Friday, September 27, 2024

 🌹గుడ్ మార్నింగ్ 🌹నిరంతరం కదలటం శరీర, మనుసుల లక్షణం. ప్రశాంతత, శాంతి, సంతోషం అన్నప్పుడు - మనకు కావలసిన దాని కొరకు కదిలి - దానిని పొంది అనుభవించినప్పుడు - కాసేపు శరీర, మనో కదలికలు ఆగుతాయి. అదే నిశ్చలత, ప్రశాంతత, శాంతి............
మరల మరొక అవసరానికో, కోరికకో కదులుతాము. ఇదే నిరంతర జీవితం. రెండు పనులు మధ్య విరామమే శాంతి. మనం దానిని గుర్తించక -- పొందటం వలన శాంతి వచ్చింది అనుకుంటున్నాము. అందువలన అనుకున్నవన్నీ పొందుతుంటే శాంతి వస్తుందన్న భావనతో నిరంతరం శాంతి కొరకు పరుగు పెడుతూ జీవిస్తున్నాము. ఏమి పొందినా - పొందకపోయినా అన్నీ వదలిన నిద్రలో ప్రతి రోజు హాయిగా, శాంతిగానే వుంటున్నాము. అంటే కదలికలు లేనప్పుడు శాంతి, హాయి వున్నాయని తెలుస్తున్నది......... అవసరాలకు తగుమాత్రం మంచిగా కదిలి - వీలున్నంత మనసును, శరీరాన్ని కదపకుండా ఉంటే శాంతి ఉంటుందని నిద్ర చెబుతున్నది................... ఈ సాధనే ధ్యానము లేక తపస్సు. నీలో నువ్వు - నీతో నువ్వు సంపూర్ణముగా ఉండటం.................... ఇదే స్వీయ అంతరంగ ఆధ్యాత్మిక జ్ఞాన చదువు. 🌹god bless you 🌹

No comments:

Post a Comment