*జ్ఞానదృష్టి ఎలా కలుగుతుంది.....*
(i) అమానిత్వాది గుణ సంపదవల్ల
(ii) గురువుపై, శాస్త్రాలపై విశ్వాసంవల్ల
(iii) భగవంతుని యందు అనన్య భక్తివల్ల
(iv) శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనలవల్ల
(v) సాధనలవల్ల
(vi) ఆత్మతో అనుసంధానం వల్ల
ఈ జ్ఞానదృష్టి కలుగుతుంది.
ఈ దృష్టివల్లనే మాయా ప్రకృతి నుండి విముక్తి లభిస్తుంది. జ్ఞాననేత్రం పొందిన మహాత్మునికి విలక్షణమైన అనుభవం కలుగుతుంది. ఈ జగత్తు అంతా మిథ్యయని, పరమాత్మ ఒక్కటే సత్యపదార్థమని, ఉన్నది ఒక్కటేనని, అది తానేనని అనుభవమవుతుంది. అజ్ఞాని ఎలా దేహాత్మభావనలో (దేహమే నేను అనే భావనలో) ఉంటాడో అలాగే జ్ఞాని బ్రహ్మాత్మ భావనలో (బ్రహ్మమే నేను అనే భావనలో) ఉంటాడు.
ఫోటో కెమెరా పైపై రూపాన్ని, వస్త్రాన్ని, అందచందాలను ఆభరణాలను, కనుముక్కు తీరును ఫోటో తీస్తుంది. అదే x - ray కెమెరా ఐతే శరీరం లోపల ఉన్న ఎముకలను - ఇతర భాగాలను ఫోటో తీస్తుంది. దీనిది లో దృష్టి. ఫోటోకేమేరాది బాహ్యదృష్టి. అలాగే మనకు లోదృష్టి కలగాలి. ఆ లోదృష్టియే జ్ఞానదృష్టి.
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment