కురుక్షేత్రంలో హనుమంతుడు ఎందుకు పోరాడలేదు?
కురుక్షేత్ర యుద్ధానికి ఉభయ పక్షాలూ ముందే ఏర్పాట్లు చేసుకొన్నాయి. సైన్య సమీకరణ చేసుకొన్నాయి . దైవీ శక్తులు పాండవులకూ, ఆసుర శక్తులు కౌరవులకూ సహకరిస్తూన్నాయి.
భీముడికి హనుమ ఒక వృద్ధ కపిగా కనిపించి పరీక్షించాడు.
భీముడు భేషజానికి పోక తన ఎదుట దివ్య పురుషుడు ఆ ఆకృతిలో ఉన్నాడని తెలుసుకొన్నాడు. నమస్కరించాడు.
అర్జునుడి కేతనం మీద ఉండి విజయం కలిగిస్తానన్నాడు హనుమ.
అగ్ని దేవుడిచ్చిన రథం కపి కేతనం కలది.. హనుమ రుద్రాంశ . .కేతనంలోని కపిలో ఆయన శక్తి ఆవాహన అయి అర్జునుడికి విజయం కలిగించాడు అని అన్వయం చేసుకోవచ్చు.
అడగకుండా నేనూ యుద్ధం చేస్తా అనడం వీర లక్షణం కాదు. నీవు వచ్చి యుద్ధం చెయ్యి అని ఎవరూ అడగలేదు.
అర్జునుడు తాము పోగొట్టుకున్న రాజ్యం తామే సంపాదించుకో దలచాడు.. తమ శక్తి చాలు అని భావించాడు. శ్రీకృష్ణుణ్ణి గూడా యుద్ధం చేయమని అడగలేదు.
దైవీ అనుగ్రహం ఉంటే ధర్మ యుద్ధం లో విజయం తమను వరిస్తుందని నమ్మి, పెద్దల పైన గౌరవం , వేదంపై విశ్వాసంతో ముందు కు సాగారు పాండవులు.
దైవ పరోక్ష సహకారంతో పురుషకారం ప్రదర్శించారు.
ధర్మమున్న చోట హనుమ ఉంటాడు గాబట్టి అదృశ్య రూపంలో పాండవులకు బలం చేకూర్చాడు.
No comments:
Post a Comment