తి, స్వామీజీ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ప్రసంగాలన్నింటినీ నిర్వహించాడు. అమెరికా వాసులు స్వామీజీ పట్ల అపారమైన ప్రేమను కనబరిచారు. ఆయన అమాయకత్వానికి, పరిత్యాగానికి వారు ఆకర్షితులయ్యారు. 
స్వామీజీ అమెరికాలో అనేక సంస్థలను స్థాపించారు,”హెర్మెటిక్ బ్రదర్ హుడ్" అనేది వాటిలో ప్రసిద్ధమైనది.

అటువంటి సంస్థల సహాయంతో, ఆయన వేదాంతాన్ని బోధించాడు. న్యూయార్క్ లో   ఉన్నా, హిమాలయాలలో ఏకాంతంలో ఉన్నా భగవంతుని ధ్యానం మాత్రమే నిజమైన పని(కర్మ) అని స్వామీజీ చెప్పేవారు. 

ధ్యానం ఎప్పుడూ ఒకేలా ఉంటే, దాని ప్రభావం కూడా అలాగే ఉంటుంది. స్థలం, రూపం, రంగు మొదలైనవి దానిని ప్రభావితం చేయవు.
ఒక వ్యక్తికి ఎలాంటి భావాలు ఉంటాయో, ఆ భావాలే అతన్ని సృష్టిస్తాయి. జీవితం యొక్క ఉద్దేశ్యం బాహ్య సాధనలలో లేదా సఫలతలలో శక్తిని వృధా చేయడం కాదు, అంతర్గత శక్తులను అభివృద్ధి చేసుకోవడం, మనలని మనం విద్యావంతులను చేసుకోవడం, బంధాల నుండి విముక్తి పొందడం, భగవంతునితో లయం అవడం.

భగవంతునితో ఒక్కటవ్వడం ద్వారా మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలం, ఎవరైనా దీనిని హృదయపూర్వకంగా స్వీకరించినట్లయితే, కుటుంబ బాంధవ్యాలు అనేవి భగవంతుడిని పొందే మార్గంలో ఎటువంటి ఆటంకం కలిగించవు.

స్వామి రామతీర్థ సార్వత్రిక ప్రేమను ప్రధానమైనదిగా భావించి, మొత్తం ప్రపంచాన్ని తన సొంతం చేసుకున్నారు. ప్రతీ మనిషిలోనూ, ప్రతీ ప్రాణిలోనూ భగవంతుడిని చూసేవారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఎంతో గౌరవించేవారు, 'నా శ్రీ రాముడు తానై వాళ్లలో నివాసం ఉంటున్నాడు' అని అనేవారు.

ప్రపంచమంతటా ప్రేమనుపంచుతూ.. కుల,లింగ,వర్గ,వర్ణాలకు అతీతంగా ప్రపంచంలోని ప్రజలందరినీ ప్రేమించేవాడే నిజమైన మానవుడని ఆయన చెప్పేవారు.

తనను తాను "బాద్ షా రామ" అని పిలిచుకునే రామతీర్థ ఎక్కడికి వెళ్లినా ఆయనను తమ సొంత దేశస్థునివలే ప్రేమను కురిపించేవారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు లేదా క్రైస్తవులు ఎవరైనా సరే, ఆయనను కలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ తాము ధన్యులైనట్లుగా భావించేవారు.

రామతీర్థ అమెరికా,జపాన్,ఇంగ్లండ్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలను సందర్శించారు. భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక వ్యవస్థ గురించి ప్రపంచ సమాజానికి అవగాహన కల్పించడమే ఆయన ఏకైక ఉద్దేశ్యం. సంఘర్షణలతో నిండిన నేటి ఆధునిక యుగంలో కూడా ప్రాచీన ఋషులు చెప్పిన 'బ్రహ్మ'జ్ఞానాన్ని సాక్షాత్కారం చేసుకోవచ్చని ఆయన తన బోధనలతో నిరూపించారు. 
స్వామి రామతీర్థుల జీవితమే దానికి సాక్ష్యం.

ఎప్పుడూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి ఉండే స్వామి రామతీర్థ నిజానికి ఒక 'బాద్షా'(చక్రవర్తి). 

ఆయన పోర్ట్ సేడ్ నుండి భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు, ‘లార్డ్ కర్జన్’ కూడా అదే ఓడలో భారతదేశానికి వస్తున్నాడని ఆయనకి తెలిసింది. ‘ఇద్దరు రాజులు ఒకే ఓడలో ఎలా ప్రయాణం చేస్తారు?’ అని అంటూ ప్రయాణాన్ని నిలిపివేశారు.

దాదాపు 1904 ADలో, ఒక్క పైసా లేకుండా, నిర్భయంగా ఒక సన్యాసి తన ఉన్నతమైన ప్రణాళికలను అమలు చేసి, ప్రపంచానికి తన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు.✍️```

 *ఒక ఆలోచన  - అసలైన రాజు ఎవరు?* 

         ♾️♾️  ♾️ ♾️♾️


 *హృదయంలో పవిత్రత, స్వచ్ఛత ఉంటే, మీ అంతరంగ దిక్సూచి* *చాలా శక్తివంతంగా మారుతుంది. స్వచ్ఛమైన* హృదయంతో, మీరు చాలా పనులు చేయగలరు. 
 *దాజీ* హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం.
బాబూజీమహరాజ్ గారికి… నమస్కారములతో…
          
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment